2024 kawasaki Z650RS: మార్కెట్ లోకి కవాసకి సరికొత్త బైక్.. ధర, ఫీచర్స్ ఇవే?

ప్రముఖ వాహన తయారీ సంస్థ కవాసకి ఇప్పటికే ఎన్నో రకాల వాహనాలను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కవాసకి వాహనాలకు మార్కెట్ లో ఉన్న

  • Written By:
  • Updated On - February 19, 2024 / 07:29 PM IST

ప్రముఖ వాహన తయారీ సంస్థ కవాసకి ఇప్పటికే ఎన్నో రకాల వాహనాలను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కవాసకి వాహనాలకు మార్కెట్ లో ఉన్న డిమాండ్ గురించి మనందరికీ తెలిసిందే. వీటి ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ వినియోగదారులు ఈ బ్రాండ్ వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో రకాల బైకులను మార్కెట్లోకి విడుదల చేసిన కవాసకి త్వరలోనే మార్కెట్లోకి మరో సరికొత్త బైక్ మీ తీసుకురాబోతోంది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. కాగా కవాసకి ఒక సరికొత్త కొత్త బైక్ ను లాంచ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న కవాసకి జెడ్ 650 ఆర్ఎస్ కు అప్ గ్రేడెడ్ మోడల్ గా 2024 కవాసకి జెడ్ 650ఆర్ఎస్ ను తీసుకొచ్చింది.

ఈ మోడల్లో పాత వేరియంట్లో ఉన్నఅన్ని ఫీచర్లను కొనసాగిస్తూనే కొత్తగా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ను పొందుపర్చింది. ఈ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ లో రెండు ఆప్షన్లు ఉంటాయి. రైడర్లు వాటిని తన అవసరానికి అనుగుణంగా దానిని వినియోగించుకోవచ్చు. ఇది కాకుండా ఇతర ఎటువంటి మార్పులు పాత మోడల్ కి చేయలేదు. దీని ధర రూ. 6.99లక్షలుగా ఉంది. ఇకపోతే ఈ బైక్ కు సంబంధించిన ధర ఫీచర్ల విషయానికొస్తే. సాధారణంగా ట్రాక్షన్ సిస్టమ్ అంటే రైళ్లలో ఉంటాం. కానీ ఆ ట్రాక్షన్ వేరు. ఈ ట్రాక్షన్ వేరు. ఇది బైక్ సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఇది రైడర్ కు అదనపు భద్రతను అందిస్తుంది. ముఖ్యంగా రోడ్లపై ప్రయాణిస్తున్న రోడ్లు తడిగా ఉన్నా, కంకర తేలి ఉన్నా బైక్ కంట్రోల్ తప్పకుండా ఉంటుంది. ఎటువంటి ప్రమాదం సంభవించకుండా ఈ సిస్టమ్ రక్షిస్తుంది.

కాగా ఈ కవాసకి బైక్ రెట్రో లుక్లో అదరగొడుతుంది. పాత మోడల్ బైక్ మాదిరిగానే స్టైలింగ్ ఉంటుంది. ముందు భాగంలో హెడ్ ల్యాంప్, మధ్యల డిజిటల్ రీడ్ అవుట్ కూడిన ట్విన్ అనలాగ్ డయల్స్, టియర్ డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, స్లిమ్ టెయిల్ సెక్షన్ ఉన్నాయి. ఈ కొత్త బైక్లో నింజా 650, వెర్సిస్ 650లలో వినియోగించిన 649సీసీ, లిక్విడ్ కూల్డ్ పార్లెల్ ట్విన్ ఇంజిన్ తో వస్తోంది. ఈ ఇంజిన్ 8000ఆర్పీఎం వద్ద 67 బీహెచ్పీ శక్తిని, 6,700 ఆర్పీఎం వద్ద 64 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ యూనిట్ కలిగిన గేర్ బాక్స్ ఉంటుంది స్లిప్ క్లచ్ తో వస్తుంది. ఈ బైక్ ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో ట్యూబ్యులర్ డైమండ్ ఫ్రేమ్ తో కూడిన మోనోషాక్ సస్పెన్షన్ తో వస్తుంది.

బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడితే ముందు వైపు డ్యూయల్ 272 ఎంఎం డిస్క్, వెనుక భాగంలో 186ఎంఎం డిస్క్ బ్రేకులు ఉన్నాయి. కవాసకి జెడ్ 650ఆర్ఎస్ బైక్ కన్నా ముందే ఓ బైక్ ను తీసుకొచ్చింది. కవాసకి ఎలిమినేటర్ 500ను పరిచయం చేసింది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 5.62లక్షలు గా ఉంటుంది. దీనిలో టూరింగ్ అనువైన లో స్లంగ్ క్రూయిజర్ సిల్హౌట్ ను కలిగి ఉంది. అంతేకాక పార్లల్ ట్విన్ లిక్విడ్ కూల్ ఇంజిన్ తో ఈ బైక్ వస్తుంది. ఇది 9000 ఆర్పీఎం వద్ద 44బీహెచ్పీ పవర్, 6000ఆర్పీఎం వద్ద 46ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-గేర్ బాక్స్ తో అసిస్ట్-స్లిప్ క్లచ్ తో వస్తుంది.