Site icon HashtagU Telugu

Tata Nexon EV: మార్కెట్లోకి టాటా నెక్సాన్ ఈవీ కార్ లాంచ్.. ధర ఫీచర్స్ ఇవే?

Tata Cars

Tata Nexon Ev

టాటా కార్ల కంపెనీ ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలో దేశీయ మార్కెట్లో టాటా మోటార్స్‌ అగ్రగామిగా కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రకాల మోడల్స్ కలిగిన కార్లను మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం కార్లను విడుదల చేసే విషయంలో మాత్రమే కాకుండా సేల్స్ విషయంలో కూడా టాటా నెక్సాన్‌ దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా టాటా సంస్థ నెక్సాన్‌ ఈవీ ని మార్కెట్లోకి విడుదల చేసింది. మరి ఆ కారుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే… ఇందులో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్ మౌంటెడ్ ప్యాడిల్ షిఫ్టర్, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, వాయిస్ కమాండ్ ఫంక్షన్, ఎయిర్ ప్యూరిఫైయర్, JBL ఆడియో సిస్టమ్ సన్‌రూఫ్ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది.

అలాగే కొత్త టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ 2023 ఎలక్ట్రిక్ కారు మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ వేరియంట్‌ల ఎంపికలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. మీడియం రేంజ్ వేరియంట్‌లో 30kWh బ్యాటరీని ప్రవేశపెట్టగా లాంగ్ రేంజ్ వేరియంట్‌లో 40.5 kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది 215 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 127 bhp మరియు 143 bhp శక్తిని ఉత్పత్తి చేసే మోటార్లు ఉన్నాయి. అప్‌డేటెడ్‌ టాటా నెక్సాన్ ఈవీ మీడియం రేంజ్ వేరియంట్ పూర్తి ఛార్జ్‌పై 325 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. లాంగ్ రేంజ్ వేరియంట్ 465 కి.మీ రేంజ్‌ను అందిస్తుందని టాటా మోటార్స్‌ తెలిపింది. గృహ విద్యుత్‌ వినియోగం విషయానికొస్తే MR వేరియంట్‌లో బ్యాటరీ పూర్తి ఛార్జ్‌ అవ్వడానికి 10.5 గంటల సమయం పడుతుంది. LR వేరియంట్ బ్యాటరీ 15 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.

ఇంకా ఫాస్ట్‌ ఛార్జ్‌ అవ్వడానికి టాటా నెక్సాన్‌ ఈవీ కారులో DC ఫాస్ట్ ఛార్జర్‌ను ప్రవేశపెట్టారు. MR, LR వేరియంట్లలో బ్యాటరీని 10 నుంచి 80 శాతం వరకు 56 నిమిషాల్లో ఛార్జ్‌ అవుతుంది. కొత్త టాటా నెక్సాన్‌ ఈవీ ఎకో, సిటీ, స్పోర్ట్స్ డ్రైవింగ్ మోడ్‌ల ఆప్షన్‌ ఉంటుంది. టాటా నెక్సాన్‌ ఈవీ 2023 లో సేఫ్టీ ఫీచర్లను పరిశీలిస్తే.. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, ABS , రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్, రియర్ డిస్క్ బ్రేక్‌లు, హిల్ డీసెంట్ కంట్రోల్‌తో సహా వివిధ భద్రతా ఫీచర్లతో ప్రయాణికులకు పూర్తి భద్రతనిస్తుంది. కొత్త టాటా నెక్సాన్‌ ఈవీ ప్రారంభ ధర ఎక్స్‌ షో రూమ్‌ వద్ద రూ.14.74 లక్షల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. కాగా ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. దేశీయ మార్కెట్లో టాటా నెక్సాన్ ఈవీ కి ఏకైక ప్రత్యర్థి మహీంద్రా XUV 400 EV. దీని ధర ఎక్స్‌ షోరూమ్‌ వద్ద రూ.15.99 లక్షల నుంచి రూ. రూ.19.39 లక్షల వరకు కొనుగోలుకు అందుబాటులో ఉంది.