Royal Enfield: త్వరలోనే మార్కెట్ లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ గురించి మనందరికీ తెలిసిందే. ఎక్కువ శాతం మంది వినియోగదారులు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులను కొనుగో

  • Written By:
  • Publish Date - August 25, 2023 / 04:20 PM IST

ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ గురించి మనందరికీ తెలిసిందే. ఎక్కువ శాతం మంది వినియోగదారులు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అంతేకాకుండా మార్కెట్ లో ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ కీ భారీగా క్రేజ్ ఉంది. ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల రాయల్ ఎన్‌ఫీల్డ్ విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. ఇంకా కొన్ని బైక్స్ ని మార్కెట్ లోకి విడుదల భావిస్తోంది సదరు సంస్థ. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి నెక్స్ట్ అతిపెద్ద లాంచ్ కొత్త బుల్లెట్ 350, ఇది జస్ట్ ఐకానిక్ మైక్ మాత్రమే కాదు.

దీనికి RE ఫ్యాన్స్ ఇంకా లైడ్‌బ్యాక్ రైడింగ్‌ను ఇష్టపడే వ్యక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి త్వరలో విడుదల కానున్న ఈ లేటెస్ట్ క్లాసిక్ బైక్ స్పెసిఫికేషన్‌లు తాజాగా ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. మరి ఆ వివరాల్లోకి వెళితే.. బేస్ వేరియంట్‌లో సింగిల్-ఛానల్ ABS ఇంకా వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ఉంటుంది, మిగిలిన రెండు వేరియంట్‌లలో వెనుక వైపున డ్యూయల్-ఛానల్ ABS అండ్ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. అలాగే పెయింట్ స్కీమ్‌లు, ఇంజిన్‌పై ఫినిషింగ్ పరంగా కొంచెం భిన్నంగా ఉంటుంది. బేస్ వేరియంట్ క్రోమ్ ఇంజిన్ కవర్‌ను పొందే అవకాశం ఉంది. కాగా ఈ మిడ్ వేరియంట్‌లో ట్యాంక్‌పై గోల్డ్ పిన్‌స్ట్రైపింగ్‌తో పాటు క్రోమ్ ఫినిష్డ్ లభిస్తుంది.

అదేవిదంగా టాప్-స్పెక్ వేరియంట్‌లో కొప్పా పిన్-స్ట్రిపింగ్, 3డి గోల్డ్ బ్యాడ్జింగ్ ఇంకా డ్యూయల్-టోన్ ఫినిషింగ్ ఫ్యూయల్ ట్యాంక్‌తో పాటు బ్లాక్ అవుట్ ఇంజన్ ఉంటుంది. అయితే కొన్ని ఇతర స్టైలింగ్ మార్పులను కూడా ఆశించవచ్చు. ఇకపోతే ఇందులో విడిభాగాల విషయానికొస్తే.. కొత్త బుల్లెట్ 350లో ఫ్యాటర్ టైర్లు, ముందు భాగంలో 100 సెక్షన్ యూనిట్ ఇంకా వెనుకవైపు 120 సెక్షన్ యూనిట్, ముందువైపు 19-అంగుళాల స్పోక్ వీల్ అలాగే వెనుకవైపు 18-అంగుళాల స్పోక్ వీల్ ఉంటాయి.రివైజ్డ్ స్టైలింగ్‌తో పాటు, కొత్త బుల్లెట్ 350 క్లాసిక్ నుండి USB పోర్ట్, స్విచ్ గేర్ ఇక ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఫీచర్లను కూడా పొందవచ్చని భావిస్తున్నారు. దీనిలో క్లాసిక్ 350, హంటర్ 350 ఇంకా మెటోర్ 350లలో కూడా కనిపించే J-సిరీస్ ఇంజిన్‌ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సింగిల్-సిలిండర్, 349 cc, SOHC ఇంజిన్‌తో ట్యూన్ స్టేటస్ అలాగే ఉంటుందని ఆశించవచ్చు. 6,100 rpm వద్ద 20.2 bhp, 4,000 rpm వద్ద 27 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ కి 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ అందించారు. కాగా ఈ సరికొత్త ఈ కొత్త బైక్ సెప్టెంబరు 1, 2023న విడుదల కానుంది..