Hyundai Tucson: హ్యుందాయ్ టూసాన్ కొత్త వెర్షన్ విడుదల.. మామూలుగా లేదుగా?

వాహనదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2022 హ్యుందాయ్ టూసాన్ భారతీయ మార్కెట్ లో అధికారికంగా

  • Written By:
  • Updated On - August 10, 2022 / 11:06 PM IST

వాహనదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2022 హ్యుందాయ్ టూసాన్ భారతీయ మార్కెట్ లో అధికారికంగా విడుదల అయింది. అయితే భారతీయ మార్కెట్ లో విడుదలైన ఈ కొత్త హ్యుందాయ్ రెండు ట్రిమ్ లలో అందుబాటులో ఉంది. అందులో ఒకటి ప్లాటినం కాగా మరొకటి సిగ్నేచర్. హ్యుందాయ్ తన నాలుగో తరం టూసాన్ ఎస్ యూవీని 2022ను బుధవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే దేశీయ మార్కెట్లో ఈ ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ.27.69 లక్షలు.

కాగా ప్రపంచ వ్యాప్తంగా హ్యుందాయ్ వాహన శ్రేణిలో టూసాన్ అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ కావడం గమనార్హం. ఇది భారత మార్కెట్లో జీప్, కాంపాస్, సిట్రోయిన్ సీ5 ఎయిర్ క్రాస్, ఫోక్స్ వాగన్ టైగూన్ కు పోటీ ఇవ్వనుంది. అయితే మూడవ వెర్షన్ తో పోలిస్తే తాజా వెర్షన్ టూసాన్ చూడ్డానికి సరి కొత్తగా కనిపిస్తోంది. అలాగే భద్రతా సదుపాయాలను కూడా ఈ కారులో పెంచారు. కారు నడిపే సమయంలో డ్రైవర్ పని సులభతరం చేసేందుకు వీలుగా అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి.

ముందు భాగంలో గ్రిల్, ఎల్ఈడీ లైట్ల పరంగా మార్పులు చోటు చేసుకున్నాయి. 10.1 అంగుళాల డ్రైవర్ డిస్ ప్లే కూడా ఉంటుంది. అలాగే, ఇంతే సైజుతో ఉన్న ఇన్ఫోటెయిన్ మెంట్ స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. డ్యాష్ బోర్డ్ లే అవుట్ కూడా మారింది. ఇప్పటి వరకు హ్యుందాయ్ 70 లక్షల టూసాన్ వాహనాలను విక్రయించింది.