Site icon HashtagU Telugu

Aprilia SR 175 : ఏప్రిలియా నుంచి 175 సీసీ స్కూటర్‌.. అధునాతన ఫీచర్లు..ధర ఎంతంటే?

175 cc scooter from Aprilia.. advanced features.. what is the price?

175 cc scooter from Aprilia.. advanced features.. what is the price?

Aprilia SR 175 : ఇటలీకి చెందిన ప్రముఖ స్కూటర్‌ తయారీ సంస్థ ఏప్రిలియా, భారత మార్కెట్‌లో ప్రీమియం సెగ్మెంట్‌ స్కూటర్లను మరింత దృఢంగా నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఎస్‌ఆర్ 175 అనే కొత్త మోడల్‌ను విడుదల చేసింది. ఇది గతంలో ఉన్న ఎస్‌ఆర్ 160కు అప్‌గ్రేడ్ వెర్షన్‌ అని చెప్పొచ్చు. ప్రారంభ ధరను రూ.1.26 లక్షలు (ఎక్స్‌-షోరూమ్) గా నిర్ణయించగా, దీని డిజైన్‌ సహా పనితీరు అన్ని రంగాల్లోనూ మునుపటి మోడల్‌తో పోలిస్తే మెరుగుదలలు కనిపిస్తాయి.

మెరుగైన ఇంజిన్‌ సామర్థ్యం, హై పర్ఫార్మెన్స్‌

ఈ కొత్త ఏప్రిలియా ఎస్‌ఆర్ 175లో 174.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది త్రీ వాల్వ్ సెటప్‌తో వస్తోంది. ఈ ఇంజిన్ 7200 ఆర్‌పీఎం వద్ద 12.92 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పాత మోడల్ అయిన ఎస్‌ఆర్ 160లో 11.27 హెచ్‌పీ మాత్రమే ఉండేది. టార్క్ పరంగా చూస్తే ఇది 13.44 ఎన్ఎం నుండి 14.14 ఎన్ఎంకి పెరిగింది. దీని వలన స్కూటర్ తక్కువ ఆరిస్టేన్‌తో మంచి స్పీడ్ అందిస్తూ, మెరుగైన పికప్‌ను అందిస్తుంది.

అధునాతన ఫీచర్లు, స్మార్ట్ కనెక్టివిటీ

ఈ స్కూటర్‌లో కలర్‌ TFT డిస్‌ప్లేను బ్లూటూత్ కనెక్టివిటీతో అందిస్తున్నారు. దీనివల్ల యూజర్ తన స్మార్ట్‌ఫోన్‌ను స్కూటర్‌తో కనెక్ట్‌ చేసి, కాల్ నోటిఫికేషన్లు, అలర్ట్‌లు, మ్యూజిక్‌ కంట్రోల్ వంటివి వినియోగించుకోవచ్చు. టెక్నాలజీ ప్రియుల కోసం ఇది ఆకర్షణీయమైన ఫీచర్‌గా నిలుస్తోంది.

డిజైన్‌, బిల్డ్‌ క్వాలిటీ

బహుశా ఇదే ఎస్‌ఆర్ 175 మోడల్‌కి ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చేమో. ఈ స్కూటర్‌ను బ్రాండ్ యొక్క మిడ్ వెయిట్‌ స్పోర్ట్‌ బైక్ ఆర్‌ఎస్ 457 నుంచి ప్రేరణ పొందిన కొత్త పెయింట్ స్కీమ్‌తో రూపొందించారు. ఇది రెడ్-వైట్, పర్పుల్-రెడ్ రంగుల కలయికలో అందుబాటులో ఉంది. స్పోర్టీ డిజైన్‌తో మార్కెట్లో ఉన్న హీరో జూమ్ 160, యమహా ఏరోక్స్ 155 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుందనే చెప్పాలి.

బ్రేకింగ్‌, సస్పెన్షన్‌ మరియు టైర్లు

ఎస్ఆర్ 175లో ముందు, వెనుక భాగాల్లో 14 అంగుళాల టైర్లు అమర్చారు. టైర్ల వెడల్పు 120 సెక్షన్ ఉండడం వలన రోడ్డు పట్టుదల బాగుంటుంది. బ్రేకింగ్ సిస్టమ్‌లో సింగిల్ ఛానల్ ఏబీఎస్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ లను వాడారు. సస్పెన్షన్‌, ఫ్రేమ్‌ తదితర భాగాలు ఎస్‌ఆర్ 160 మాదిరిగానే ఉంటాయి.

మార్కెట్ టార్గెట్

ఈ స్కూటర్ స్పోర్టీ లుక్స్‌ మరియు అధునాతన ఫీచర్ల కారణంగా ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని విడుదల చేశారు. ప్రీమియం స్కూటర్ల మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న పోటీదారుల మధ్య, ఈ మోడల్ ఏప్రిలియాకి మరింత స్థిరతను తీసుకురావచ్చని నిపుణులు భావిస్తున్నారు. కాగా, ఏప్రిలియా ఎస్‌ఆర్ 175 స్కూటర్‌ ఒక మంచి అప్‌గ్రేడ్‌ వర్షన్‌గా చెప్పవచ్చు. అదునాతన ఇంజిన్‌, స్మార్ట్ ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఇది కొత్త తరం బైక్ ప్రియుల హృదయాలను గెలుచుకోవడంలో విజయవంతమవుతుందని అంచనా. ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్‌లో ఇది త్వరలోనే ట్రెండ్ సెట్ చేయబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Read Also: Zomato: విమానయాన రంగంలోకి జొమాటో వ్యవస్థాపకుడు..ప్రైవేటు జెట్‌తో ఎంట్రీ