Honda: బుల్లెట్ హోండా లాంటి మంకీ బైక్.. ధర, ఫీచర్స్ ఇవే?

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా ఇప్పటికే ఎన్నో బైకులను విడుదల చేసిన విషయం తెలిసిందే. రకరకాల బైకులను స్కూటర్లను విడుదల చేసింది. ఇది ఇల

  • Written By:
  • Publish Date - July 25, 2023 / 07:00 PM IST

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా ఇప్పటికే ఎన్నో బైకులను విడుదల చేసిన విషయం తెలిసిందే. రకరకాల బైకులను స్కూటర్లను విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా హోండా సంస్థ మార్కెట్లోకి మరో సరికొత్త బైక్ ని విడుదల చేసింది. . హోండా మంకీ పేరుతో ఈ బైక్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఇది 125సీసీ లైట్ వైట్ బైక్. కానీ లుక్ లో ఈ బైక్ బుల్లెట్ బైక్ కంటే ఎక్కువ. కాగా థాయ్‌లాండ్‌కు చెందిన హోండా ఈ స్పెషల్ ఎడిషన్ బైక్‌ను విడుదల చేసింది. ఇకపోతే ఈ బైక్ ధర ఫీచర్ల విషయానికొస్తే.. ఈ కొత్త హోండా మంకీ స్పెషల్ ఎడిషన్ బైక్ ధర 108,900 THB అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 2.59 లక్షలుగా ఉంది.

కాగా ఈ 125సీసీ బైక్‌ చాల ఖరీదైనది. ఎందుకంటే ఈ ధరలో భారతదేశంలో 300 ప్లస్ సీసీ బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. హోండా మంకీ బైక్‌లో 125సీసీ, 2 వాల్వ్, ఎయిర్ కూల్డ్ మోటార్ ఇంజన్ ఉంది. ఇది 9.2bhp శక్తిని, 11Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో కొత్త మంకీ బైక్‌కు బాబర్ లుక్ ఇవ్వబడింది. మైలేజీ ఈ బైక్‌కు ప్రధాన ఆకర్షణ. ఇది లీటర్ పెట్రోల్‌కు 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని ఇంధన సామర్థ్యం 5.6 లీటర్లు. ఏబీఎస్ బ్రేక్, 12 ఇంచ్ వీల్, ఈ బైక్ మొత్తం బరువు 104 కేజీలు. ఈ బైక్ తక్కువ బరువు సులభమైన రైడింగ్ సౌలభ్యాన్ని కలిగి ఉంటుంది. కాగా ప్రస్తుతం ఈ బైక్ థాయిలాండ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇండియాలో హోండా మంకీ బైక్ లాంచ్ కీ సంబందించి ఇంకా ఎటువంటి సమాచారం లేదు.

కేవలం ఇది మాత్రమే కాదు, అధిక ధర ఇంకా తక్కువ సిసి భారతదేశంలో వర్కౌట్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. కారణం రాయల్ ఎన్‌ఫీల్డ్ 350, జావాతో సహా 350 సిసి బైక్‌లు దాదాపు అదే ధరలో లభిస్తాయి. హోండా బైక్ భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. హోండా స్కూటర్లు ఇంకా బైక్‌లకు ఎక్కువ డిమాండ్ ఉంది. హోండా యాక్టివా, డియో, హోండా షైన్, హోండా హైనెస్‌తో సహా ఎన్నో మోడళ్ల బైక్‌లు భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి.