Site icon HashtagU Telugu

YV Subbareddy: విశాఖకే పరిపాలనా రాజధాని…ఇది ఖాయం…!!

Yv Subbareddy

Yv Subbareddy

విశాఖలో పర్యటించారు వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి. జీవీఎంసీ కార్పొరేటర్లతో ఆయన సమావేశం అయ్యారు. విశాఖకు పరిపాలనా రాజధాని రావడం ఖాయమని స్పష్టం చేశారు. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాక పరిపాలనా రాజధాని వస్తుందని వెల్లడించారు వైవీ సుబ్బారెడ్డి. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ఉంటుందన్నారు. వార్డుల వారీగా అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తామని చెప్పారు.

గోదావరి వరదలు, విపక్షాల విమర్శలపైనా కూడా స్పందించారు. కేవలం ఉనికి కోసమే గోదావరి వరదలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు.