Site icon HashtagU Telugu

YV Subba Reddy : విశాఖ అందుకే.. న్యాయపరమైన ఇబ్బందుల వల్లే ఆలస్యం అయింది.. రాజధానిపై వైవి సుబ్బారెడ్డి..

Yv Subbareddy gives again clarity on AP Capital Vizag Ruling from Dasara

Yv Subbareddy gives again clarity on AP Capital Vizag Ruling from Dasara

ఏపీ రాజధాని(AP Capital) అంశంపై ఇంకా రచ్చ జరుగుతూనే ఉంది. అమరావతినే(Amaravathi) రాజధాని అని టీడీపీ నాయకులు, ప్రజలు అంటుంటే వైసీపీ(YCP) నాయకులు మాత్రం మూడు రాజధానులు అంటూ కేవలం విశాఖ(Vizag) వైపే చూస్తున్నారు. ఇప్పటికే విశాఖ నుంచి పరిపాలన చేయడానికి సిద్ధం చేస్తున్నారు. దసరా నుంచే విశాఖ రాజధానిగా పరిపాలన ఉంటుందని పలువురు వైసీపీ నాయకులు అంటున్నారు.

తాజాగా నేడు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి(YV Subba Reddy) విశాఖ ఉత్తర నియోజకవర్గంలో విజయగణపతికి ప్రత్యేక పూజులు నిర్వహించారు. అనంతరం మీడియాతో రాజధాని గురించి మాట్లాడారు.

వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. విజయదశమి నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ నుండి పాలన సాగించనున్నారు. విఘ్నాలు తొలిగిపోవాలని వినాయకుడికి పూజులు చేశాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని గణనాధుడిని పూజించాం. మూడు రాజధానులకు న్యాయపరమైన ఇబ్బందులు రావడం వలన కాస్త ఆలస్యం అయింది. ఏపిని రాజధాని లేని రాష్ట్రంగా చేసిన ఘనత చంద్రబాబుదే. విశాఖతో ఉత్తరాంధ్ర ప్రజలకు భరోసా కల్పించనున్నాం. దక్షిణ భారతదేశంలోనే అభివృద్ధి చెందిన నగరం విశాఖ. విశాఖలో కార్యాలయాలను సిద్ధం చేస్తున్నాము. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. విశాఖను రాజధానికి అనుకూలంగా ఉంటుందనే కేంద్రం కూడా విశాఖను అభివృద్ధి చేయనుంది అని అన్నారు. దీంతో దసరా నుంచే విశాఖ రాజధానిగా పాలన అని మరోసారి క్లారిటీ వచ్చింది.

 

Also Read : Nandigam Suresh : లోకేష్ కూడా వెన్నుపోటు పొడుస్తాడు బాబుని.. లోకేష్ వల్లే బాబుకి ప్రాణహాని..