Yuvagalam : అల్లుడికి ప్రేమ‌తో…బాల‌య్య, కోలాహ‌లం న‌డుమ లోకేష్ తొలి అడుగు

మామ బాల‌క్రిష్ణ, అత్త వ‌సుంధ‌ర పెట్టిన ముహూర్తానికి టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పాద‌యాత్ర‌కు(Yuvagalam) శ్రీకారం చుట్టారు.

  • Written By:
  • Updated On - January 27, 2023 / 12:48 PM IST

మామ బాల‌క్రిష్ణ, అత్త వ‌సుంధ‌ర పెట్టిన ముహూర్తానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పాద‌యాత్ర‌కు(Yuvagalam) శ్రీకారం చుట్టారు. నంద‌మూరి మార్క్ వేసుకుని యువ‌గ‌ళం యాత్ర‌కు బ‌య‌లు దేరారు. తెర వెనుక చంద్ర‌బాబు చాణ‌క్యం యువ‌నేత లోకేష్(Lokesh) యాత్ర‌ను క్లిక్ చేసేలా ప‌నిచేస్తోంది. ఆయ‌న డైరెక్ష‌న్లో న‌డుస్తోన్న ఈ యాత్ర లోకేష్ భ‌విష్య‌త్ ను నిర్దేశించ‌నుంది. యూత్ ఫాలోయింగ్ ఉంద‌న్న సంకేతాన్ని బ‌లంగా పంపే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి కీల‌క నేత‌లు యువ‌గ‌ళం ప్రారంభోత్స‌వానికి కుప్పం రావ‌డంతో కోలాహ‌లం క‌నిపించింది.

నారా లోకేష్ పాద‌యాత్ర‌కు శ్రీకారం (Yuvagalam) 

ఉదయం 10:15 సమయానికి వరదరాజుల స్వామి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఉదయం 11 గంటలకు నారా లోకేష్ పాదయాత్ర(Yuvagalam) తొలి అడుగు ప‌డింది. 400 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా 4వేల కిలో మీట‌ర్లు యువ‌గ‌ళం వినిపించ‌నుంది. రోజుకు 10 కిలో మీట‌ర్ల చొప్పున లోకేష్ న‌డుస్తారు. పాదయాత్ర మొదటి రోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సభ నిర్వ‌హిస్తారు. ఆ వేదిక‌పై లోకేష్ ప్ర‌సంగిస్తారు. అనంతరం కుప్పంలో ప్రభుత్వ ఆసుపత్రి శెట్టిపల్లి క్రాస్, మిగిలి పల్లె క్రాస్ మీదుగా పాదయాత్ర షెడ్యూల్ ఉంది. రాత్రి బస చేసే చేయ‌డానికి ఏర్పాట్లు చేశారు . తొలి రోజు 8.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. కుప్పంకు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు నందమూరి కుటుంబ సభ్యులు చేరుకుని లోకేష్ అడుగులో అడుగు వేశారు. యాత్ర ఆరంభంతో పాటుగా సభలోనూ బాలయ్య హైలెట్ గా నిలిచారు.

Also Read : Yuvagalam : నేడు నారా లోకేష్ “యువ‌గ‌ళం” పాద‌యాత్ర ప్రారంభం.. కుప్పంకు భారీగా త‌ర‌లివ‌చ్చిన టీడీపీ శ్రేణులు

టీడీపీ శ్రేణులంతా కుప్పంకు కదలారు. నందమూరి కుటుంబ సభ్యులు అక్క‌డే ఉన్నారు. లోకేశ్ (Lokesh)యాత్ర పార్టీకి, వ్యక్తిగత రాజ‌కీయ‌ భవిష్యత్ కు ట‌ర్నింగ్ పాయింట్ గా నిల‌వ‌నుంది. లోకేశ్ యాత్ర ప్రారంభం వేళ అత్తా మామతో పాటుగా నందమూరి కుటుంబ సభ్యులు అయ్యారు.హైదరాబాద్ లో ఇంటి వద్ద లోకేశ్ యాత్రకు బయల్దేరే వేళ కుటుంబ సభ్యులంతా కలిసి లోకేశ్ యాత్ర సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. ఆ సమయంలో ఉద్విగ్న వాతావరణం కనిపించింది. యాత్ర సక్సెస్ కోసం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే పార్టీ నేతలకు పక్కా మ్యాప్ ఇచ్చారు. కుప్పంలో యాత్ర ప్రారంభ సమయంలో బాలయ్య కీల‌కంగా క‌నిపించ‌డం నంద‌మూరి, నారా ప్లేవ‌ర్ అద్దారు.

సోష‌ల్ మీడియా వేదిక‌గా లోకేష్ కు అభిమానులు

సోష‌ల్ మీడియా వేదిక‌గా లోకేష్ కు అభిమానులు అభినంద‌న‌లు తెలిపారు. ట్వీట్ల రూపంలో ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలిపారు. యువ‌గ‌ళం ట్యాగ్ తో సోష‌ల్ మీడియా వేదిక‌గా ఐటీడీపీ హైప్ క్రియేట్ చేసింది. సీనియ‌ర్లు సైతం లోకేస్ వెంట న‌డుస్తూ భ‌విష్య‌త్ నాయ‌కుని ఆయ‌న‌లో చూసుకుంటున్నారు. కొంద‌రు కాబోయే సీఎం అంటూ నినాదాలు చేయ‌డం వినిపించింది. క్యాడ‌ర్ నూత‌నోత్సాహం న‌డుమ లోకేష్ ముందుకు క‌దిలారు. మ‌త సామ‌ర‌స్యాన్ని చాటేలా హిందూ, క్రిస్టియ‌న్, ముస్లిం పెద్ద‌ల ఆశీర్వాదం తీసుకున్నారు. తాత ఎన్టీఆర్ రాజ‌కీయ వార‌స‌త్వాన్ని సొంతం చేసేకునేలా ప్లాన్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న త‌ర‌హాలో హావ‌భావాలు ఉండేలా కొంత త‌ర్ఫీదు కూడా లోకేష్ కు ఇచ్చినట్టు తెలుస్తోంది. బ‌హిరంగ స‌భ‌ల్లో స్వ‌ర్గీయ ఎన్టీఆర్ త‌ర‌హా హావ‌భావాల‌ను చూడ‌బోతున్నామ‌న్న‌మాట‌.