తెలుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర( Yuvagalam Vibes) ప్రారంభించడానికి ముందే ప్రకంపనలను సృష్టిస్తోంది. అధికారపక్షం ఉలిక్కిపడుతోంది. మంత్రులు లోకేష్ పాదయాత్ర మీద పలు రకాలుగా ఆరోపణలు, వ్యంగ్యాస్త్రాలను సంధిస్తున్నారు. ఈనెల 27వ తేదీన ప్రారంభం అయ్యే `యువగళం` ప్రభావం అప్పుడే ప్రభుత్వం (Jagan )మీద పడింది. త్వరలోనే 14వేల పోస్టులను భర్తీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది. జాబ్ క్యాలెండర్ గురించి పాదయాత్రలో ఫోకస్ అవుతుందని గ్రహించిన ప్రభుత్వం యువతకు ఆశలు కల్పించే ప్రయత్నానికి దిగుతోంది.
లోకేష్ పాదయాత్ర ముందే ప్రకంపనలను.( Yuvagalam Vibes)
జీవో నెంబర్ 1 ద్వారా ఎలాగైనా లోకేష్ యాత్రను బలహీనపరిచే కుట్ర జరుగుతోందని టీడీపీ అనుమానిస్తోంది. పాదయాత్రలు చేయడానికి ఎలాంటి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని ఏపీ రాజకీయ చరిత్ర చెబుతోంది. కానీ, లోకేష్ యాత్రకు మాత్రం ఆంక్షలు పెట్టాలని సర్వశక్తులు జగన్మోహన్ రెడ్డి (Yuvagalam Vibes) ప్రయోగిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి 1861 చట్టంలోని జీవో నెంబర్ 1ను బయట తీయడంతో పాటు దానిపై సుప్రీం కోర్టు వరకు వెళ్లారు. అంటే, లోకేష్ పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ స్థాయిలో వణికిస్తుందో అర్థమవుతోంది.
Also Read : Pawan Lokesh Yatra : పవన్ , లోకేష్ యాత్రల సస్పెన్స్
మంత్రులు రోజా, గుడివాడ అమర్నాథ్, తదితరులు లోకేష్ పాదయాత్ర మీద సెటైర్లు వేస్తున్నారు. యాత్రను ఆపడానికి ఏపీ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలపై వర్ల రామయ్య, యనమల రామక్రిష్ణుడు, జవహర్, బొండా ఉమ తదితరులు వైసీపీ నేతల వ్యంగ్యాస్త్రాలకు కౌంటర్ ఇస్తున్నారు. ఫలితంగా లోకేష్ పాదయాత్ర రాజకీయ ప్రకంపనలకు దారితీస్తోంది. యాత్ర అనుమతి కోరుతూ ఏపీ పోలీసులకు టీడీపీ లేఖ రాసింది. దానికి క్లియరెన్స్ ఇవ్వడానికి పలు ప్రశ్నలను ఏపీ పోలీస్ సంధించడం విచిత్రం. ఏ రోజు ఎక్కడ పాదయాత్ర ఉంటుంది? దాని ఎజెండా ఏమిటి? ఎంత మంది పాల్గొంటారు? ఎవర్ని ఎక్కడ కలుస్తారు? తదితర ప్రశ్నలు వేస్తూ అనుమతి మీద తర్జనభర్జన పడుతోంది.
లోకేష్ బర్త్ డే వేడుకలను ఈసారి ఘనంగా..
ఈనెల 27వ తేదీన ప్రారంభించే లోకేష్ పాదయాత్ర మీద జగన్మోహన్ రెడ్డి (Jagan) సర్కార్ చేస్తోన్న హడావుడి టీడీపీ క్యాడర్ ను మరింత యాక్టివ్ చేస్తోంది. అందుకే, గతానికి భిన్నంగా ఈసారి లోకేష్ బర్త్ డే వేడుకలను క్యాడర్ చేసుకుంది. ఇప్పటి వరకు ఏ లీడర్ కూ దక్కని విధంగా లోకేష్ పుట్టిన రోజున ఎకరం వరి పొలంలో ఆయన ఫేస్ వచ్చేలా పంటను పండించారు. ఆ ధాన్యాన్ని లోకేష్ తల్లి భువనేశ్వరి ఇవ్వాలని తెనాలికి చెందిన అభిమాని పులి చిన్నా నిర్ణయించుకున్నారు. అమరావతి రాజధాని కోసం చేసిన ఉద్యమాల్లో చిన్నా పలుమార్లు లాఠీ దెబ్బలు తిన్నారు. ఆ సమయంలో నారా లోకేష్, చంద్రబాబు ఇచ్చిన ధైర్యం వాళ్ల మీద అభిమానాన్ని పెంచింది. అందుకే ఉడతా భక్తిగా రుణం తీర్చుకోవడానికి ఎకరం పొలంలో వరిని నాటి ఐదు నెలలుగా పెంచడం ద్వారా లోకేష్ ఫేస్ క్లియర్ గా కనిపించేలా పండిచించడం గమనార్హం. డ్రోన్ కెమెరా ద్వారా ఆ పొలాన్ని చిత్రీకరించి లోకేష్ కు బహుమానంగా ఇవ్వడం ఈసారి బర్త్ డే వేడుకల్లోని హైలెట్.
Also Read :Yuva Galam : ముద్దులు, హగ్ లు నిషేధం! నిరాడంబరంగా `లోకేష్` యువగళం!
నాయకునిగా నిరూపించుకోవడానికి పాదయాత్రకు దిగుతోన్న లోకేష్ బర్త్ డే వేడుకలను ఈసారి ఘనంగా టీడీపీ నిర్వహించింది. ప్రత్యేకించి సోషల్ మీడియా వేదికగా దేశ, విదేశాల నుంచి ఆయన శుభాకాంక్షలు చెప్పడానికి పోటీ పడ్డారు. ఫలితంగా ట్వీటర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫారాలు లోకేష్ పుట్టిన రోజుతో నిండిపోయాయి. 40 ఏళ్లు పూర్తి చేసుకుని 41వ ఏడాదిలోకి అడుగు పెడుతోన్న ఆయన జగన్మోహన్ రెడ్డి (Jagan) ప్రభుత్వాన్ని దడదడ లాడిస్తున్నారు. ఆయన ఇప్పటి వరకు దూరంగా ఉన్న కొందరు సీనియర్లు కూడా పాదయాత్రను విజయవంతం చేయడానికి రంగంలోకి దిగారు. దీంతో జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇప్పటి నుంచే వ్యంగ్యాస్త్రాలకు దిగింది. ఆయన పాదయాత్రను అడ్డుకోవడానికి స్లీపర్ సెల్స్ ను సిద్దం చేసిందని టీడీపీ భావిస్తోంది. అందుకే, చాలా జాగ్రత్తగా లోకేష్ యాత్రను హ్యాండిల్ చేయడానికి క్యాడర్ రంగంలోకి దిగుతోంది.