Site icon HashtagU Telugu

Yuvagalam : లోకేష్ యాత్ర‌కు అల్టిమేటం!బాల‌య్య వ్యాఖ్య‌ల‌తో డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ !!

Yuvagalam

Lokesh Balayya

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పాద‌యాత్ర (Yuvagalam) వేళ డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ కు ప్ర‌త్య‌ర్థులు (YCP) తెర‌తీశారు. ఆయ‌న మామ, హీరో బాల‌క్రిష్ణ చేసిన వ్యాఖ్య‌ల దుమారం ఇప్పుడు యువ‌గ‌ళం యాత్ర‌కు చుట్ట‌కున్నాయి. కాపు సంఘాల నేత‌లు అల్టిమేటం ఇచ్చారు. బాల‌క్రిష్ణ క్ష‌మాప‌ణ‌కు ఈనెల 25వ తేదీ డెడ్ లైన్ పెట్టారు. ఒక వేళ బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్ప‌క‌పోతే లోకేష్ పాద‌యాత్ర‌ను అడ్డుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

నారా లోకేష్ పాద‌యాత్ర  వేళ డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్..(Yuvagalam) 

సాధార‌ణంగా బాల‌క్రిష్ణ అప్పుడ‌ప్పుడు వివాద‌స్పద వ్యాఖ్య‌లు యాదృశ్చికంగా చేస్తుంటారు. ఆయ‌న మాట‌ల‌ను తూలుతారు. ఎందుకు అలా ఆయ‌న మాట్లాడ‌తారు? ఏ ఉద్దేశంతో నోరు జార‌తారు? అనేది అనుచ‌రుల‌కు కూడా తెలియదు. తాజాగా వీర‌సింహారెడ్డి విజ‌యోత్స‌వ స‌భ‌లో అసంద‌ర్భంగా `అక్కినేని..తొక్కినేని..ఆ రంగారావు..ఈ రంగారావు` అంటూ వ్యాఖ్యానించారు. రెండు రోజుల నుంచి ఆయ‌న చేసిన కామెంట్స్ ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అనుకూల మీడియా హైలెట్ చేసింది. దానికి తోడుగా కాపు సంఘాలు, అక్కినేని కుటుంబం, అభిమానులు రంగంలోకి దిగారు. దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌చ్చ జ‌రుగుతోంది.

Also Read : Yuvagalam : లోకేష్ పాద‌యాత్ర‌కు పోలీస్ అనుమ‌తి, స‌వాల‌క్ష కండీషన్లు!

గ‌తంలో బాల‌క్రిష్ణ చేసిన వ్యాఖ్య‌ల‌ను టాలీవుడ్ లోని కొంద‌రు గుర్తు చేస్తున్నారు. మెగా అభిమానులు ఈ వివాదంలోకి జొర‌బ‌డ్డారు. `అమ్మాయి క‌నిపిస్తే ముద్దు పెట్టాలి…క‌డుపు చేయాలి` అంటూ గ‌తంలో బాల‌క్రిష్ణ చేసిన వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, జ‌న‌సేన పార్టీ గురించి `సంకర జాతి..అల‌గాజ‌నం` అంటూ ఆయ‌న చేసిన కామెంట్స్ ను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ` దేవ బ్రాహ్మ‌ణులు..రావ‌ణ సంతానం` అంటూ నోరుజారి క్ష‌మాప‌ణ చెప్పారు. వీట‌న్నింటినీ గుర్తు చేస్తోన్న కాపు సంఘం నేత‌లు మండిప‌డుతున్నారు. `ఆ రంగారావు..ఈ రంగారావు` అంటూ ఎస్వీ రంగారావును కామెంట్ చేశార‌ని భావిస్తూ కాపు నేత‌లు క్ష‌మాప‌ణకు డిమాండ్ చేస్తున్నారు.

బాల‌క్రిష్ణ కామెంట్లు రాజ‌కీయ కోణం నుంచి..

`అక్కినేని..తొక్కినేని..` అంటూ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గురించి చేసిన కామెంట్ల‌పై హీరోలు నాగ‌చైత‌న్య‌, అఖిల్ ట్వీట్ట‌ర్ వేదిక‌గా రియాక్ట్ అయ్యారు. ఇంకా నాగార్జున సీన్లోకి రాలేదు. అయితే, ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన అంశం ఏమంటే బాల‌క్రిష్ణ కామెంట్ల‌ను హైలెట్ చేయ‌డం నుంచి లోకేష్ పాద‌యాత్ర వ‌ర‌కు ఈ ఇష్యూను వైసీపీ తీసుకొచ్చింద‌ని టీడీపీ విశ్వ‌సిస్తోంది. కాపు సంఘాల నేత‌లు కొంద‌రు వైసీపీ సానుభూతిప‌రులుగా ఉన్నారు. అక్కినేని కుటుంబంకు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో బాల‌క్రిష్ణ కామెంట్లు రాజ‌కీయ కోణం నుంచి తీసుకురావ‌డం వైసీపీకి (YCP) తేలిక‌యింది. దీంతో మామ చేసిన కామెంట్ల అల్లుడి ప్ర‌తిష్టాత్మ‌క పాద‌యాత్ర‌కు(Yuvagalam) చుట్టుకోవ‌డం గ‌మ‌నార్హం.

Also Read : Yuvagalam Vibes : 40 ప్ల‌స్ లోకి లోకేష్‌, పాద‌యాత్ర ప్ర‌కంప‌నల‌తో చినబాబు హీట్

హిందూపురం ఎమ్మెల్యేగా బాలక్రిష్ణ ఉన్నారు. ఆయ‌న బుధ‌వారం నాడు `ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి..` ప్రోగ్రామ్ లో పాల్గొన‌డానికి వెళ్లారు. అక్క‌డ అభిమానుల‌తో క‌లిసి ఆయ‌న ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఆ సంద‌ర్భంగా బాల‌క్రిష్ణ‌ను కాపు సంఘాల నేత‌లు అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేయాల‌ని పిలుపునిచ్చారు. బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పే వ‌ర‌కు వ‌ద‌లొద్ద‌ని సంకేతాలు ఇచ్చార‌ట‌. ఇక చిత్తూరు జిల్లా కుప్పం నుంచి లోకేష్ పాద‌యాత్ర ప్రారంభంలోనే అడ్డుకోవాని కాపు సంఘాల నేత‌లు ప్లాన్ చేస్తున్నారు. పైగా చిత్తూరు జిల్లాలోని బ‌ల‌మైన వ‌ర్గంగా కాపు, బ‌లిజ ఉంది. అక్క‌డ స్థానికంగా కాపు నేత‌లు కూడా యాక్టివ్ గా ఉన్నారు. దీంతో లోకేష్ పాద‌యాత్ర‌కు తొలిరోజే కాపు ప్ర‌భావం వైసీపీ రూపంలో ప‌డ‌నుంది. ఈ ప‌రిణామానికి తెలుగుదేశం పార్టీ ఇచ్చే కౌంట‌ర్ ఏమిటో చూద్దాం.!

Also Read : Balakrishna with Honey Rose: వీరసింహుడి విజయోత్సవం.. హనీరోజ్ తో ‘బాలయ్య’ షాంపైన్ పార్టీ!