Yuvagalam : లోకేష్ పాద‌యాత్ర‌కు పోలీస్ అనుమ‌తి, స‌వాల‌క్ష కండీషన్లు!

ఎట్ట‌కేల‌కు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి నారా లోకేష్ పాద‌యాత్ర‌కు (Yuvagalam)

  • Written By:
  • Updated On - January 24, 2023 / 04:23 PM IST

ఎట్ట‌కేల‌కు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి నారా లోకేష్ పాద‌యాత్ర‌కు (Yuvagalam) ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తుల‌ను ఏపీ పోలీస్ ఇచ్చింది. రాష్ట్ర పోలీస్ 14 ష‌ర‌తులు విధించ‌గా, చిత్తూరు జిల్లా పోలీసులు(Police) 29 ర‌కాల ఆంక్ష‌ల‌ను పెడుతూ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.పాదయాత్ర సందర్భంగా ప్రజలకు, వాహనదారులకు, ఎమర్జెన్సీ సర్వీసెస్ ల‌కు ఆటంకాలు క‌లిగించ‌కూడ‌ద‌ని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా చూసుకోవాల‌ని ష‌ర‌తులు పెట్టారు. టపాసులను పేల్చడంపై నిషేధం విధించారు. నిర్దేశించిన‌ సమయాలకు కట్టుబడి బహిరంగసభలను పెట్టుకోవాల‌ని సూచించారు.

నారా లోకేష్ పాద‌యాత్ర‌కు ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తుల‌ను..(Yuvagalam)

బహింగ‌ర స‌భ‌ల వ‌ద్ద, స‌మావేశ స్థలాల్లో (Yuvagalam) ప్రథమ చికిత్స, వైద్య పరికరాలతో అంబులెన్సులను ఏర్పాటు చేసుకోవాల‌ని పోలీసుల ష‌ర‌తుల్లోని ప్ర‌ధాన అంశాలు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి అగ్నిమాపక యంత్రాన్ని అందుబాటులో ఉంచాల‌ని కండీష‌న్ పెట్టారు. విధుల్లో ఉన్న పోలీసులు ఇచ్చే ఆదేశాలను ఎప్ప‌టిక‌ప్పుడు పాటించాలని నోటీస్ ఇచ్చారు. రోడ్లపై సమావేశాలను నిర్వహించకూడదని ఆంక్ష‌లు పెట్టారు. ఇలా, 29 ర‌కాల కండీష‌న్ల మ‌ధ్య పోలీసులు(Police) పాద‌యాత్ర‌కు అతిక‌ష్టం మీద అనుమ‌తి ఇచ్చారు. షెడ్యూల్ ప్ర‌కారం ఈ నెల 27న కుప్పం నుంచి పాద‌యాత్రను లోకేష్ ప్రారంభిస్తారు. యువగళం పేరుతో ఈ పాదయాత్ర 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ఆ క్ర‌మంలో బుధ‌, గురువారాల‌కు సంబంధించిన షెడ్యూల్ ను టీడీపీ ప్ర‌క‌టించింది.

యువ‌గ‌ళం షెడ్యూల్ 

బుధ‌వారం (25వ తేదీ) మధ్యాహ్నం 1.20 గంట‌కు జూబ్లీహిల్స్ లోని నివాసం నుంచి ఎన్టీఆర్ ఘాట్ కు బయల్దేరుతారు. ఘాట్ వ‌ద్ద‌కు 1.45 గంటలకు చేరుకుంటారు. తాత, టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ కు నివాళి అర్పిస్తారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఘాట్ వరకు బైక్ ర్యాలీ ఉంటుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు ఎన్టీఆర్ ఘాట్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయల్దేరి మధ్యాహ్నం 3.30 గంటలకు కడపకు వెళ‌తారు. సాయంత్రం 5.15 గంటలకు కడప అమీన్ పీర్ దర్గాను సందర్శిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు కడపలోని రోమన్ కేథలిక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో చేస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 26వ తేదీ ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమల నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.30 గంటకు కుప్పం చేరుకుంటారు. షెడ్యూల్ ప్ర‌కారం 27వ తేదీన లోకేశ్ పాదయాత్ర ప్రారంభమవుతుంది.

Also Read : Pawan Lokesh Yatra : పవన్ , లోకేష్ యాత్రల సస్పెన్స్

యువ‌గ‌ళం పేరుతో లోకేష్ చేస్తున్న పాద‌యాత్ర‌ను ఆప‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ప‌లు ప్ర‌య‌త్నాలు చేసింది. ఏపీ పోలీసులు ప‌లు ఆంక్ష‌లు పెడుతూ రెండు రోజుల ముందుగా అనుమ‌తి ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి టీడీపీ పెట్టుకున్న ద‌ర‌ఖాస్తును నిశితంగా ప‌రిశీలించిన త‌రువాత ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తుల‌ను ఇచ్చారు. కానీ, వాటిని అమ‌లు చేస్తూ పాద‌యాత్ర చేయ‌డం చాలా క‌ష్టం. ఎందుకంటే, పాద‌యాత్ర‌ను అనుస‌రించే వాళ్ల‌ను ఎవ‌రూ నియంత్రించ‌లేరు. పోలీసులు ఎప్ప‌టిక‌ప్పుడు మార్పు చేసే ష‌ర‌తుల‌ను ఫాలో కావాల‌ని చెప్ప‌డం విడ్డూరం. మ‌హాపాద‌యాత్ర‌ను అడ్డుకున్న‌ట్టే యువ‌గ‌ళాన్ని కూడా అడ్డుకోవాల‌ని వైసీపీ ప్లాన్ చేస్తుంద‌ని టీడీపీ అనుమానిస్తోంది. అందుకే, ముందుస్తుగా పోలీస్ ఆంక్ష‌ల‌ను ప‌రిశీలిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు వ్యూహాల‌ను మార్చుకుంటూ పాద‌యాత్ర‌ను షెడ్యూల్ ప్ర‌కారం 400 రోజులు 4వేల కిలో మీట‌ర్లు కొన‌సాగించేలా బ్లూ ప్రింట్ ను టీడీపీ సిద్ధం చేసింది.

Also Read :Nara Lokesh Padayatra : యువగళం పేరుతో నారా లోకేశ్ పాదయాత్ర