నారా లోకేష్ (Nara Lokesh) యువగళం (Yuvagaalam) పాదయాత్రను వాయిదా (Postponed) వేసుకున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు (Chandrababu) ను అరెస్ట్ చేసి జైల్లో వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు తో పాటు చంద్రబాబు ఫై పలు కేసులు మోపింది వైసీపీ ప్రభుత్వం. ప్రస్తుతం వీటిపై వాదనలు, విచారణలు కోర్ట్ లలో జరుగుతున్నాయి. ఈ క్రమంలో లోకేష్ పాదయాత్రతో బిజీ గా ఉంటె..లాయర్లతో సంప్రదింపులు , తదితర విషయాలు మాట్లాడడం కుదరదు. అందుకే టీడీపీ నేతలు లోకేష్ ను పాదయాత్రను వాయిదా వేసుకోవాలని సూచించారు.
దీంతో లోకేష్ అలోచించి తన యాత్రను వాయిదా వేసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ తో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో రేపటి నుండి పాదయాత్ర ను పున: ప్రారంభించాలని అనుకున్నాడు లోకేష్. కానీ ఇప్పుడు నేతల సూచనా మేరకు వాయిదా వేసుకున్నాడు. ఈ కేసులన్నీ సెట్ అయ్యాక లోకేష్ యాత్ర స్టార్ట్ చేస్తాడు కావొచ్చు.
ప్రస్తుతం లోకేష్ ఫై కూడా ఏసీబీ కోర్ట్ (ACB COurt) లో కేసు నమోదు అయ్యింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ అక్రమాల కేసులో నారా లోకేష్ ను ఏ14 నిందితుడిగా చేరుస్తూ సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు లోకేశ్.
Read Also : Ganesh Shobha Yatra : పవన్ పాటకు దుమ్ములేపే స్టెప్స్ తో అదరగొట్టిన తెలంగాణ పోలీసులు