Site icon HashtagU Telugu

Yuvagalam : లోకేష్ పాద‌యాత్ర స‌గం పూర్తి, టీడీపీ క్యాడ‌ర్ వేడుక‌

Yuvagalam

Yuvagalam

ఉద్విగ్న క్ష‌ణాల న‌డుమ ఈ ఏడాది జ‌న‌వ‌రి 27న లోకేష్ ప్రారంభించిన యువ‌గ‌ళం (Yuvagalam)పాద‌యాత్ర 2వేల కిలోమీట‌ర్ల మైలురాయిని దాటింది. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ఆ మైలురాయిని చేరుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వ‌ర‌కు పాద‌యాత్ర రూట్ మ్యాప్ ను రూపొందించారు. దాని ప్ర‌కారం 400 రోజులు 4వేల కిలోమీట‌ర్ల యాత్ర చేయడానికి లోకేష్‌ డిసైడ్ అయ్యారు.

యువ‌గ‌ళం పాద‌యాత్ర 2వేల కిలోమీట‌ర్ల మైలురాయిని దాటింది.(Yuvagalam)

పాద‌యాత్ర బ్లూప్రింట్ కంటే ముందుగా 2వేల మైలురాయిని లోకేష్ దాటారు. స‌గ‌టున రోజుకు 10 కిలోమీట‌ర్లు న‌డ‌వాల‌ని తొలుత ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, 153 రోజుల్లో స‌గ‌టును రోజుకు 13.15 కిలోమీట‌ర్ల పాద‌యాత్ర కొన‌సాగింది. కేవ‌లం 153రోజుల్లోనే 50శాతం లక్ష్యాన్ని అధిగమించారు లోకేష్‌. చిత్తూరు జిల్లా కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంతనుంచి ప్రారంభించిన లోకేష్ యువగళం (Yuvagalam)పాదయాత్ర 153వరోజున కావలి నియోజకవర్గం కొత్తపల్లి వద్ద 2వేల కిలోమీట‌ర్ల మైలురాయిని దాటింది.

 సుమారు 30లక్షలమంది ప్రజలను లోకేష్ ముఖాముఖి

పాదయాత్రలో సుమారు 30లక్షలమంది ప్రజలను లోకేష్ ముఖాముఖి కలుసుకున్నారు. 53 అసెంబ్లీ నియోజకవర్గాలు, 135 మండలాలు, 1297 గ్రామాలను ట‌చ్ చేస్తూ పాద‌యాత్ర కొన‌సాగింది. ఆయ‌న‌ 49చోట్ల బహిరంగసభల్లో ప్ర‌సంగించారు. వివిధ వ‌ర్గాల‌తో 118 ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. మహిళలు, యువత, ముస్లింలు, సర్పంచులు, తదితరులతో ఆరు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల ద్వారా సమావేశమై స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ప్రజలనుంచి 2,895 రాతపూర్వక వినతిపత్రాలను అందుకున్నారు. క‌నీసం 5చోట్ల రచ్చబండ (Yuvagalam)కార్యక్రమాలను నిర్వ‌హించారు.

రాయలసీమలో   44 అసెంబ్లీ నియోజకర్గాల మీదుగా 1587 కి.మీ. పాదయాత్ర

రాయలసీమలో 124రోజులపాటు 44 అసెంబ్లీ నియోజకర్గాల మీదుగా 1587 కి.మీ. పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు చిత్తూరు జిల్లాలో 45రోజుల్లో 577 కి.మీ.లు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 23రోజుల పాటు 303 కి.మీ, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 40రోజుల్లో 507 కి.మీ, ఉమ్మడి కడప జిల్లాలో 16రోజులు – 200 కి.మీ పాద‌యాత్ర చేశారు. ఇక ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాల్లోఇప్పటివరకు 29రోజులు –425 కి.మీ పాద‌యాత్ర కొన‌సాగింది. ఆ జిల్లాలో 2వేల కిలోమీట‌ర్ల మైలురాయిని దాటి పాద‌యాత్ర  (Yuvagalam)ముందుకు సాగుతోంది.

ప్రతి వందకిలోమీటర్లకు ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరించారు (Yuvagalam)

తారకరత్న మరణం, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, ఉగాది, మహానాడు త‌దిత‌ర సందర్భాల్లో మినహా విరామం లేకుండా యువగళం (Yuvagalam)పాద‌యాత్ర‌ను లోకేష్ కొనసాగించారు. ప్ర‌జల కష్టాలు, కార్యకర్తల్లో అసంతృప్తి, క్షేత్ర‌స్థాయిలోని పార్టీ ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దుతూ పాద‌యాత్ర ముందుకు సాగింది. ప్రతి వందకిలోమీటర్లకు ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. బహిరంగసభల్లో అధికారపార్టీ ఎమ్మెల్యేల అవినీతిని క్షేత్రస్థాయిలో ఎండగట్టారు. చంద్ర‌బాబు హయాంలో చేసిన అభివృద్ధి, వైసిపి ప్రభుత్వంలోని వైఫల్యాలపై సెల్ఫీ ఛాలెంజ్ లు విసరడం జనంలోకి వెళ్లాయ‌ని టీడీపీ భావిస్తోంది.

పప్పులా ముద్ర‌వేసిన వైసీపీ ఆ త‌రువాత రాటుతేలిన లోకేష్ ను ఎదుర్కొవ‌డం క‌ష్ట‌మ‌ని

పెనుగొండ నియోజకవర్గంలో పాదయాత్ర (Yuvagalam)నిర్వహిస్తున్న సమయంలో పాలసముద్రం కియా ఫ్యాక్టరీ వద్ద లోకేష్ విసిరిన‌ సెల్ఫీ చాలెంజ్ హైలైట్ గా నిలచింది. టిసిఎల్, జోహో, డిక్సన్ వంటి కంపెనీల వద్ద లోకేష్ విసిరిన సెల్ఫీ చాలెంజ్ లు యువతను క‌ట్టిప‌డేశాయి. డిక్సన్ కంపెనీ ఉద్యోగుల బస్సు ఎక్కి లోకేష్ సెల్ఫీ దిగుతూ `మిస్టర్ జ‌గ‌న్ రెడ్డీ… నేను తెచ్చిన డిక్సన్ కంపెనీ ఇది.. అందులో ఉద్యోగాలు చేస్తున్న అక్కాచెల్లెళ్లు వీరు..నువ్వు ఒక్క కంపెనీ అయినా తెచ్చాన‌ని చెప్పుకోగ‌లవా!?, ఒక్క ఉద్యోగ‌మైనా ఇప్పించ‌గ‌లిగాన‌ని ప్రక‌టించ‌గ‌ల‌వా” అంటూ సీఎం జగన్ పై ప్రశ్నల  వర్షం  కురిపించారు.

Also Read : Yuvagalam : యువ‌గ‌ళంలో అన్నీ తానై.. సొంత జిల్లాలో యాత్ర‌కు దూర‌మైన నేత.. కార‌ణం ఇదేనా..?

ప్రతి వందకిలోమీటర్ల మజిలీగా భావిస్తూ ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో సంబంధిత అభివృద్ధి కార్యక్రమాన్ని చేస్తామ‌ని హామీ ఇచ్చారు. తొలి రోజుల్లో లోకేష్ త‌డ‌బాటు ప‌డ్డా, ఆ త‌రువాత సాఫీగా ఆయ‌న పాద‌యాత్ర (Yuvagalam) సాగింది. మైకులు క‌ట్ చేయ‌డం, విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేయ‌డం, స్పీక‌ర్ల‌ను లాగేసుకోవ‌డం త‌దిత‌ర అడ్డంకులు ప్ర‌భుత్వం త‌ర‌పున అధికారులు పెట్టిన‌ప్ప‌టికీ లోకేష్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. త‌న‌దైన పంథాలో స్పీక‌ర్ లేకుండా టేబుల్ పై నిల్చుని మాట్లాడిన సంద‌ర్భాలు ఉన్నాయి.

Also Read : Nara Lokesh : బీసీల ద్రోహి సీఎం జ‌గ‌న్‌.. టీడీపీ అధికారంలోకి రాగానే ఆ ప‌నులు త‌ప్ప‌కుండా చేస్తాం

తొలి రోజుల్లో పప్పులా ముద్ర‌వేసిన వైసీపీ ఆ త‌రువాత రాటుతేలిన లోకేష్ ను ఎదుర్కొవ‌డం క‌ష్ట‌మ‌ని భావించింది. అందుకే, ప్రారంభ రోజుల్లో మాదిరిగా ఇప్పుడు అభ్యంత‌ర పెట్ట‌లేక‌పోతోంది. మంత్రులు, ఎమ్మెల్మేలు మూకుమ్మ‌డిగా రాజ‌కీయ‌దాడికి దిగిన‌ప్ప‌టికీ సింగిల్ గా స‌మాధానం చెబుతూ ముందుకు క‌దిలారు లోకేష్‌. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద కొన్ని సంద‌ర్భాల్లో రెచ్చ‌గొట్టేలా ప్ర‌సంగించారు. ఆ త‌రువాత స‌బ్జెక్టుకు ప‌రిమితం అవుతూ మాట్లాడుతున్నారు. ప్ర‌జా మ‌న్న‌న‌లను అందుకుంటూ సాగిపోతోన్న లోకేష్ యువ‌గ‌ళం.(Yuvagalam) పాద‌యాత్ర స‌గం పూర్తయిన సంద‌ర్భంగా టీడీపీ క్యాడ‌ర్ సంబురాలు జ‌రుపుకుంటోంది. కేక్ క‌ట్ చేసి ఆనందోత్సాహాల‌ను పంచుకుంటోంది.