Site icon HashtagU Telugu

Yuvagalam : రాటుతేలిన లోకేష్, మీడియా ఫోక‌స్ నిల్

Yuvagalam

Yuvagalam

తెలుగుదేశం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ పాద‌యాత్ర (Yuvagalam)చేస్తున్నారు. ఆయ‌న ఈ ఏడాది జ‌న‌వ‌రి 27న చిత్తూరు జిల్లాలో ప్రారంభించిన యవ‌గ‌ళం తొలి రోజుల్లో ఒడిదుడుకులుగా సాగింది. ఆ త‌రువాత యువ‌గ‌ళం గాడిలో ప‌డింది. దాని సార‌థి లోకేష్ కూడా స్పీచ్ కు ప‌దును పెట్టారు. హావ‌భావాల‌ను మార్చేసుకున్నారు. వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు. కానీ, ఆయ‌న చేస్తోన్న క‌ష్టానికి తగిన ప్ర‌చారం మాత్రం ల‌భించ‌డంలేదు.

యూ ట్యూబ్ లైవ్ వ‌ర‌కు లోకేష్   ప‌రిమితం   (Yuvagalam) 

సొంత‌గా క్రియేట్ చేసుకున్న సోష‌ల్ మీడియా మిన‌హా లోకేష్ ను  (Yuvagalam)ఫోక‌స్ చేస్తోన్న మీడియా దాదాపుగా లేదు. ఎల్లో మీడియాగా ప్రాచుర్యం పొంద‌ని విభాగం కూడా పెద్ద‌గా ఆయ‌న్ను ప‌ట్టించుకోవ‌డంలేదు. కేవ‌లం యూ ట్యూబ్ లైవ్ వ‌ర‌కు ప‌రిమితం చేస్తున్నార‌ని త‌మ్ముళ్ల బాధ‌. ఎలాగూ, బ్లూ మీడియా ఏదైనా నెగిటివ్ పాయింట్స్ ఉంటే మిన‌హా చూపించ‌దు. అంతేకాదు, పింక్ మీడియా కూడా ఆయ‌న‌కు దూరంగా ఉంటుంది. పత్రిక‌ల్లో ఎక్క‌డా యువ‌గ‌ళం హైలెట్ కావ‌డంలేదు. దీంతో పున‌రాలోచ‌న‌లో యువ‌గ‌ళం సార‌థి లోకేష్ ప‌డిపోయారు.

ఎల్లో మీడియా  ఉద‌య‌భాను మీద ఎక్కువ‌గా ఫోక‌స్

ఇప్ప‌టి వ‌ర‌కుఉ 168 రోజులు పాద‌యాత్ర చేసిన లోకేష్ ప‌లు సభ‌ల‌ను నిర్వ‌హించారు. స‌ద‌స్సులు పెట్టారు. ఓపెన్ హాల్ మీటింగ్ ల‌ను అమెరికా త‌ర‌హాలో ఫేస్ చేశారు. కానీ, ఎక్క‌డా హైలెట్ కాలేదు. హ‌ఠాత్తుగా యాంక‌ర్ ఉద‌య‌భాను ఒంగోలు కేంద్రంగా జ‌రిగిన యువ‌గ‌ళంలో (Yuvagalam)క‌నిపించారు. అంతే అంద‌రూ అటెన్ష‌న్ ప్లే చేశారు ఆమె ఎందుకు వ‌చ్చారు? అదో సినిమా ఈవెంటా? అంటూ బ్లూ మీడియా విమ‌ర్శ‌నాస్త్రాల‌ను త‌యారు చేసింది. ఇక ఎల్లో మీడియా మాత్రం ఉద‌య‌భాను మీద ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింది. ఆయ‌న్ను చేసిన ఇంట‌ర్వ్యూను కూడా ఫుల్ గా ఇవ్వ‌లేక‌పోయింది.

ఒంగోలు కేంద్రంగా పెట్టిన బీసీ స‌ద‌స్సు సంద‌ర్భంగా యాంక‌ర్ ఉద‌య‌భాను

వివిధ సామాజిక‌వ‌ర్గాల‌తో లోకేష్ మ‌మేకం అయ్యారు. వాళ్ల‌కు సంబంధించిన బాధ‌లు, స‌మ‌స్య‌ల‌ను వింటున్నారు. వెంట‌నే ప‌రిష్క‌రించేవైతే చేసేస్తున్నారు. లేదంటే, ప్రభుత్వం వ‌చ్చిన త‌రువాత ప‌రిష్కారం చూపిస్తాన‌ని హామీ ఇస్తున్నారు. అంతేకాదు. ప్ర‌తి 100 కిలోమీట‌ర్ల‌కు ఒక‌చోట శిలాఫ‌లకాన్ని వేస్తూ అక్క‌డి స‌మ‌స్య‌ల‌ను గుర్తుంచుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. క‌సిగా ప్ర‌జ‌ల్లో తిరుగుతూ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వంలోని లోపాల‌ను, దాష్టీకాల‌ను ఎండ‌గ‌డుతున్నారు. రాటుతేలిన నాయ‌కుని మాదిరిగా ముందుకు సాగుతున్నారు. ఒంగోలు కేంద్రంగా పెట్టిన బీసీ స‌ద‌స్సు (Yuvagalam) సంద‌ర్భంగా యాంక‌ర్ ఉద‌య‌భాను ఆయ‌న్ను ఇంట‌ర్వ్యూ చేశారు. బీసీల గురించి ఆమె అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఏ మాత్రం త‌డుముకోకుండా స‌మాధానం ఇచ్చారు.

Also Read : Lokesh Yuvagalam: లోకేశ్ అన్ స్టాపబుల్, యువగళానికి 100 రోజులు!

సాధారంగా బీసీల‌ను ఓటు బ్యాంకు కింద రాజ‌కీయ పార్టీలు చూస్తుంటాయ‌న్న నిజాన్ని బ‌య‌ట‌పెట్టారు లోకేష్‌. అదే, టీడీపీ మాత్రం తొలి నుంచి పార్టీకి వెన్నుముకలా భావించింద‌ని వివ‌రించారు. అందుకే, బీసీల కోసం స్వ‌ర్గీయ ఎన్టీఆర్ నుంచి చంద్ర‌బాబు సీఎంగా ఉన్న 2019 వ‌ర‌కు ఆగ‌కుండా చెప్పేశారు. దీంతో అక్క‌డున్న బీసీలు సైతం ముగ్దుల‌య్యారు. ఆ లైవ్ ను కూడా ఎల్లో మీడియా ఇవ్వ‌లేక‌పోయింది. ఇటీవ‌ల ప‌వ‌న్ చేసిన వారాహి యాత్ర ఇచ్చిన ప్రాధాన్యంలో 10శాతం కూడా లోకేష్ యువ‌గ‌ళానికి మీడియా ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే, సోషల్ మీడియా వేదిక‌గా లోకేష్ బీసీ స‌ద‌స్సును వైసీపీ టీమ్ మ‌రోలా హైలెట్ చేసింది. యాంక‌ర్ గా ఉద‌య‌భాను రావ‌డంతో యువ‌గ‌ళాన్ని (Yuvagalam)సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ల ప్రొజెక్ట్ చేసింది. ప్ర‌తిగా ఐ టీడీపీ టీమ్ రంగంలోకి దిగింది. బాల‌క్రిష్ణ చేసిన స‌హాయాన్ని గుర్తుంచుకుని ఉచితంగా ఆ ప్రోగ్రామ్ చేయ‌డానికి ఉద‌య‌భాను వ‌చ్చింద‌ని వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. ఇలా బీసీ స‌ద‌స్సు హైలెట్ అయింది.

Also Read : Yuvagalam : లోకేష్ పాద‌యాత్ర స‌గం పూర్తి, టీడీపీ క్యాడ‌ర్ వేడుక‌

గ‌తంలో స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర చేశారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మీడియా పెద్ద‌గా లేదు. అయిన‌ప్ప‌టికీ ఇప్పుడు ప్రాచుర్యం పొంద‌ని ఎల్లో మీడియా అప్పుడు హైలెట్ చేసింది. ఆ త‌రువాత చంద్ర‌బాబు బ‌స్సు యాత్ర‌, పాద‌యాత్ర‌కు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. బ్లూ మీడియా చంద్ర‌బాబు యాత్ర‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోయిన‌ప్ప‌టికీ నెగిటివ్ పాయింట్ల‌ను హైలెట్ చేస్తూ చూపించేది. అదే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌ను ఎల్లో మీడియా కూడా హైలెట్ చేసింద‌ని తెలుగు త‌మ్ముళ్లు గుర్తు చేస్తున్నారు. కానీ, ఇప్పుడు లోకేష్ ను ఎల్లో మీడియా కూడా లైట్ గా తీసుకుంద‌ని మండిప‌డుతున్నారు. సోష‌ల్ మీడియా లేక‌పోతే, ఆయ‌న ఎక్క‌డ యాత్ర చేస్తున్నారో కూడా ప్ర‌జ‌ల‌కు తెలియ‌ద‌ని బాధ‌ప‌డుతున్నారు.