Yuvagalam : US`టౌన్ హాల్` త‌ర‌హాలో `హ‌లో లోకేశ్‌`!భార్య దిద్దిన పొలిటీషియ‌న్!

అమెరికా ఎన్నిక‌ల్లో టౌన్ హాల్ మీటింగ్ ల త‌ర‌హాలో తెలుగుదేశం పార్టీ

  • Written By:
  • Publish Date - February 25, 2023 / 01:28 PM IST

అమెరికా ఎన్నిక‌ల్లో టౌన్ హాల్ మీటింగ్ ల త‌ర‌హాలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ యువ‌గ‌ళం(Yuvagalam) ట‌ర్న్ తీసుకుంది. టౌన్ హాల్‌ త‌ర‌హాలో ఓపెన్ హాల్‌ మీటింగ్ కు(Hello Lokesh) శ్రీకారం చుట్టారు. మైదానంలో త‌యారు చేసిన పెద్ద డ‌యాస్ మీద అటూఇటూ తిరుగుతూ ప‌బ్లిక్ తో ఓపెన్ డిబేట్ కు సిద్ధ‌మ‌య్యారు. గ‌తంలో కాలేజిల‌కు వెళ్లి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి యూత్ ను ఆక‌ట్టుకున్నారు. అందుకు భిన్నంగా ఓపెన్ హాల్ మీటింగ్ ల‌ను లోకేష్‌ ఫేస్ చేస్తున్నారు. కొన్ని వేల మంది యూత్ న‌డుమ ఆయ‌న డయాస్ మీద న‌డుస్తూ చెబుతోన్న స‌మాధానాలు ఏపీ రాజ‌కీయాల్లోని కొత్త ఒర‌వ‌డికి నాంది ప‌లుకుతోంది.

అమెరికా ఎన్నిక‌ల్లో టౌన్ హాల్ మీటింగ్ ల త‌ర‌హాలో యువ‌గ‌ళం(Yuvagalam)

పాద‌యాత్ర ప్రారంభించిన జ‌న‌వరి 27వ తేదీ నుంచి పోలీసుల నుంచి ప్ర‌తిఘ‌ట‌న ఎదుర్కోంటున్నారు. ఆయ‌న ప్ర‌చార ర‌థాన్ని సీజ్ చేశారు. మైకును లాగేసుకున్నారు. అయినప్ప‌టికీ ఏ మాత్రం వెనుకాడ‌ని లోకేష్ స్టూల్ మీట నిలుచుకుని మైకులేకుండా ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యారు. మంత్రులకు చ‌మ‌ట‌లు ప‌ట్టించేలా ఆయ‌న ప్ర‌సంగం ఉంది. ఆయ‌న మీద మూకుమ్మ‌డిగా మంత్రులు మీడియా వేదిక‌గా రాజ‌కీయ‌దాడి చేశారు. అయిన‌ప్ప‌టికీ రోజు విధంగా యువ‌గ‌ళం(Yuvagalam) వెళుతోంది. వివిధ వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుంటున్నారు. ఆయా వ‌ర్గాల‌కు హామీలు ఇస్తున్నారు. ప్ర‌ధానంగా యువ‌త‌ను ఆక‌ట్టుకోవ‌డానికి రెండు రోజులుగా యువ‌గ‌ళం స్టైల్ మారింది. ఎక్కువ‌గా విద్యార్థులు, యువ‌త హాజ‌రువుతున్నారు. వాళ్లు అడిగిన‌ ప్ర‌తి ప్ర‌శ్న‌కు ఏ మాత్రం త‌డుముకోకుండా లోకేష్ స‌మాధానం చెబుతున్నారు.

లోకేశ్ ఫిట్ నెస్ కు కారణం బ్రాహ్మణి

ఇప్ప‌టి వ‌ర‌కు 355.6 కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేసిన లోకేష్ 27వ రోజు షెడ్యూల్ ప్ర‌కారం తిరుప‌తి నియోక‌వ‌ర్గంలో యువ‌గ‌ళం జ‌రుగుతోంది. ప్రస్తుతం లోకేశ్ పాదయాత్ర తిరుపతి నియోజకవర్గంలో కొనసాగుతుండగా, తిరుపతి అంకుర ఆసుపత్రి సమీపంలో ‘హలో లోకేశ్'(Hello Lokesh) కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో యువతీ యువకులతో ఆయ‌న సమావేశం అవుతారు. యువత అడిగిన ప్రశ్నలకు లోకేశ్ ఆసక్తికర సమాధానాలు ఇస్తున్నారు. ఎప్పుడూ కంటతడి పెట్టలేదని, కానీ దేవాన్ష్ పుట్టిన క్షణాల్లో ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆనందబాష్పాలు వచ్చాయని వెల్లడించారు.

Also Read : Yuvagalam : మైనార్టీల‌కు లోకేష్ హామీ! ముస్లింల‌ సంక్షేమానికి `ఇస్లామిక్ బ్యాంకు`!

మెగాస్టార్ అభిమానిగా చెబుతూ బాలయ్య ఎంతైనా తన ముద్దుల మామయ్య అని, ఆయనను విశేషంగా అభిమానిస్తానని తెలిపారు. బాలా మామయ్య అన్ స్టాపబుల్ అని కొనియాడారు. ఆయన కొత్త సినిమా రిలీజ్ అయితే మొదటి షోకు మొదట ఉండేది తానేనని లోకేశ్ (Hello Lokesh) వివరించారు. గతంలో కంటే ఇప్పుడు స్లిమ్ గా, ఫిట్ గా ఉన్నారని, దీని వెనకున్న సీక్రెట్ ఏంటని ఒకరు ప్రశ్నించారు. అందుకు లోకేశ్ స్పందిస్తూ తన స్లిమ్ నెస్ కు, ఫిట్ నెస్ కు కారణం తన అర్ధాంగి బ్రాహ్మణి అని వెల్లడించారు. ఏపీకి కూడా ఐపీఎల్ టీమ్ కావాలని, మన రాష్ట్రంలోని క్రీడాకారులు జాతీయస్థాయిలో తగిన ప్రోత్సాహం లేక ఆగిపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. తిరుపతిలో క్రీడా విశ్వవిద్యాలయం ఎందుకు ఏర్పాటు చేయకూడదని గతంలో తాను పుల్లెల గోపీచంద్ తో చర్చించానని లోకేశ్ వెల్లడించారు.

లోకేశ్ ఫ్రెండ్స్ అనే టీవీ సీరీస్

ప్రతిరోజూ పాదయాత్ర(Yuvagalam) ముగిశాక ఏంచేస్తారన్న దానిపైనా లోకేశ్ స్పందించారు. పాదయాత్రలో ఎక్కువగా నడవడం వల్ల, పాదయాత్ర ముగిశాక కాళ్లు చల్లటి నీళ్లలో పెట్టుకుంటానని, ఆ సమయంలో సీనియర్ నేతలతో ఆ రోజు జరిగిన విషయాలు చర్చిస్తానని తెలిపారు. తన టీమ్ తోనూ, స్థానిక నేతలతోనూ ఉల్లాసంగా గడుపుతామని, అన్ని కార్యక్రమాలు ముగిశాక ఫ్రెండ్స్ అనే టీవీ సీరీస్ చూస్తానని, తాను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఆ టీవీ సిరీస్ ఎంతో ప్రజాదరణ పొందిందని వెల్లడించారు.

`హ‌లో లోకేశ్ ` ఓపెన్ హాల్ మీటింగ్(Hello Lokesh) 

ఇలా `హ‌లో లోకేశ్ `(Hello Lokesh) పేరుతో ఆయ‌న ఓపెన్ హాల్ మీటింగ్ ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఆయ‌న పాద‌యాత్ర‌లో ఇదో పెద్ద ఈవెంట్ గా క‌నిపిస్తోంది. వ్య‌క్తిగ‌త విష‌యాల‌తో పాటు ప్రైవేటు లైఫ్ గురించి ఆయ‌న యువ‌తతో పంచుకుంటున్నారు. ఇదే త‌ర‌హా ప్ర‌చారం కొన‌సాగితే మాత్రం లోకేష్ యువ‌గ‌ళం మరింత్ హిట్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని క్యాడ‌ర్ భావిస్తోంది. భార్య బ్రాహ్మ‌ణి గొప్ప‌త‌నాన్ని ప‌దేప‌దే చెబుతున్నారు. అంతేకాదు, జూనియ‌ర్ గురించి ఆయ‌న చాలా తెలివిగా స్పందించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మెగా కుటుంబం సానుభూతిని పొంద‌డానికి ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. అంతేకాదు, కాబోయే సీఎం చంద్ర‌బాబు మాత్ర‌నంటూ ఇప్ప‌టి వ‌ర‌కు కొంద‌రికి ఉన్న సందేహాల‌కు స్ప‌ష్ట‌త నిస్తున్నారు. కాబోయే సీఎం లోకేష్ అనే నినాదానికి చెక్ పెట్టేలా ఆయ‌న చంద్ర‌బాబు మాత్ర‌మే 2024 సీఎం అంటూ స్ప‌ష్టం చేస్తూ `హ‌లో లోకేశ్`(Yuvagalam) కార్య‌క్ర‌మాన్ని ర‌స‌వ‌త్త‌రంగా న‌డిపిస్తున్నారు.

Also Read : Yuvagalam : ఏపీ పోలీస్ ఓవ‌రాక్ష‌న్‌! లోకేష్ పాద‌యాత్ర‌కు జ‌నాద‌ర‌ణ‌!!