Site icon HashtagU Telugu

Yuvagalam : మైనార్టీల‌కు లోకేష్ హామీ! ముస్లింల‌ సంక్షేమానికి `ఇస్లామిక్ బ్యాంకు`!

Yuvagalam

Lokesh Yuva Galam

యువ‌గ‌ళం(Yuvagalam) పాద‌యాత్ర‌లో ఉన్న టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్  ముస్లింల కోసం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వాళ్ల కోసం `ఇస్లామిక్ బ్యాంక్ `(Islamic Bank) ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఈ బ్యాంకును రూప‌క‌ల్ప‌న చేయ‌డం ద్వారా పేద ముస్లింల‌ను ఆర్థికంగా ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. రెండు రోజుల విరామం త‌రువాత మంగ‌ళ‌వారం తిరిగి ప్రారంభమైన యువ‌గ‌ళం పాద‌యాత్ర సందర్భంగా ముస్లింల కోసం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయ‌డం జ‌రిగింది. మ‌ళ్లీ టీడీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన వెంట‌నే ఈ బ్యాంకు ఏర్పాటు ఉంటుంద‌ని లోకేష్ వెల్ల‌డించ‌డం ముస్లింల‌ను ఆలోచింప‌చేస్తోంది.

ఇస్లామిక్ బ్యాంక్  ఏర్పాటు చేస్తామ‌ని లోకేష్ ప్ర‌క‌ట‌న(Yuvagalam) 

ముస్లింల సంక్షేమం కోసం తొలిసారిగా మైనార్టీ కార్పొరేష‌న్ ను స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. ఆ విష‌యాన్ని లోకేష్ గుర్తు చేస్తూ ఇప్పుడు ఆయ‌న మ‌న‌వడిగా ఇస్లామిక్ బ్యాంకు (Islamic Bank) ను ఏర్పాటు చేస్తాన‌ని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో ముస్లింల కోసం మ‌క్కా యాత్ర‌, రంజాన్ తోఫా త‌దిత‌రాల‌ను అమ‌లు చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు. మైనార్టీల‌కు తెలుగుదేశం పార్టీ చేసిన స‌హాయం మ‌రేఇత‌ర పార్టీలు చేయ‌లేద‌ని గుర్తు చేశారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం మైనార్టీ కార్పొరేష‌న్ నిధుల‌ను ఆపివేసింద‌ని ఆరోపించారు. మ‌ళ్లీ మైనార్టీ కార్పొరేషన్ కు జీవం రావాలంటే టీడీపీ రావాల‌ని పిలుపునిచ్చారు.

Also Read : Yuvagalam : యువ‌గ‌ళంపై వైసీపీ షాడోలు! తాడేప‌ల్లి వ‌ర్గాల్లో లోకేష్‌ అల‌జ‌డి

గతంలో ముస్లింల కోసం చంద్ర‌బాబు అమ‌లు చేసిన ప‌థ‌కాల‌న్నింటినీ సంక్షేమ పథకాలన్నింటినీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆపేశార‌ని ఆరోపించారు. వాటిని పునరుద్ధరిస్తానని టీడీపీ నేత లోకేష్ హామీ ఇచ్చారు. ముస్లింల‌తో ఆయ‌న సమ్మేళ‌నాన్ని నిర్వ‌హించారు. ఆ సంద‌ర్భంగా వాళ్ల కోసం ప‌లు హామీల‌ను ఇవ్వ‌డం సంచ‌లనం క‌లిగిస్తోంది. ఆయ‌న ముస్లిం యూత్ ను ఆక‌ర్షించేలా హామీ ఇవ్వ‌డం క‌నిపించింది. ఇస్లామిక్ బ్యాంకు(Islamic Bank) ద్వారా ప‌లు ర‌కాల సౌక‌ర్యాలు, వ‌స‌తులు, సేవ‌ల‌ను పొందేలా ప‌థకం ఉంటుంద‌ని తెలిపారు. ఆ బ్యాంకు స‌ర్వ‌రోగ నివారిణి మాదిరిగా ముస్లింల ఆర్థిక స‌మ‌స్య‌ల‌న్నింటినీ తీర్చేస్తుంద‌ని అన్నారు. ఆ మేర‌కు బ్యాంకును నిధుల‌తో నింపుతూ స‌హాయ స‌హ‌కారాలు ప్ర‌భుత్వం అందిస్తుంద‌ని వివ‌రించారు.

సామాజిక‌వ‌ర్గాల వారీగా హామీలు (Islamic Bank)

శ్రీకాళ‌హ‌స్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని తొండమానుపురం పంచాయతీ వద్ద లోకేష్ పాదయాత్ర(Yuvagalam) 300 కిలోమీటర్లకు చేరుకుంది. గ్రామంలో చీప్ లిక్కర్ ఏరులై పారుతుంద‌ని ఆరోపించారు. పురుగు మందుల‌ స్థానంలోకి చీప్ లిక్క‌ర్ వచ్చిందని దుయ్య‌బ‌ట్టారు. దీంతో రైతులు పురుగుల‌ను చంపేందుకు చీప్ లిక్క‌ర్ వాడే. ప‌రిస్థితి వ‌చ్చింద‌ని విమ‌ర్శించారు. అనంతరం లోకేష్ యువ గళంలో భాగంగా రైతులతోపాటు గాండ్ల, తెలికుల, దేవ తెలికుల సంఘాలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన పాద‌యాత్ర ఆద్యంత‌మూ సామాజిక‌వ‌ర్గాల వారీగా హామీలు ఇస్తూ సాగుతోంది. ఒక వైపు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తూనే ఇంకో వైపు రాబోవు రోజుల్లో టీడీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డితే చేసే ప‌నుల గురించి వివ‌రిస్తున్నారు.

Also Read : Yuvagalam : ఊరుకో విల్లా, న‌గ‌రికి 5 ఎమ్మెల్యేలు, రోజాకు జ‌బ‌ర్ద‌స్త్ లోకేష్ కౌంట‌ర్

పోలీసులు మైకు పీకేయ‌డంతో బ‌హిరంగ స‌భ‌ల్లో స్పీక‌ర్ లేకుండా లోకేస్ మాట్లాడుతున్నారు. ర‌చ్చ‌బండ ప్రోగ్రామ్ ల మాదిరిగా ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు. ఆయ‌న ప్ర‌చార ర‌థాన్ని తొలి రోజుల్లోనే పోలీసులు స్వాధీనం చేసుకున్న విష‌యం విదిత‌మే. రాత్రి వేళ బ‌స చేసే స్థ‌లం నుంచి పాద‌యాత్ర(Yuvagalam) సంద‌ర్భంగా జ‌నం గుమికూడ‌కుండా పోలీసులు వెంట‌ప‌డుతున్నారు. అయిన‌ప్ప‌టికీ లోకేష్ ను చూసేందుకు జ‌నం పెద్ద ఎత్తున హాజ‌రవుతున్నారు. ఆయ‌న స్పీచ్ క్ర‌మంగా ప‌దునెక్కుతుంది. దీంతో టీడీపీ క్యాడ‌ర్ నుంచి పాజిటివ్ రియాక్ష‌న్ క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నుంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ప‌లు వ‌ర్గాల‌కు ఆయ‌న ఇస్తోన్న హామీలు కూడా ఆక‌ట్టుకుంటున్నాయి. తాజాగా లోకేష్ చేసిన ఇస్లామిక్ బ్యాంకు(Islamic Bank) ఏర్పాటు ప్ర‌క‌ట‌న ముస్లింల‌ను ఆక‌ట్టుకుంటోంది.