Yuvagalam :`చింత‌కాయ‌ల` రూపంలో బ్రేక్? లోకేష్ యాత్ర‌కు పోలీస్ అడ్డంకులు!

నారా లోకేష్ పాద‌యాత్ర‌ను(Yuvagalam) అడ్డుకునే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది.

  • Written By:
  • Publish Date - February 4, 2023 / 11:33 AM IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పాద‌యాత్ర‌ను(Yuvagalam) అడ్డుకునే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. పోలీసు ఆంక్ష‌ల న‌డుమ సాగుతోన్న యాత్ర త‌ర‌చూ టెన్ష‌న్ కు దారితీస్తోంది. ప్ర‌చార ర‌థాన్ని సీజ్ చేయ‌డం, బ‌హిరంగ స‌భ‌ల‌ను అడ్డుకోవ‌డంలాంటి ప్ర‌య‌త్నాల‌ను పోలీసులు(Police) చేస్తున్నారు. దీంతో ఒక్క‌సారిగా క్యాడ‌ర్ పోలీసుల మీద ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఫ‌లితంగా టెన్ష‌న్ నెల‌కొంటోంది.

పాద‌యాత్ర‌ను వైసీపీ అడ్డుకుంటోంద‌ని.(Yuvagalam)

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వేదికగా శుక్ర‌వారం రాత్రి ఉద్రిక్త‌తను చూశాం. 100 కిలో మీట‌ర్ల యాత్ర ముగిసిన సంద‌ర్భంగా లోకేశ్ బంగారుపాళ్యంలో శిలాఫలకం ఆవిష్కరించారు. ఆ సంద‌ర్భంగా పోలీసులు లోకేశ్ కాన్వాయ్ లోని 3 వాహనాలను సీజ్ చేశారు. అదే స‌మ‌యంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.ఉద్దేశ పూర్వ‌కంగా పోలీసులు, పాద‌యాత్ర‌ను(Yuvagalam)వైసీపీ అడ్డుకుంటోంద‌ని భావించిన టీడీపీ శ్రేణులు ఆగ్ర‌హించారు. బంగారుపాళ్యంలో లోకేశ్ సభకు పోలీసులు (Police) అనుమతి నిరాకరించారు. లోకేశ్ సభకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దాంతో లోకేశ్ ధర్నాకు దిగారు. లోకేశ్ ప్రసంగం వాహనం అందుబాటులో లేకపోవడంతో, ఓ ఎత్తయిన స్టూల్ వేసుకుని మాట్లాడాలని లోకేశ్, టీడీపీ నేతలు భావించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. దాంతో ఆక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. లోకేశ్ జాతీయ జెండా చేతబూని ఆ తోపులాట మధ్యే పాదయాత్ర కొనసాగించే ప్రయత్నం చేశారు.

Also Read : Yuvagalam Security : లోకేశ్ ర‌క్ష‌ణ‌కు మూడంచెల భ‌ద్ర‌త‌, ప్రైవేటు సైన్యం

పాదయాత్రకు అనుమతులు ఇచ్చే సమయంలోనే కొన్ని షరతులు విధించామని, ప్రజలతో ముఖాముఖీ తప్ప సభలకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ఎంతకీ పోలీసులు వెనక్కి తగ్గకపోవడంతో, లోకేశ్ ఓ భవనం మొదటి అంతస్తుకు చేరుకుని అక్కడినుంచి ప్రసంగించారు. దాంతో, టీడీపీ శ్రేణులు ఈలలు, కేకలతో హోరెత్తించారు. పెద్ద ఎత్తున క్యాడ‌ర్ త‌ర‌లి వ‌స్తున్నారు. తొమ్మిదో రోజు పాద‌యాత్ర శ‌నివారంనాడు వ‌జ్రాపురం నుంచి ప్రారంభం అయింది. అక్క‌డే బీసీ లీడ‌ర్ల‌తో స‌మావేశం అయ్యారు. ఆ త‌రువాత ఎస్సీ, ఎస్టీ, వ‌డ్డెర లీడ‌ర్ల‌తో భేటీ అయ్యేలా తొమ్మిదో రోజు యాత్ర ఉంది.

మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు కుమారుడు విజ‌య్ ను ఏపీ పోలీసుల విచార‌ణ

జ‌న‌వ‌రి 27న ప్రారంభ‌మైన పాద‌యాత్ర‌కు(Yuvagalam) తొలి రోజు నుంచి పోలీసులు ఏదో ఒక ర‌కంగా అడ్డంకుల‌ను సృష్టిస్తున్నారు. పోలీసు ఆంక్ష‌ల న‌డుమ సాగిస్తోన్ పాద‌యాత్ర కు పాజిటివ్ స్పంద‌న వ‌స్తోంది. ఆ విష‌యం తెలుసుకున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం స్లీప‌ర్ సెల్స్ ను దింపుతోంద‌ని టీడీపీ అనుమానిస్తోంది. ఇదే ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి…ప్రోగ్రామ్ ను ఎలా అయితే అడ్డుకున్నారో, అలాగే యువ‌గ‌ళాన్ని అడ్డుకోవాల‌ని వైసీపీ ప్లాన్ చేస్తోంద‌ని వినికిడి. చంద్ర‌బాబు నిర్వ‌హించిన `ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి..` ప్రోగ్రామ్ సూప‌ర్ హిట్ అయింది. గుంటూరు, కందూరు కేంద్రంగా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌ల్లో తొక్కిస‌లాట జ‌రిగింది. ఆ క్ర‌మంలో 11 మంది మృతి చెందారు. ఆ కార‌ణంగా జీవో నెంబ‌ర్ 1ను తీసుకొచ్చారు. ఫ‌లితంగా చంద్ర‌బాబు బ‌హిరంగ స‌భ‌లు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

Also Read : CBN Giotag : జ‌గ‌న్ ఎత్తుగ‌డ‌కు టెక్నాల‌జీతో చెక్ పెట్టేలా చంద్ర‌బాబు చ‌తుర‌త‌

మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు కుమారుడు విజ‌య్ ను ఏపీ పోలీసులు(Police) విచార‌ణ చేస్తోన్నారు. సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి ఆరా తీస్తున్నారు. ఆ కేసులో నారా లోకేష్ ను కూడా ఇరికించేలా ప్ర‌భుత్వం ప్లాన్ చేస్తోంది. గ‌తంలోనూ సోష‌ల్ మీడియా పోస్టుల‌ను లైక్ చేసి, ఫార్వార్డ్ చేసిన రంగ‌నాయ‌క‌మ్మ‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ త‌రువాత టీడీపీ క్యాడ‌ర్ చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని సోషల్ మీడియా వారియ‌ర్స్ ను అడ్డుకున్నారు. ఇప్పుడు ఐటీడీపీ ఇంచార్జిగా ఉన్న చింత‌కాయ‌ల విజ‌య్ ను సీరియ‌స్ గా విచారిస్తున్నారు. ఈ కేసు ద్వారా లోకేష్ ను అడ్డుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఇంకో వైపు స్లీపర్ సెల్స్ ను ఏర్పాటు చేయ‌డం ద్వారా లోకేష్ యాత్ర‌ను గంద‌ర‌గోళం చేయాల‌ని మాస్ట‌ర్ స్కెచ్ వైసీపీ వేసింద‌ని స‌మాచారం. మొత్తం మీద `ఇదేం ఖ‌ర్మ‌.. ప్రోగ్రామ్ ను అడ్డుకున్న విధంగా త్వ‌ర‌లోనే యువ‌గ‌ళానికి బ్రేక్ వేయాల‌ని వైసీపీ చేస్తోన్న ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.