Yuvagalam : అప్పుడు ఇప్పుడు తోడ‌ళ్లుల్ల హ‌వా

`త‌నమ‌న తెలియాలంటే బాధ‌లు రావాలంటారు పెద్ద‌లు.` స‌రిగ్గా లోకేష్(Yuvagalam) కు ఇప్పుడు ఆ నానుడిని వ‌ర్తింప చేయొచ్చు.

  • Written By:
  • Publish Date - May 10, 2023 / 01:29 PM IST

`త‌నమ‌న తెలియాలంటే బాధ‌లు రావాలంటారు పెద్ద‌లు.` స‌రిగ్గా లోకేష్(Yuvagalam) కు ఇప్పుడు ఆ నానుడిని వ‌ర్తింప చేయొచ్చు. అధికారంలో ఉన్నప్పుడు త‌న వాళ్లు ఎవ‌రు? ప‌ర‌వాళ్లు ఎవ‌రు? అనేది కూడా చూడ‌కుండా(Lokesh) అధికారం చెలాంచార‌ని పార్టీ వ‌ర్గాల్లో ఉంది. అధికారం పోయాక త‌మ‌ప‌ర భేదం ఏమిటి? అనేది ఆయ‌నకు తెలిసొస్తుంద‌ట‌. ఎందుకంటే, గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా తోడ‌ల్లుడు భ‌ర‌త్(Bharat) కు టిక్కెట్ ఇవ్వ‌డానికి న‌డిచిన త‌తంగం పార్టీలోని కోట‌రీకి బాగా తెలుసు. ఆ త‌రువాత విశాఖ ఎంపీగా ఆయ‌న పోటీచేస్తే, ప్ర‌చారానికి చంద్ర‌బాబు వెళ్ల‌లేదు? ఎందుకు వెళ్ల‌లేదు? అనేదానిపై అప్ప‌ట్లో ప‌లు ర‌కాలుగా పార్టీలోనే అంత‌ర్గ‌తంగా చ‌ర్చ న‌డిచింది.

తోడ‌ళ్లుల్లు భ‌ర‌త్, లోకేష్ పాద‌యాత్ర‌ (Yuvagalam)

రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న కుటుంబానికి చెందిన లీడ‌ర్ భ‌ర‌త్(Bharat). అంతేకాదు, విద్యా రంగంలోనూ ఆయ‌న కుటుంబానికి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. పైగా నంద‌మూరి బాల‌క్రిష్ణ(Balakrishana) చిన్న‌ల్లుడు భ‌ర‌త్‌. పెద్ద‌ల్లుడు నారా లోకేష్‌ (Lokesh)అనే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. పెద్ద కుమార్తె బ్ర‌హ్మ‌ణితో వివాహం జ‌రిగిన త‌రువాత లోకేష్ జాత‌కం మారింది. ఆయ‌న రాజ‌కీయ రంగంలోకి ప్ర‌వేశించ‌డానికి ఆ వివాహం ట‌ర్నింగ్ పాయింట్‌. నంద‌మూరి, నారా రాజ‌కీయ వార‌సునిగా తెర మీద‌కు లోకేష్ రావ‌డానికి కార‌ణం కూడా బ్ర‌హ్మ‌ణితో (Brahmani)వివాహం జ‌ర‌గ‌డ‌మే. తొలి రోజుల్లో ఆ అవ‌కాశాన్ని అందుకోవ‌డానికి లోకేష్ క‌ష్ట‌ప‌డ్డారు. 2009 ఎన్నిక‌ల సంద‌ర్భంగా న‌గ‌దు బ‌దిలీ అనే ఆలోచ‌న లోకేష్ మెద‌డు నుంచి పుట్టింద‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌డం ద్వారా రాజ‌కీయ రంగంలో బీజం ప‌డింది. ఆ త‌రువాత 2014 ఎన్నిక‌ల‌కు ముందుగా చంద్ర‌బాబు చేసిన `వ‌స్తున్నా..మీకోసం` కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయ‌డం వెనుక లోకేష్ ఉన్నార‌నే టాక్ పార్టీలో న‌డిచింది.

విశాఖ ఎంపీగా బాల‌క్రిష్ణ చిన్న‌ల్లుడు భ‌ర‌త్ కు టిక్కెట్

ప్ర‌త్య‌క్ష రాజ‌కీయ కార్య‌క‌లాపాల్లోకి కార్య‌క‌ర్త‌ల స‌మ‌న్వ‌య క‌మిటీ క‌న్వీన‌ర్ గా(Lokesh) పార్టీలో ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌రువాత ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఎదిగారు. ఉమ్మ‌డి ఏపీ విడిపోయిన త‌రువాత 2014లో ఏపీ సీఎంగా చంద్ర‌బాబు (Chandrababu) బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత రెండేళ్ల‌కు క్యాబినెట్లో చేరిపోయారు. అక్క‌డ నుంచి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో చురుగ్గా ఉంటూ 2019 ఎన్నిక‌ల్లో టిక్కెట్ల కేటాయింపులోనూ కీల‌క పాత్ర పోషించారు. ఆ సంద‌ర్భంగా విశాఖ ఎంపీగా బాల‌క్రిష్ణ (Balakrishna) చిన్న‌ల్లుడు భ‌ర‌త్ (Bharat)కు టిక్కెట్ ఇచ్చే విష‌యంలో అంత‌ర్గ‌తంగా కొన్ని ఇబ్బందుల‌ను చంద్ర‌బాబు ఫేస్ చేశార‌ని అప్ప‌ట్లోని టాక్‌. సీన్ క‌ట్ చేస్తే, ఎంపీగా భ‌ర‌త్ ఓడిపోయారు. విశాఖ ఎంపీగా 2024 ఎన్నిక‌ల్లో పోటీకి సిద్ద‌మ‌వుతున్నారు.

కుటుంబాలు గ‌తం కంటే ఇప్పుడు క‌లిసిమెలిసి

ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత కొన్ని రోజులకు తోడ‌ళ్లుల్లు చంద్ర‌బాబు, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు(Daggupati venkateswara Rao) ఒక ఫంక్ష‌న్లో క‌లుసుకున్నారు. ఇద్ద‌రూ క‌లిసి మాట్లాడుకుంటోన్న ఫోటో ఆ మ‌ధ్య వైర‌ల్ అయింది. దీంతో మ‌రోసారి ద‌గ్గుబాటి కుటుంబం టీడీపీలోకి వ‌స్తుంద‌ని ప్ర‌చారం కూడా జ‌రిగింది. అంతేకాదు, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు కుమారుడు హితేష్ చెంచురామ్ (Hithesh Chenchu ram) ప‌ర్చూరు నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతార‌ని టాక్ న‌డిచింది. అందుకు, లోకేష్ (Lokesh) కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని కూడా వినిపించింది. దానికి బ‌లం చేకూరేలా ద‌గ్గుబాటి పురంధ‌రేశ్వ‌రి(Purendraswari) ఎప్పూడులేని విధంగా లోకేష్ లీడ‌ర్ షిప్ క్యాలిటీని మెచ్చుకున్నారు. కానీ, రాజ‌కీయాల‌కు హితేష్ చెంచురామ్ పూర్తిగా దూరమంటూ కొన్ని నెల‌ల త‌రువాత వెంక‌టేశ్వ‌ర‌రావు ప్ర‌క‌టించారు. దీంతో ఆ ప్ర‌చారానికి శాశ్వ‌తంగా తెర‌ప‌డింది. కానీ, రెండు కుటుంబాలు గ‌తం కంటే ఇప్పుడు క‌లిసిమెలిసి ఉంటున్నాయ‌ని సంకేతాలు క్యాడ‌ర్ కు వెళ్లాయి.

Also Read : CBN : పంట బీమా కోసం, రైతు దీక్ష‌కు చంద్రబాబు.?

విశాఖ ఎంపీగా పోటీచేసిన ఓడిన భ‌ర‌త్(Bharat) విష‌యంలోనూ నారా లోకేష్ కు గ్యాప్ ఉంద‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. దానికి శాశ్వ‌తంగా ఫుల్ స్టాప్ పెడేలా లోకేష్ (Lokesh)పాద‌యాత్ర‌లో అక‌స్మాత్తుగా భ‌ర‌త్, తేజ‌స్వి(Tejeswi) క‌నిపించారు. క‌ర్నూలు జిల్లా కోడ‌మూరు నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగుతోన్న పాద‌యాత్ర‌కు సంఘీభావం తెలుపుతూ లోకేష్ క‌లిసి న‌డిచారు. చేతిలో చేయివేసుకుని తేజ‌స్వి, లోకేష్ పాద‌యాత్ర చేయ‌డం క్యాడ‌ర్ ను ఉత్సాహ ప‌రిచింది. ఒక వైపు తేజస్వి మ‌రో వైపు భ‌ర‌త్ న‌డుమ లోకేష్ చేసిన పాద‌యాత్ర హైలెట్ గా నిలిచింది. వాళ్ల మ‌ధ్య ఏ మాత్రం పొర‌పొచ్చాలు లేవ‌నే సంకేతాలు బ‌లంగా వెళ్లాయి. ప్ర‌త్య‌ర్థులు సృష్టించిన గ్యాప్‌, క్యాడ‌ర్ లోని అనుమానాలు ప‌టాపంచ‌లు అయ్యేలా తోడ‌ళ్లుల్లు పాద‌యాత్ర క‌నుల‌విందుగా సాగింది. అధికారం పోతేపోయిందిగానీ త‌మ‌ప‌ర భేదాలు తెలుసుకోవ‌డానికి, బంధుత్వాలు, బంధాలు బ‌ల‌మైన‌వని నిరూపించేలా ఆ ద‌శ్యం ఉంద‌ని కొంద‌రు చెప్పుకోవ‌డం కొస‌మెరుపు.

Also Read : Operation NTR Statue : BRS కు జూనియ‌ర్ క్రేజ్! రేవంత్, T-TDPకి బ్రేక్!