Site icon HashtagU Telugu

Yuvagalam : ఏపీ పోలీస్ ఓవ‌రాక్ష‌న్‌! లోకేష్ పాద‌యాత్ర‌కు జ‌నాద‌ర‌ణ‌!!

Yuvagalam

Yuvagalam

ఏపీ పోలీసుల ఓవ‌రాక్ష‌న్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ యువ‌గ‌ళం(Yuvagalam)ను ఆప‌లేక‌పోతోంది. ఆయ‌న పాద‌యాత్ర‌కు క్ర‌మంగా ఆద‌ర‌ణ పెరుగుతోంది. ఆయ‌న మీద క్రిమిన‌ల్ కేసులు(Police) పెడుతున్నారు. మైకులు లాక్కుంటున్నారు. ప్ర‌చార వాహ‌నాన్ని సీజ్ చేస్తున్నారు. లైట్లను ఆపేస్తున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు రూట్ల‌ను మార్చేస్తున్నారు. జ‌నాన్ని ఆపేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇలా ఎన్ని అడ్డంకులు సృష్టించిన‌ప్ప‌టికీ యువ‌గ‌ళంకు ప్ర‌జాద‌ర‌ణ క‌నిపిస్తోంది. ప‌లు అంశాల‌పై లోకేష్ స్ప‌ష్ట‌త‌ను ఇస్తున్నారు. రాబోవు రోజుల్లో అధికారంలోకి వ‌స్తే ఆయా సామాజిక‌వ‌ర్గాల‌కు అందించే సేవ గురించి చెబుతున్నారు. ప్ర‌స్తుత పాల‌న మీద క‌సిగా మాట్లాడుతూ భ‌విష్య‌త్ ను సామాన్యుల ముందు ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ యువ‌గ‌ళం(Yuvagalam)

చిత్తూరు జిల్లా కుప్పం వ‌ద్ద జ‌న‌వ‌రి 27వ తేదీ ప్రారంభ‌మైన ఆయ‌న పాద‌యాత్ర(Yuvagalam) తొలి రోజు నుంచి ఉద్రిక్త‌త మ‌ధ్య సాగుతోంది. జీవో నెంబ‌ర్ 1 ద్వారా పెట్టిన ఆంక్ష‌ల న‌డుమ యువ‌గ‌ళం కొన‌సాగుతోంది. గ‌తంలో ఎప్పుడూ ఇలాంటి ఆంక్ష‌లు ప్ర‌భుత్వాలు పెట్ట‌లేదు. స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఉమ్మ‌డి ఏపీ వ్యాప్తంగా పాద‌యాత్ర నిర్వ‌హించారు. అప్పుడు సీఎంగా ఉన్న చంద్ర‌బాబు పూర్తి భ‌ద్ర‌త‌ను వైఎస్ కు క‌ల్పించారు. ఎక్క‌డా ఇబ్బంది రాకుండా ప్ర‌భుత్వం ప‌రంగా సెక్యూరిటీ ఇచ్చారు. ఎలాంటి ఆంక్ష‌లు లేకుండా స్వేచ్ఛ‌గా ప్ర‌జాప్ర‌స్థానం పాద‌యాత్ర చేశారు. ఆ త‌రువాత విడిపోయిన ఏపీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 2018 నుంచి పాద‌యాత్ర‌కు దిగారు. అప్పుడు కూడా చంద్ర‌బాబు సీఎంగా ఉన్నారు. ప్ర‌స్తుతం అనుస‌రిస్తోన్న ప‌ద్ధ‌తుల‌ను ఆనాటి బాబు ప్ర‌భుత్వం అనుస‌రించ‌లేదు. రాజ్యాంగం, చ‌ట్టం ప్ర‌కారం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర చేసుకునేలా వెసుల‌బాటు క‌ల్పించారు.

ఇదేం ఖ‌ర్మ రాష్ట్రం.` ప్రోగ్రామ్ కు అనూహ్యంగా జ‌నం

ప్ర‌స్తుతం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎంగా ఉన్నారు. ప్ర‌తిప‌క్షాల‌కు ఉద్య‌మాలు, పోరాటాలు, యాత్ర‌లు చేసుకోవ‌డానికి అవ‌కాశం ఇవ్వ‌కుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. `ఇదేం ఖ‌ర్మ రాష్ట్రం.` ప్రోగ్రామ్ కు అనూహ్యంగా జ‌నం వ‌చ్చారు. ఉత్త‌రాంధ్ర నుంచి గుంటూరు వ‌ర‌కు జ‌రిగిన స‌భ‌ల‌కు తండోప‌తండాలుగా జ‌నం హాజర‌య్యారు. నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరు కేంద్రంగా తొక్కిస‌లాట జ‌రిగింది. అదంతా వైసీపీ స్లీప‌ర్ సెల్స్ చేసిన ప‌నిగా టీడీపీ చెబుతోంది. కార‌ణం ఏదైన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు ప్రోగ్రామ్ తాత్కాలికంగా ఆగిపోయింది. అదే ఒర‌వ‌డితో చంద్ర‌బాబు రాష్ట్ర వ్యాప్తంగా స‌భ‌ల‌ను నిర్వ‌హించి ఉంటే ఈపాటికి ప్ర‌జా ఉద్య‌మం నిర్మాణం అయ్యేది. అందుకే, ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా జీవో నెంబ‌ర్ 1ను జారీ చేసింద‌ని టీడీపీ భావిస్తోంది.

Also Read : Yuvagalam Security : లోకేశ్ ర‌క్ష‌ణ‌కు మూడంచెల భ‌ద్ర‌త‌, ప్రైవేటు సైన్యం

తాజాగా జీవో నెంబ‌ర్ 1 ను లోకేష్ పాద‌యాత్ర మీద ఏపీ పోలీసులు(Police) ప్ర‌యోగిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం, ప‌ల‌మ‌నేరు పాద‌యాత్ర ముగిసిన త‌రువాత గురువారం గంగాధ‌ర నెల్లూరుకు ఎంట్రీ ఇచ్చారు. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర ప్రారంభించ‌డానికి సిద్ధ‌మైన క్ర‌మంలో పోలీసులు లోకేష్ చేతిలోని మైకునే లాగేసుకున్నారు. ఆంక్ష‌ల‌కు విరుద్ధంగా పాద‌యాత్ర ఉంద‌ని న‌ర్సింగరాయపేట పిఎస్ లో లోకేష్ పై క్రిమినల్ కేసును నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 188, 341, 290 రెడ్ విత్ 34 కింద పోలీసులు కేసు పెట్ట‌డం ఓవ‌రాక్ష‌న్ గా టీడీపీ చెబుతోంది.

ఏపీ పోలీసుల ఓవ‌రాక్ష‌న్ (Police)

లోకేష్ తో పాటు ఇతర తెలుగుదేశం పార్టీ నేతల పైన కూడా పోలీసులే (Police) ఫిర్యాదు చెయ్యటం విచిత్రం. పాదయాత్ర ప్రారంభించిన జ‌న‌వ‌రి 27వ తేదీ నుంచి ఇప్పటివరకు నారా లోకేష్ పై కేసును నమోదు అవుతూనే ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో లోకేష్ పై కేసు నమోదు కావడం ఐదోసారి. చిత్తూరు జిల్లాలో గురువారం పాదయాత్రలో భాగంగా జీడీ నెల్లూరు నియోజకవర్గ సంసిరెడ్డిపల్లిలో లోకేష్ బ‌య‌లు దేరారు. అక్క‌డ ఆయ‌న కోసం వ‌చ్చిన జ‌నంతో మాట్లాడేందుకు స్టూలు ఎక్కారు. దీంతో నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించార‌ని స్టూలును పోలీసులు లాగేసుకున్నారు. కార్య‌కర్త‌లు అడ్డుకోవ‌డంతో ఉద్రిక్తత నెల‌కొంది. ఆ త‌రువాత ఆయ‌న చేతిలో స్పీక‌ర్ ను పోలీసులు లాగేసి ప్ర‌య‌త్నం చేయ‌గా క్యాడ‌ర్ అడ్డుకుంది. ఇలా ప్ర‌తి రోజూ అడుగ‌డుగునా పోలీసులు అడ్డుత‌గులుతున్నారు. అయిన‌ప్ప‌టికీ లోకేష్ మాత్రం పాద‌యాత్ర‌ను(Yuvagalam) కొన‌సాగిస్తూ ప్ర‌జాద‌ర‌ణ పొందుతున్నారు.