YS Sharmila : వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసుల‌పై స్పందించిన ష‌ర్మిల

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. అయితే సీబీఐ

  • Written By:
  • Publish Date - January 24, 2023 / 04:43 PM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. అయితే సీబీఐ అవినాష్‌రెడ్డికి ఇచ్చిన నోటీసుల‌పై వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల స్పందించారు. వైఎస్ వివేకానంద‌రెడ్డిని హ‌త్య చేసిన వారిని వెంట‌నే అరెస్ట్ చేసి శిక్షించాల‌ని ఆమె డిమాండ్ చేశారు. క‌డ‌ప జిల్లాలో బాబాయ్ వివేకానంద‌రెడ్డి చాలా గొప్ప నాయ‌కుడ‌ని.. ఎవ‌రైనా ఎదైనా స‌మ‌స్యతో వ‌స్తే ఆ మ‌నిషిని వెంట‌పెట్టుకుని ఆ డిపార్ట్‌మెంట్‌కి వెళ్లి మ‌రీ ప‌ని చేయించేవారిని ష‌ర్మిల తెలిపారు. ఇలాంటి మంచి నాయ‌కుడిని అతి దారుణంగా గొడ్డ‌లి వేటు వేసి చంపిన విష‌యం అంద‌రికి తెలిసిందేన‌న్నారు. ఒక్క కేసు విచార‌ణ చేయ‌డానికి సంవ‌త్స‌రాలు ప‌డితే వ్య‌వ‌స్థ‌పై కానీ సీబీఐపై కానీ ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం ఎలా ఉంటుంద‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఈ కేసులో ఇప్ప‌టికైనా నిజ‌నిజాలు తేల్చాల‌ని ఆమె సీబీఐని కోరారు. వైఎస్ వివేకానంద రెడ్డి మృతి కేసును వీలైనంత త్వరగా ఛేదించాలని, దోషుల‌ను త్వ‌ర‌గా అరెస్ట్ చేయాల‌ని వైఎస్ఆర్ కుటుంబం తరపున షర్మిల సీబీఐని అభ్యర్థించారు.