ఏపీ(AP)లో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల సమరం జరగబోతుంది. ఈ క్రమంలో అధికార పార్టీ వైసీపీ (YCP) తో పాటు మిగతా పార్టీలన్నీ ఎన్నికలపై దృష్టి సారించాయి. ముఖ్యంగా వైసీపీ మరోసారి విజయకేతనం ఎగురవేయాలని గట్టిగా సన్నాహాలు చేస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని వారి స్థానాల్లో కొత్తవారికి ఛాన్స్ ఇచ్చేందుకు డిసైడ్ అయ్యింది. అలాగే పలువురు నేతలను సైతం స్దాన మార్పిడి చేస్తూ లిస్ట్ లను ప్రకటిస్తూ వస్తుంది. ప్రకటించిన లిస్ట్ ప్రకారమే టికెట్స్ ఇవ్వబోతున్నారు. దీంతో ఎవరెవరి పేర్లు ఉంటాయో అనే ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు టెన్షన్ లో అతలాకుతలం అవుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పటికే రెండు లిస్ట్ లను విడుదల చేసిన వైసీపీ..మరో రెండు రోజుల్లో మూడో లిస్ట్ విడుదల చేయబోతుంది. ఈ లిస్ట్ లో తమ పేర్లు ఉన్నాయో..లేవో తెలుసుకునేందుకు సీఎం క్యాంప్ ఆఫీస్ కు సిట్టింగ్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. పేర్లు ఉన్న వారు ఉంటున్నారో..పేర్లు లేవని తెలిసిన వారు ఇతర పార్టీల్లోకి చేరేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు జనసేన , టీడీపీ లలో చేరగా..మూడో లిస్ట్ తర్వాత పెద్ద ఎత్తున పార్టీ నుండి బయటకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం మంత్రులుగా చెలామణి అవుతున్న వారిలో దాదాపు 90 % మందికి టికెట్ ఇవ్వడం లేదని సమాచారం. గుడివాడ అమర్నాద్ , రోజా , జోగి , అంబటి రాంబాబు ఇలా నిత్యం మీడియా లో జగన్ భజన చేసేవారికి సైతం టికెట్ ఇవ్వడం లేదని వినికిడి. మరి వీరి నెక్స్ట్ భవిష్యత్ ఏంటి అనేది చూడాలి.
Read Also : Praja Palana: ప్రజాపాలనకు భారీ స్పందన, 57 లక్షల దరఖాస్తులు స్వీకరణ!