రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర (YCP Samajika Sadhikara Bus Yatra) విజయవంతంగా కొనసాగుతుంది. ఈ యాత్ర కు ప్రజలు, వైసీపీ కార్యకర్తలు , అభిమానులు బ్రహ్మ రథంపడుతున్నారు. తొలి విడతలో మూడు ప్రాంతాల్లోని 39 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. సామాజిక సాధికార యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం వైఎస్ జగన్ (CM Jagan) చేసిన మేలును వివరిస్తున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలతో వారి జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయని చెప్పేందుకు ఈ యాత్రను చేపట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
నేడు ఏడురోజు కు చేరింది ఈ యాత్ర. శనివారం సత్యసాయి జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా గుంటూరు తూర్పు, విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గాల్లో జరుగుతుంది. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు ధర్మవరం టౌన్ పోలీసు స్టేషన్ నుంచి ర్యాలీ జరపనున్నారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో వైయస్ఆర్‌సీపీ నేతలు మాట్లాడనున్నారు. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రులు అంజాద్ బాషా, గుమ్మనూరు జయరాం, మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ బుట్టా రేణుక తదితరులు ఈ సభలో పాల్గొనున్నారు.
ఎల్లుండి నవంబర్ 6 – గాజువాక, రాజమండ్రి రూరల్, మార్కాపురం, నవంబర్ 7 – రాజాం, వినుకొండ, ఆళ్లగడ్డ , నవంబర్ 8 – సాలూరు, పాలకొల్లు, నెల్లూరు రూరల్, నవంబర్ 9 – అనకాపల్లి, పామర్రు, తంబళ్లపల్లె లో యాత్ర కొనసాగనుంది.
Read Also : Telangana Elections 2023 : కాంగ్రెస్ కే ‘జై’ అంటున్న చిన్న పార్టీలు..మరి ఫలితం ఎలా ఉంటుందో..?