Site icon HashtagU Telugu

YSRCP 8th List : మరో జాబితాను విడుదల చేసిన వైఎస్‌ఆర్‌సిపి

Ysrcp Released Another List

Ysrcp Released Another List

 

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ లోక్ సభ , అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను నియమిస్తూ తాజాగా  మరో జాబితాను విడుదల చేసింది.. ఇందులో భాగంగానే వైసీపీ ఎనిమిదో జాబితాను విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన 8వ జాబితాలో కొందరు ఇంచార్జ్‌ల పేర్లను మారుస్తూ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు లోక్ సభ, ముగ్గురు అసెంబ్లీ ఇంచార్జుల పేర్లను ప్రకటించింది. గుంటూరు లోక్ సభ ఇంచార్జుగా కిలారి రోశయ్య, ఒంగోలు లోక్ సభ ఇంచార్జుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లను ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం.

దాదాపు 60 మందికి పైగా నియోజకవర్గ ఇంచార్జుల పేర్లను వెల్లడించిన వైసీపీ.. తాజాగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటిస్తూ 8వ జాబితాను ప్రకటించింది. కిలారి రోశయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అంబటి మురళిని పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్‌గా నియమించింది. కందుకూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్‌గా బుర్రా మధుసూదన్ యాదవ్ పేరును ఖరారు చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే, జి.డి నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్‌గా కల్లత్తూర్ కృపాలక్ష్మికి వైసీపీ ఛాన్స్ ఇచ్చింది. ఇటీవలే గుంటూరు ఎంపీగా ఉమారెడ్డి వెంకటరమణను ప్రకటించగా.. ఆయన స్థానంలో అదే కుటుంబానికి చెందిన రోశయ్యను అభ్యర్థిగా ప్రకటించారు. జీడి నెల్లూరు వైసీపీ అభ్యర్థిని కూడా మళ్లీ మార్చింది.

వైసీపీ 8వ జాబితా:

జీడి నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామిని చిత్తూరు పార్లమెంటుకు మార్చారు. ఈసారి నారాయణస్వామి కూతురుకు ఛాన్స్ ఇచ్చారు. ఈ జాబితాలో నారాయణస్వామికి బదులుగా ఆయన కుమార్తెకు వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. కొత్త అభ్యర్థిగా కళత్తూరు కృపాలక్ష్మిని నియమించిన వైసీపీ.. గుంటూరు పార్లమెంటు సమన్వయకర్తను కూడా మార్చేసింది.

read also : Drugs Case : డైరెక్టర్ క్రిష్ కోసం పోలీసుల గాలింపు