ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై తెలుగుదేశం పార్టీ నిత్యం విమర్శలు చేస్తూనే ఉంటుంది. మరోవైపు ఎల్లో మీడియా అయితే ప్రతిరోజు వైసీపీ ప్రభుత్వం అండ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై విషపు రాతలు రాస్తూనే ఉంది. ఇక ఇటీవల టీడీపీతో పాటు జనసేన కూడా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుంది. రాష్ట్రంలో ఏ మూలనైనా చీమ చిటుక్కుమంటే చాలు, జూమ్‌లో 40 ఇయర్స్ చంద్రబాబు సూచనలు ఇవ్వడం, టీడీపీ తమ్ముళ్ళు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఆక్ పాక్ కరేపాక్ వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారింది.
ఇక తాజా మ్యాటర్ ఏంటంటే శ్రీలంకలో ప్రస్తుతం ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. ఇండియాకి పొరుగున ఉన్న శ్రీలంకలో ఆర్థిక, ఆహార, రాజకీయ సంక్షోభం తీవ్రమైన సంగతి తెలిసిందే. ఒకవైపు కరోనా మహమ్మారి దెబ్బ, మరోవైపు ఉక్రెయిన్-రష్యా వార్ కారణంగా శ్రీలంకలో సంక్షభం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో సంక్షభం ఏర్పడనుందని టీడీపీ నేతలు అండ్ ఎల్లో మీడియా జోరుగా ప్రచారం చేస్తుంది. ఇప్పటికే టీడీపీ అనుకూల మీడియాలో మరో శ్రీలంకగా మారనున్న ఆంధ్రప్రదేశ్ అంటూ హాట్ హాట్‌గా వార్తలు క్రియేట్ చేసి ప్రసారం చేస్తున్నారు.
మరోవైపు అవే ఎల్లో పత్రికల్లో పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి మరీ మెయిన్ ఎడిషన్లలో ఏపీ మరో లంకగా మారనుంది అంటూ పచ్చనైన విషపు వార్తలు వండి వాడ్చుతున్నారు. ఇక టీడీపీ తమ్ముళ్ళు మైక్ పట్టుకుంటే చేసే వ్యాఖ్యలు గురించి ఎంత తక్కువ చర్చించుకుంటే అంత మంచిది. అయితే వీళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా, వైసీపీ వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు ధీటుగానే కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష అనుబంధ మీడియా సంస్థలు చేసే దుర్మార్గపు ప్రచారాలకు వైసీపీ వర్గీయులు ఘాటులగానే బదలిస్తూ వస్తున్నారు.
ఇక ఈ క్రమంలో తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను శ్రీలంకను చేయాలని చంద్రబాబు కలలు కంటున్నారని, ఆ కలలను సాకారం చేసుకునుందుకు జూమ్ బాబు పగటి కలలు కంటున్నారని, విజయసాయిరెడ్డి సెటైర్స్ వేశారు. ముఖ్యంగా చంద్రబాబు ఎది మాట్లాడినా పచ్చ మీడియా దాన్ని పెద్ద బ్యానర్ పెట్టి వార్తలు రాయడం 2024 అసెంబ్లీ ఎన్నికల వరకు తప్పేలా లేదని, ఆ తర్వాత ఎలాగూ పార్టీ లేదు, బొక్కా లేదనడం ఖాయమని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
గత ఎన్నికల్లో చంద్రబాబు అండ్ బ్యాచ్‌ను ప్రజలు చెత్తలో తొక్కినప్పటి నుంచి ఎల్లో మీడియా కంటున్న పీడ కలలు రోజురోజుకీ శృతిమించుతున్నాయని, శ్రీలంక మాదిరిగా ఏపీ రాష్ట్రం నాశనం కావాలని ఎల్లో గ్యాంగ్ మొత్తం కోరుకుంటోందని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక గత ఏడాది జాతీయ తలసరి ఆదాయం 1.50 లక్షలు కాగా, రాష్ట్ర తలసరి ఆదాయం 2.08 లక్షలుగా ఉందని, అంతకు ముందు ఏడాది కంటే 31 వేలు పెరిగింది.. పచ్చకామెర్ల బ్యాచ్‌కి కనిపించట్లేదా అని విజయసాయిరెడ్డి ప్రశ్నిస్తూ ఫైర్ అయ్యారు. మరి విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.