స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాధనాన్ని దోచుకోవడం వాస్తవమని రాజమహేంద్రవరం ఎంపీ భరత్ అన్నారు. అందుకే చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 53 రోజుల రిమాండ్‌లో ఉన్నారన్నారు. సీమెన్స్ కంపెనీతో 3 వేల కోట్ల ఎంఓయూ కుదుర్చుకుని యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ పేరుతో షెల్ కంపెనీల ద్వారా 375 కోట్లు కొల్లగొట్టారన్నారు. అన్ని ఆధారాలను పరిశీలించిన ఏసీబీ కోర్టు చంద్రబాబు నాయుడును జైలుకు తరలించిందని.. 53 రోజుల జైలు శిక్ష తర్వాత హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి క్లీన్ చీట్ ఇవ్వలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు, లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చీప్ ట్రిక్స్ ఆడుతున్నారని భరత్ ఆరోపించారు. కానీ వారికి ప్రజలు అలాంటి అవకాశం ఇవ్వరని.. మళ్లీ ఏపీకి సీఎంగా జగన్‌మోహన్ రెడ్డి అవుతారని ఎంపీ భరత్ జోస్యం చెప్పారు. యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన రాకపోయినా లోకేష్ పాదయాత్ర చేస్తున్నానని తెలిపారు.
YCP MP : ప్రజా ధనాన్ని చంద్రబాబు లూటీ చేశారు : వైసీపీ ఎంపీ భరత్

Ysrcp