Site icon HashtagU Telugu

YSRCP : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్సీ జంగా..!

Ysrcp

Ysrcp

ఏపీలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది అధికార పార్టీలో అసంతృప్త నేత‌లు పెరుగుతున్నారు. ఇప్పటికే ప‌లువురు ఎమ్మెల్యేలు టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో వారంతా ఇత‌ర పార్టీల్లో చేరుతున్నారు. నాలుగు జాబితాల్లో 60 మందికి పైగా ఎమ్మెల్యేలను వైసీపీ అధిష్టానం మార్పులు చేసింది. వీరిలో ప‌లువురు ఎమ్మెల్యేల‌ను స్థాన చ‌ల‌నం చేయ‌గా.. ప‌లువురికి టికెట్లు నిరాక‌రించింది. ఇటు ప‌ల్నాడు జిల్లాలో బీసీ సామాజిక‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్సీ జంగా కృష్ణ‌మూర్తి పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు.గుర‌జాల నుంచి త‌న‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల‌ని ఆయ‌న అధిష్టానాన్ని కోరారు. అయితే ప్ర‌స్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కాసు మ‌హేష్ రెడ్డికే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మరోసారి టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌నే సంకేతాలు అధిష్టానం వైపు నుంచి వ‌స్తున్నాయి. దీంతో ఎమ్మెల్సీ జంగా కృష్ణ‌మూర్తి అసంతృప్తిగా ఉన్నారు. పెనమ‌లూరు ఎమ్మెల్యే పార్థ‌సార‌థితో పాటు జంగా పార్టీ మారుతార‌ని జోరుగా ప్ర‌చారం సాగింది. అయితే ఆ ప్ర‌చారాన్ని ఎమ్మెల్సీ జంగా కృష్ణ‌మూర్తి ఖండించారు.

We’re now on WhatsApp. Click to Join.

తాను వైసీపీలోనే ఉన్నానని.. త‌న‌కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తార‌ని ఆశిస్తున్నాన‌ని తెలిపారు. టికెట్ రాక‌పోతే బీసీ సంఘాల‌తో చ‌ర్చించి భవిష్య‌త్ కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాన‌ని తెలిపారు.పెన‌మ‌లూరు ఎమ్మెల్యే పార్థసార‌థితో పాటు తిరువూరు, నందికొట్కూరు ఎమ్మెల్యేలు కూడా టీడీపీలోకి వెళ్తార‌నే ప్ర‌చారం సాగుతుంది. వీరితో పాటు ఎమ్మెల్సీ జంగా కృష్ణ‌మూర్తి కూడా టీడీపీలో చేరతార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే ఐదో జాబితాలో గుర‌జాల టికెట్ ఎమ్మెల్సీ జంగా కృష్ణ‌మూర్తికి రాక‌పోతే ఆయ‌న పార్టీ మారే అవ‌కాశం ఎక్కువ‌గా ఉన్న‌ట్లు స‌న్నిహితులు చెప్తున్నారు. మ‌రో ఐదో జాబితాలో ఎవ‌రికి చోటు ద‌క్కుతుందో వేచి చూడాలి.

Also Read:  7 Killed : తుపాకీతో రెచ్చిపోయిన దుండగుడు.. రెండు ఇళ్లలో కాల్పులు.. ఏడుగురి మృతి