Site icon HashtagU Telugu

AP MLC Recording Dance: ఏపీ ఎమ్మెల్సీ రికార్డింగ్ డాన్స్.. చక్కర్లు కొడుతున్న వీడియో!

Mlc

Mlc

ఇటీవల ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ త‌ర‌ఫున ఇటీవ‌ల ఎమ్మెల్సీగా ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన బొమ్మి ఇజ్రాయెల్ ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయ‌న ఇవాళ తొలిసారి సొంత జిల్లా అమ‌లాపురంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు స్థానిక వైసీపీ కార్య‌క‌ర్త‌లు, యువ‌త పెద్ద ఎత్తున స‌న్మానం చేశారు. అయితే.. ఈ స‌భ‌లో రికార్డింగ్ డ్యాన్స్ ఏర్పాటు చేశారు. ఇక‌, ఈ డ్యాన్స్‌లోపాల్గొన్న యువ‌తుల‌తో ఎమ్మెల్సీ.. ఇజ్రాయెల్ చిందులేశారు. యువ‌తుల చేతులు ప‌ట్టుకుని.. వారితో స్టెప్పులు వేశారు. వీటిని చూసిన వారు ఆశ్చ‌ర్య‌పోయారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తార‌ని అనుకుంటే.. ఇలా డ్యాన్సులు చేయ‌డ‌మేంట‌ని వారిలో వారు ప్ర‌శ్నించుకున్నారు.

గతంలో వైసీపీ నాయకులు ఇలాగే రికార్డులు చేయడం పట్ల ప్రతిపక్షాలతో పాటు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న టీడీపీ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ‘‘గంట మంత్రి, అరగంట ఎమ్మెల్యే తరువాత మరో ఆణిముత్యం. ఫ్యాంటు జారిపోతున్నా, అయ్యాగారికి సోయ లేదు. అమ్మాయలతో కలిసి, రికార్డింగ్ డ్యాన్సులు వేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే. మీ పార్టీ మొత్తం, ఇంతేనేంటి ?’’ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాను చేసిన డాన్స్ వీడియో ఇప్పటిది కాదు.. 2018లో మా ఇంట్లో ఫంక్షన్ సందర్భంగా అప్పుడు డాన్స్ చేశాను అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయిల్ క్లారిటీ ఇచ్చారు.