YCP MLA Slaps: ఆంధ్రపప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ రసవత్తరంగా సాగుతుంది. అయితే కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కాగా వైసీపీ ఎమ్మెల్యే చేసిన పనికి ఓ సాధారణ ఓటర్ అభ్యంతరం చెప్పడంతో ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఈ ఉదయం గుంటూరు జిల్లాలోని పోలింగ్ బూత్ వద్ద తెనాలికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శివకుమార్ ఓటేసేందుకు నేరుగా పోలింగ్ బూత్ లోకి ప్రవేశిస్తుండగా, క్యూలో నిల్చున్న ఓటర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. క్యూలో వెళ్లకుండా నేరుగా ఎలా వెళ్తావని నిలదీశాడు ఆ ఓటర్. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే శివకుమార్ ఓటరు చెంపపై కొట్టాడు.. దీంతో ఓటరు కూడా తిరిగి ఎమ్మెల్యే చెంపపై కొట్టాడు. ఈ క్రమంలోవైసీపీ కార్యకర్తలు ఓటర్ పై దాడి చేశారు.
ఓటరుపై ఎమ్మెల్యే దాడి చేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్యాంగం ప్రకారం ఓటు వేసే వారంతా క్యూలో నిల్చుని ఓటేయాలని, ఎవరికీ ప్రత్యేక అధికారాలు ఉండవని సూచిస్తున్నారు నెటిజన్లు. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
Also Read: NTR Shirt Colour: వైసీపీ పార్టీ కోసం ఎన్టీఆర్ ప్రచారం.. చొక్కా వైరల్