TDP vs YSRCP : మంగ‌ళ‌గిరి నుంచి నేనే పోటీ.. లోకేష్ ని మ‌ళ్లీ ఓడిస్తా

ఏపీలో మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలుస్తారు.. ఎవ‌రు ఓడిపోతార‌ని ఇప్ప‌టి నుంచే చ‌ర్చ మొద‌లైంది.

  • Written By:
  • Publish Date - August 30, 2022 / 07:35 AM IST

ఏపీలో మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలుస్తారు.. ఎవ‌రు ఓడిపోతార‌ని ఇప్ప‌టి నుంచే చ‌ర్చ మొద‌లైంది. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పోటీ చేసి త‌న ప్ర‌త్య‌ర్థి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిపై ఓడిపోయారు. అయితే ఓడిపోయిన త‌రువాత నుంచి నారా లోకేష్ నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌దైన శైలిలో కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా నిలుస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లుగ్రామాల్లో ఆయ‌న ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల్ని క‌లుస్తున్నారు. చాలామంద‌కి ఆర్థికంగా ఉప‌యోగ‌ప‌డేందుకు తోపుడుబండ్లు లాంటివి ఇచ్చి వారికి ఉపాధి క‌ల్పిస్తున్నారు. ఇటీవ‌లే మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఆరోగ్య‌ర‌థాన్ని ఆయ‌న ప్రారంభించారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు ఏ స‌మ‌స్య‌పై వ‌చ్చిన ప్ర‌భుత్వం నుంచి సంక్షేమ కార్య‌క్ర‌మాలు అందక‌పోయిన త‌న సొంత డ‌బ్బుల‌తోనే ఆయ‌న ఆదుకుంటున్నారు.

ఇది ఇలా ఉంటే మంగ‌ళ‌గిరి వైసీపీ నుంచి గెలిచిన ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద‌గా ప‌ర్య‌టించడంలేదు. మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆళ్ల రామకృష్ణారెడ్డి భావించిన‌ప్ప‌టికి ఆయ‌న‌కు ప‌ద‌వి ఇవ్వ‌లేదు. దీంతో ఆయ‌న కొంత అసంతృప్తిగా ఉన్నార‌నే వార్త‌లు వ‌చ్చాయి. నియోజ‌క‌వ‌ర్గంలో కూడా ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉండ‌టంలేద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. తాజాగా ఆయ‌న సీంఎ క్యాంప్ కార్యాల‌యంకి వ‌చ్చారు. టీడీపీ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన గంజి చిరంజీవిని తీసుకుని ఆయ‌న సీఎం ని క‌లిశారు. సీఎం జ‌గ‌న్ స‌మక్షంలో గంజి చిరంజీవి పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ 2024 ఎన్నికలలో 100కి 100% తానే మంగళగిరి వైసీపీ అభ్యర్ధి గా పోటీ చేస్తాన‌ని తెలిపారు. SC,ST,BC మైనార్టీ లతో పాటు అందరిని కలుపుకుని, అందరి సహకారంతో లోకేష్ ని 15 వేలకు పై ఓట్లతో ఓడించి విజయం సాధిస్తాని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.