Site icon HashtagU Telugu

YSRCP : సీఎం జ‌గ‌న్‌పై పెన‌మ‌లూరు వైసీపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్‌

kolusu parthasarathi MLA

kolusu parthasarathi MLA

వైసీపీలో సొంత పార్టీ ఎమ్మెల్యేల ధిక్కార స్వ‌రం రోజురోజుకి పెరుగిపోతుంది. ఇప్ప‌టికే చాలామంది ఎమ్మెల్యేల‌ను క్యాంప్ ఆఫీస్‌కు పిలిచి టికెట్ లేన‌ట్లు ప్ర‌క‌టిస్తుండ‌టంతో ఎమ్మెల్యేలు అంతా అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఎమ్మెల్యేల‌ను దాదాపుగా మారుస్తున్నారు. జ‌గ‌న్ సొంత సామాజిక‌వ‌ర్గం వారిని త‌ప్ప మిగిలిన వారిని మారుస్తున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. తాజాగా ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలో కూడా చాలా మంది ఎమ్మెల్యేల‌ను మారుస్తున్న‌ట్లు తెలుస్తుంది. జిల్లాలో సీనియ‌ర్ నాయ‌కుడు.. మాజీ మంత్రి, ప్ర‌స్తుతం పెన‌మ‌లూరు ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్థ‌సార‌థిని కూడా మారుస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌ర‌గుతుంది. అయితే ఈ ప్ర‌చారానికి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు బ‌లం చేకురుస్తున్నాయి. వైసీపీ నిర్వ‌హిస్తున్న సామాజిక సాధికార బ‌స్సు యాత్ర సంద‌ర్భంగా ఆయ‌న అధిష్టానంపై హాట్ కామెంట్స్ చేశారు. త‌న‌ను నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జలు గుర్తించి గెలిపించారు కానీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మాత్రం త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. పెనమలూరు నియోజకవర్గంలో అన్ని కులాలు తనని ఆదరించినా సీఎం జగన్ మాత్రం తనని గుర్తించకపోవటం దురదృష్టకరమని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అవమానాలు ఎదురైనా.. ప్రజలే తనని కాపాడుతారంటూ స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

తాను ఎమ్మెల్యేను కాదనీ, ప్రజలకు సేవకుడిగా ఉంటానని పార్థసారథి భావోద్వేగానికి లోనయ్యారు. తన జీవితాంతం తన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. గతంలో పామర్రు సభలోనూ ఎమ్మెల్యే పార్థసారధి తన అసంతృప్తిని వెల్లడించారు. తనకు సీటు వస్తుందో లేదోనని సంచలన కామెంట్ చేశారు. ఇప్పుడు తాజాగా అధినేత‌పైనే హాట్ కామెంట్స్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. పార్థ‌సారిథిని పెన‌మ‌లూరు నుంచి గ‌న్న‌వ‌రం పంపించాల‌ని అధినేత జ‌గ‌న్ ఆలోచిస్తున్నారు. గ‌న్న‌వరంలో వైసీపీ అభ్య‌ర్థిగా వంశీ పోటీ చేస్తే ఓడిపోతార‌ని స‌ర్వేల్లో తేల‌డంతో వంశీని పెన‌మలూరుకు, సార‌థిని గ‌న్న‌వ‌రం పంపించాల‌ని ఆలోచిస్తున్నారు. అయితే త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం వ‌దిలి గ‌న్న‌వ‌రం ఎలా వెళ్తాన‌ని సార‌థి స‌న్నిహితుల వ‌ద్ద అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌తంలో వైఎస్ హ‌యాంలో మంత్రిగా ప‌నిచేసిన త‌న‌ను జ‌గ‌న్ ప్రాధాన్య‌త ఇవ్వ‌డంలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Also Read:  AP Police : న్యూ ఇయ‌ర్ వేడుక‌లకు మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసిన వైజాగ్ పోలీసులు.. అతిక్ర‌మిస్తే క‌ఠిన‌చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిక‌