నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి (MLA Mekapati) చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. గుండెలో నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో మర్రిపాడులోని ఆయన ఇంట్లోనే ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. మెరుగైన వైద్యం కోసం ఆయనను చెన్నైకి తరలించే ఆలోచనలో ఆయన కుటుంబసభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ నేత విజయ్ రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో ఇలా జరగడం గమనార్హం. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారన్న కారణంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని వైసీపీ హైకమాండ్ సస్పెండ్ చేసింది.
Also Read: TSPSC : రేవంత్ రెడ్డి లీక్స్ దెబ్బ! ఈడీకి పేపర్ లీక్ భాగోతం!
కొన్నాళ్లు బెంగళూరులో ఉన్న మేకపాటి రెండు రోజుల క్రితమే ఉదయగిరి వచ్చారు. మెరుగైన వైద్యం కోసం ఎమ్మెల్యేను చెన్నై తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. గత నెలలో కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. అప్పుడు రెండు వాల్వ్ లు బ్లాక్ అయినట్లు గుర్తించిన వైద్యులు.. తగిన చికిత్స అందించడంతో ఆయన కోలుకున్నారు. అంతకుముందు 2021 డిసెంబర్ లోనూ చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. అప్పుడు బెంగళూరుకు తరిలించి సర్జరీ చేసి స్టెంట్ వేసిన విషయం తెలిసిందే. రెండుసార్లు హార్ట్ ఎటాక్ రావడంతో స్టంట్స్ వేయించుకుని కోలుకుంటున్న ఆయన తాజా రాజకీయ పరిణామాలతో టెన్షన్ కు గురైనట్లు తెలుస్తోంది.