TDP vs YCP : టీడీపీ మ‌ద్ద‌తుతోనే ఐటీ ఉద్యోగులు ఆందోళ‌నలు : వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్ట్ త‌రువాత హైద‌రాబాద్‌తో పాటు ఇత‌ర దేశాల్లో ఆందోళ‌న‌లు జ‌రుగుత‌న్నాయి. అయితే ఈ

  • Written By:
  • Publish Date - September 18, 2023 / 07:57 PM IST

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్ట్ త‌రువాత హైద‌రాబాద్‌తో పాటు ఇత‌ర దేశాల్లో ఆందోళ‌న‌లు జ‌రుగుత‌న్నాయి. అయితే ఈ ఆందోళ‌న‌లు టీడీపీనే చేపిస్తుంద‌ని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఆరోపించారు. ఐటీ ఉద్యోగుల ఆందోళ‌న అంతా కృత్రిమ కార్య‌క్ర‌మ‌న్నారు. AP స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో పాత్ర పోషించినందుకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించిన నాయుడు ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు. సెప్టెంబర్ 9న అతడిని అరెస్టు చేశారు. చంద్ర‌బాబు అరెస్ట్‌ని ఆయ‌న సామాజిక‌వ‌ర్గం త‌ప్ప ఎవ‌రూ స్పందించ‌డంలేద‌న్నారు. అణగారిన వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు ఇతర ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వల్లనే లక్షలాది మంది యువత ఐటీ రంగంలో ఉద్యోగాలు పొందారని పేర్కొన్నారు. స్పష్టమైన ఆధారాలతో అరెస్ట్ చేసిన చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా కమ్మ సామాజికవర్గం స్పందించడం సరికాదన్నారు. కమ్మ సామాజికవర్గం ఇలాగే వ్యవహరిస్తే సామాజిక బహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. వంగవీటి రంగా, వైయస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ప్రజల స్పందన వాస్తవమేనన్నారు. చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ తెలుగుదేశంలో చేరిన తర్వాత ఏపీలో అవినీతి రాజ్యమేలుతోందని చంద్రశేఖర రెడ్డి అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ డ్రామాలు ఆడుతున్నారన్నారు.