Site icon HashtagU Telugu

NTR’s Statue: ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం.. నారా లోకేశ్ ఆగ్రహం

Ntr Statue

Ntr Statue

గుంటూరులో పట్టపగలు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. విగ్రహ ధ్వంసానికి పాల్పడిన యువకుడిని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) సభ్యుడు శెట్టిపల్లి కోటేశ్వర్‌రావుగా గుర్తించారు. గుంటూరులోని దుర్గి గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీ రామారావు విగ్రహాన్ని సుత్తితో ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. ఎన్టీఆర్ గా పేరొందిన నందమూరి తారక రామారావు 1983 నుండి 1995 మధ్య మూడు పర్యాయాలు ఏడేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

ఈ ఘటనపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. తన తాత విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మాచర్ల నియోజకవర్గం దుర్గిలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని వైసీపీ నేత శెట్టిపల్లి కోటేశ్వరరావు ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.