Site icon HashtagU Telugu

YCP : పిల్లాడి సైకిల్ పై వైసీపీ నేతల ప్రతాపం..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

Ycp Sico

Ycp Sico

అధికారం పోయినప్పటికీ వైసీపీ సైకోల్లో మార్పు అనేది రావడం లేదు. అధికారం ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో..ఇప్పుడు కూడా అదే ధోరణిలో ప్రవర్తిస్తూ ఛీ అనిపించుకుంటున్నారు. తాజాగా జోగి రమేష్ (Jogi Ramesh)ఇంట్లో శుభకార్యం జరుగుతుండగా, వైసీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అదే సమయంలో వీరు వెళ్తున్న దారిలో ఓ చిన్నారి సైకిల్ (Cycle) తొక్కుకుంటూ రాగా.. ఆ చిన్నారి సైకిల్‌ను లాక్కుని పక్కకు విసిరేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆ చిన్నారి భయంతో బిక్కుబిక్కుమంటున్న దృశ్యం ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేస్తోంది.

LPG Cylinder: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఏకంగా రూ. 24 తగ్గింపు!

సైకిల్ టీడీపీ గుర్తు కావొచ్చు, కానీ అది ఒక చిన్నారి ఆడుకునే వస్తువు. రాజకీయ చిహ్నంపై ద్వేషంతో, ఆ పిల్లవాడి సైకిల్‌ను ఇలా ధ్వంసం చేయడం సైకో ప్రవర్తన కాక మరేం? అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పార్టీలో ఉండటమంటేనే సామాన్యులపై అణచివేతలా? అధికారంలో ఉన్న సమయంలో ఈ తరహా ప్రవర్తనలే ప్రజలను విసిగించాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటన ద్వారా వైసీపీ కార్యకర్తల మానసిక స్థితి ఎలా ఉందో మరోసారి ప్రజల ఎదుట బయటపడిందని నెటిజన్లు మండిపడుతున్నారు.

Vallabhaneni Vamshi : వంశీపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది – పేర్ని నాని

ఈ సంఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ..సదరు వీడియో ను సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. అబ్బే వాళ్ళేమీ మారలేదు….. వాళ్ళేమీ మారరు కూడా….. ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో… ఆ పేరును సార్ధకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారు. అందుకే నాటికి నేటికీ ఎప్పటికీ అదొక సైకో పార్టీ… వాళ్ళకి సైకో నాయకుడు! ప్రజలు బుద్ధి చెప్పినా మారని వాళ్ళ ఆలోచనలను…. చిన్న పిల్లవాడి చేతిలో నుండి సైకిల్ లాక్కొని దాన్ని తొక్కుతూ విరగ్గొడుతూ వాళ్ళు చేస్తున్న వికృత చేష్టలను సమాజం మరింత గా అర్థం చేసుకోవాలని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అంటూ వీడియో పోస్ట్ చేసారు. “ఇలాంటివాళ్లు మళ్లీ అధికారంలోకి రాకూడదు” అనే భావన ప్రజల్లో పెరుగుతోందని పరిశీలకులు చెబుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల చిహ్నాలను చిన్న పిల్లల ఆటబొమ్మలపై కూడా తట్టుకోలేకుండా ఇలా ప్రవర్తించడం దుర్మార్గం అని అభిప్రాయపడుతున్నారు.