YS Sharmila Party : ష‌ర్మిల పార్టీ కోసం నిరీక్ష‌ణ‌

ఏపీ మాజీ హోంశాఖ మంత్రి మేక‌తోటి సుచ‌రితకు సీఎం జ‌గ‌న్ అపాయిట్మెంట్ ఇవ్వ‌లేదు.

  • Written By:
  • Publish Date - April 12, 2022 / 05:08 PM IST

ఏపీ మాజీ హోంశాఖ మంత్రి మేక‌తోటి సుచ‌రితకు సీఎం జ‌గ‌న్ అపాయిట్మెంట్ ఇవ్వ‌లేదు. రెండు రోజులుగా ప్ర‌య‌త్నం చేస్తున్న‌ప్ప‌టికీ ఆమెకు ఎలాంటి పాజిటివ్ సంకేతాలు తాడేప‌ల్లి ప్యాలెస్ నుంచి ల‌భించ‌లేదు. సీఎం జ‌గ‌న్ నుంచి ఎలాంటి బుజ్జ‌గింపులు ఆమెకు లేక‌పోవ‌డాన్ని అవ‌మానంగా ఫీల్ అవుతున్నారు. పార్టీకి చెందిన ప్ర‌ముఖులు కూడా ప‌ట్టించుకోక‌పోవ‌డంపై అసంతృప్తిగా ఉన్న సుచ‌రిత టీడీపీ వైపు చూస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డికి ఏపీ సీఎం జ‌గ‌న్ ముఖాముఖి అపాయిట్మెంట్ ఇచ్చారు. బుజ్జ‌గించి పంప‌డంతో పాటు ఈసారి అధికారంలోకి రాగానే మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌నే హామీ పొందిన‌ట్టు ఆయ‌న మీడియాకు చెప్పారు. మంత్రి ప‌ద‌విని ఆశించి భంగ‌ప‌డ్డ పిన్నెల్లి లక్ష్మారెడ్డికి సీఎ ఆఫీస్ నుంచి పిలుపు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న‌తో నేరుగా జ‌గ‌న్ మాట్లాడ‌తార‌ని స‌మాచారం. కానీ, మంత్రి ప‌ద‌వులు రాకుండా అసంతృప్తిగా ఉన్న వాళ్ల జాబితాలో కోటంరెడ్డి శ్రీథ‌ర్‌రెడ్డి , ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, ధ‌ర్మ‌శ్రీ త‌దిత‌రులు ఉన్నారు. వాళ్ల‌లో ఎవ‌రినీ సీఎం జ‌గ‌న్ పిలిపించే అవ‌కాశం లేదని తెలుస్తోంది.

మాజీ హోం మంత్రి మేకతోటి సుచరి ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కేబినెట్లో ఎస్సీ మంత్రులందరినీ కొనసాగించి తనపై వేటు వేయడంపై సుచరిత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆమెను బుజ్జగించేందుకు ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆమె ఇంటికి వెళ్లగా.. తన రాజీనామా లేఖను ఆయన చేతిలో పెట్టారట. సుచరిత రాజీనామా విషయాన్ని ఆమె కుమార్తె రిషిత కూడా స్పష్టం చేశారు. తన తల్లి ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేశారని పార్టీకి కాదని తెలిపారు. సుచరితను కలిసేందుకు వచ్చిన మోపిదేవిని కూడా సుచరిత అనుచరులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. సీఎం జగన్ కు, సజ్జలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాదు పార్టీలో రెడ్లకో న్యాయం ,ఎస్సీలకో న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు. బాలినేని ఇంటికి సజ్జల వెళ్లి బుజ్జగించారని, కానీ సుచరితను మాత్రం పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్ర‌మంలో మేక‌తోటి సుచ‌రిత త్వ‌ర‌లో టీడీపీ గూటికి చేర‌నున్నారా అంటే ఔననే కొన్ని సంకేతాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఇవ‌న్నీ ఊహాగానాలే కావొచ్చు. స్పీక‌ర్ ఫార్మెట్ లో రాజీనామా చేసిన ఆమె ఇక‌పై త‌న నిర్ణ‌యాన్ని పునః స‌మీక్ష చేసుకుంటారా లేదా అన్న‌ది సందేహాస్ప‌దంగానే ఉంది. అంతే సీరియ‌స్ గా సీఎం జ‌గ‌న్ కూడా ఆమె ప‌ట్ల ఆగ్ర‌హంగా ఉన్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతానికి పార్టీలో కొన‌సాగినా భ‌విష్య‌త్ లో ఆమె పార్టీలోనే ఉంటార‌నే గ్యారంటీ ఏమీ లేదు. జ‌గ‌న్ కూడా ఆమెతో మాట్లాడేందుకు పెద్ద‌గా సుముఖ‌త వ్య‌క్తం చేయ‌డం లేదు. ఎందుక‌నో ఆమె విష‌య‌మై అధిష్టానం అంత శ్ర‌ద్ధ వ‌హించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఆమె టీడీపీ గూటికి చేరే అవ‌కాశాలు అన్న‌వి కేవ‌లం ఊహాగానాలే కావొచ్చు.

మ‌రో అసంతృప్త నేత బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి (జ‌గ‌న్ బంధువు) ష‌ర్మిల‌తో ట‌చ్ లో ఉన్నార‌ని టాక్. త్వ‌ర‌లోనే ష‌ర్మిల ఆంధ్రా రాజ‌కీయాల్లో అడుగు పెడుతున్న దృష్ట్యా వైసీపీ అసంతృప్త వాదులంతా ఆమె గూటికి చేరిపోవ‌డం ఖాయ‌మ‌ని ఓ ప్రాథ‌మిక స‌మాచారం. అదే క‌నుక జ‌రిగితే బాలినేనితో స‌హా చాలా మంది వైసీపీని వీడి త‌మ స‌త్తా చాటేందుకు ష‌ర్మిల పెట్ట‌బోయే పార్టీలో చేర‌డం ఖాయం. ఎందుకంటే ష‌ర్మిల కూడా ఎప్ప‌టి నుంచో జ‌గ‌న్ ను వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్నారు. రేపేమాపో విజ‌యమ్మ వైసీపీ గౌర‌వాధ్య‌క్ష‌రాలి ప‌ద‌వి రాజీనామా చేస్తార‌నే టాక్ ఉంది. ఆమె కూడా ష‌ర్మిల‌నే ప్రోత్సహిస్తున్నారు. ఈ త‌రుణంలో వైసీపీలో చీలిక‌లు వ‌స్తే జ‌గ‌న్ కు ముందున్న కాలంలో అధికారం ద‌క్క‌డం మాట అటుంచితే పార్టీపై ప‌ట్టు నిలుపుకోవడ‌మే క‌ష్ట‌త‌రం అవుతుంది. మ‌రోవైపు విప‌క్ష పార్టీలు కొన్ని ఇదే అదునుగా తీసుకుని ష‌ర్మిల‌ను ఇటుగా రావాల‌ని ప్రోత్స‌హిస్తున్నాయ‌ని కూడా తెలుస్తోంది. ఒక‌వేళ అటువంటి ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లీకృతం అయితే బాలినేని లాంటి సీనియ‌ర్లే కాదు సామినేని ఉద‌య‌భాను లాంటి లీడ‌ర్లు కూడా ష‌ర్మిల గూటికి చేరే అవ‌కాశాలు లేక‌పోలేదు.