Site icon HashtagU Telugu

AP Results 2024: జగన్ సన్నిహితుడు కొడాలి నాని భారీ ఓటమి

Ap Results 2024

Ap Results 2024

AP Results 2024: 20 ఏళ్లలో కొడాలి నాని తొలిసారి ఓటమి పాలయ్యారు. వరుసగా నాలుగు సార్లు గెలిచి ఐదోసారి కొడాలి నాని ఓటమి పాలవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. 2004లో కొడాలి నాని తొలిసారి గుడివాడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వరుసగా మరో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి రెండుసార్లు టీడీపీ నుంచి గెలిచిన కొడాలి నాని, వైఎస్సార్సీపీ నుంచి మరో రెండు సార్లు వరుసగా గెలిచారు. జగన్ కు సన్నిహితుడుగా ఉంటూ జగన్ కేబినెట్లో మంత్రిగా పని చేశారు.

టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో కొడలి నాని 51 వేల ఓట్ల భారీ తేడాతో ఓటమిపాలయ్యారు.అయితే ఈ ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలోనే ఆయనకు ఎదురు గాలి వీచింది. దీనికి కారణం నాని వ్యవహార శైలి జనాలకు నచ్చకపోవడం. ప్రత్యర్థి పార్టీలపై ఆయన దూకుడు తన, వ్యక్తిగత విషయాలపై మాట్లాడటం ఆయనపై అసంతృప్తి పెరగడానికి కారణం.

Also Read: Lok Sabha Results 2024: మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ ఘన విజయం