జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ నేతలను చెప్పుతో కొడతానంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనిపై వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని కౌంటరిచ్చారు. మీడియాతో మాట్లాడిన నాని…పవన్ కు ఆత్మాభిమానం ముఖ్యం కాదు..ప్యాకేజీనే ముఖ్యం అంటూ సెటైర్ వేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును ఊడిగం చేసేందుకే జనసేనను ఏర్పాటు చేశారన్నారు.
పవన్ చెప్పును జాగ్రత్తగా కాపాడుకో. వచ్చే ఎన్నికల్లో కౌంటింగ్ రోజు అదే చెప్పుతో నువ్వు కొట్టుకోవాలి. ఆ స్థితికి కారణమైన చంద్రబాబును కూడా అదే చెప్పుతో కొట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు నాని. సిగ్గు శరం లేకుండా కన్నతల్లిని తిట్టిన వారితోనే పవన్ కలిసి నడుస్తున్నాడంటూ నాని మండిపడ్డారు. డైలాగులు పక్కన పెట్టి మంచి మార్గంలో వెళ్లడం నేర్చుకో అంటూ చురకలంటించారు.