YSRCP Navarathnalu : న‌వ‌ర‌త్నాలతో `ఎస్సీ, ఎస్టీ` ప‌థ‌కాల క‌ట్‌

ఏపీ సీఎం జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాల‌ను అమ‌లు చేస్తున్నారు. ఆ కార‌ణంగా ఏపీ రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయింద‌ని స‌ర్వ‌త్రా భావిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - May 26, 2022 / 12:31 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాల‌ను అమ‌లు చేస్తున్నారు. ఆ కార‌ణంగా ఏపీ రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయింద‌ని స‌ర్వ‌త్రా భావిస్తున్నారు. కానీ, ఎస్సీ, ఎస్టీల‌కు గ‌తంలో ఉన్న ప‌లు ప‌థ‌కాల‌ను ఆయ‌న ర‌ద్దు చేశారు. వాటి స్థానంలో న‌వ‌ర‌త్నాల‌ను అందిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల‌కు ఉన్న ప‌థ‌కాల రూపంలో గ‌త ప్ర‌భుత్వాల‌ను అందించిన ల‌బ్ది కంటే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి న‌వ‌ర‌త్నాల రూపంలో అందిస్తోన్న న‌గ‌దు మోతాదు త‌క్కువ‌నే విష‌యం ఆల‌స్యంగా వెలుగుచూస్తోంది. సంక్షేమ మాటును రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బ‌తీస్తున్నార‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద విమ‌ర్శ‌లు అనేకం. కానీ, సంక్షేమ ప‌థ‌కాల ఎస్సీ, ఎస్టీల‌కు గ‌తంలో ఉండే ప‌థ‌కాల‌ను ఒక‌సారి గుర్తు చేసుకుంటే, ఆయా ప‌థ‌కాల ద్వారా ల‌బ్ది పొంద‌ని మొత్తం ప్ర‌స్తుతం జ‌గ‌న్ స‌ర్కార్ అందిస్తోన్న స్కీమ్ ల కంటే ఎక్కువ‌గా ఉంటుంద‌నే విష‌యం బోధ‌ప‌డుతోంది. ఉదాహ‌ర‌ణ‌గా ఎస్సీ,ఎస్టీల‌కు ర‌ద్దు చేసిన ప‌థ‌కాల వివ‌రాలివి.

1. వేల కోట్ల సబ్ నిధులు దారిమళ్లింపు
2. ఎస్సీ ,ఎస్టీ కార్పొరేషన్ల బ్యాంకు లింక్ లోన్లు రద్దు.
3. భూమి కొనుగోలు పథకం (ల్యాండ్ పర్చేజింగ్ స్కీము) రద్దు
4. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు
5. కులాంతర వివాహాల ప్రోత్సాహం రద్దు
6. నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSKFDC) ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కేంద్ర ప్రాయోజిత పథకాలు నిలిపివేయడం.
7. అంబేద్కర్ విదేశీ విద్యా స్కీమ్ రద్దు.
8. ఉద్యోగుల స్టడీ లీవ్ పూర్వస్థితిని మార్చివేయడం
9. ఏపీ స్టడీ సర్కిల్స్, అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ రద్దు
10. బుక్ బ్యాంక్ స్కీమ్ రద్దు.
11. ఇళ్ల స్థలాలు ఇచ్చే క్రమంలో 34 లక్షల ఇళ్ల కోసం 11,000 ఎకరాల అసైన్డ్ భూములు స్వాధీనం చేసుకోవడం.
12. ప్రధాన్ మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన (పిఎమ్‌జివై): ఎస్సీ జనాభా 50% ఉన్న షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) మెజారిటీ గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం కేటాయించిన కేంద్ర ప్రాయోజిత పథకం ‘ప్రధాన్ మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన’ (పిఎంజి) నిధులు దారి మళ్లించారు.
13. స్టాండప్ ఇండియా ద్వారా ఎస్సీ ఎస్టీలకు రుణాలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చెయ్యడం లేదు.
14. ఎస్సీ నియోజకవర్గాలకు కేంద్ర బిందువుగా ఉండి ఎస్సీ నియోజక వర్గాలలో నిర్మించబడుతున్న అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయడంతో దళితుల భవిష్యత్తును నాశనం చేశారు.
15. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా కన్వీనర్ కోటా మినహాయించి మిగతా ఏ కోటాలో చేరిన ఉపకార వేతనాలు ఉండవని జి.ఓ.నం 77 ఇచ్చి విద్యార్ధులను మోసం చేశారు
16. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం..
17. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలుకు నిరాకరణ
18. ఎస్సీ, ఎస్టీలకు కారుణ్య నియామకాలను భర్తీ చేయడం లేదు.
19. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలు విషయంలో సుప్రీం కోర్టు తీర్పు అనుసరించి 41 సి.ఆర్.పి.సి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇంతవరకు ఉత్తర్వులు జారీచేయలేదు. అందువలన నిందితులు స్టేషన్ బెయిల్ పొందుతున్నారు.
20. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు 60 కార్పోరేషన్లు ఏర్పాటు చేసి కనీసం ఒక్క లోను కూడా మంజూరు చేయకపోవడం
21. ఎస్సీ కమీషన్ కు రిటైర్డ్ న్యాయమూర్తిని ప్రకటించకపోవడం
22. ఎస్సీ, ఎస్టీ, పిల్లలకు విద్యను దూరం చేయడానికే సర్క్యులర్ 172 జారీచేయడం
23. మెడికల్ సీట్ల భర్తీలో B, C క్యాటగిరీల సీట్లకు రిజర్వేషన్లు వర్తింప చేయకపోవడం.
24. నూనత పారిశ్రామిక విధానం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు రుణాలు మంజూరు చేయకపోవడం
25. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ స్కీము రద్దు మెమో నెం. 1214 తేది. 10-03-2020
26. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ స్కీం ను రద్దు చేస్తూ మెమో నెం. 1214 తేది 10-03-2020 ను విడుదల చేయడం.
27. ప్రభుత్వ కార్యాలయాల్లో, వైద్యశాలల్లో విద్యాలయాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, శానిటరీ వర్కర్స్ కు అధికారంలోకి వచ్చిన నాటి నుండి జీతాలు చెల్లించకపోవడం.
28. ఇళ్ల నిర్మాణంలో అదనపు సహాయంగా ఇచ్చే రూ. 50,000 నగదును నిలిపివేయడం
29. పథకాల అమలులో ప్రాధాన్యతలు నిలిపివేయడం

ఇలా ఎస్సీ, ఎస్టీల‌కు సుమారు 29 ర‌కాల ప‌థ‌కాల‌ను నిలిపివేయ‌డం, ప్రాధాన్య‌త‌ల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మార్చారు. న‌వ‌ర‌త్నాల రూపంలో ఇస్తోన్న న‌గ‌దు ప్ర‌స్తుతం ల‌బ్దిదారుల‌కు అందుతోంది. గ‌తంలో వ‌స్తువు రూపంలో అందే ప‌థ‌కాల‌ను న‌గదు కింద‌కు మార్చారు. కొన్నింటిని పూర్తిగా ర‌ద్దు చేసిన విష‌యాన్ని ఎస్సీ, ఎస్టీల లీడ‌ర్లు చెబుతున్నారు.