Site icon HashtagU Telugu

Minister Roja : పార్లమెంటు ఎన్నికల బరిలోకి రోజా.. నగరి నుంచి ఔట్ ?

Minister Roja

Minister Roja

Minister Roja :  అసెంబ్లీ టికెట్ విషయంలో మాజీ మంత్రి రోజాకు  వైఎస్సార్ సీపీ మొండిచెయ్యి ఇవ్వనుందని తెలుస్తోంది.  నగరి అసెంబ్లీ స్థానంలో సొంత పార్టీ నుంచే ఆమెకు వ్యతిరేకత ఎదురవుతోంది. దీంతో రోజాను నగరి నుంచి  కాకుండా.. ఒక పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దింపాలని జగన్ యోచిస్తున్నారట. వైసీపీ ఫైర్ బ్రాండ్ గా ఉన్న రోజా పేరును ఒంగోలు పార్లమెంట్ స్థానానికి పరిశీలిస్తున్నారట. రోజా అభ్యర్దిత్వంపైన ఆ జిల్లా నేతలతో పార్టీ సమన్వయకర్త విజయసాయిరెడ్డి చర్చించారు. ఒంగోలు పార్లమెంట్ స్థానానికి ఒక దశలో చెవిరెడ్డి భాస్కర రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అయినా  దీనిపై ఆ జిల్లా నేతల నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో ప్రత్యామ్నాయ నేత కోసం వైఎస్సార్ సీపీ నేతలు అన్వేషించారు. ఈ సమయంలోనే మంత్రి రోజా(Minister Roja) పేరు తెరపైకి వచ్చింది.అందరి నుంచి సానుకూలత కనిపించటంతో రోజాను ఒంగోలు ఎంపీగా బరిలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. .

We’re now on WhatsApp. Click to Join.

నర్సరావుపేట నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఒంగోలు నుంచి మంత్రి రోజా పేర్ల ఖరారుపైన సోమవారం సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఇక రోజాను నగరి నుంచి మారిస్తే అక్కడి నుంచి ఎవరికి సీటు ఇవ్వాలనే అంశంపైనా వైసీపీలో డిస్కషన్ మొదలైంది. ప్రధానంగా ఇద్దరి పేర్లు వినవస్తున్నాయి. నగరి సహా పలు స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్దుల జాబితాపై ఒకటి, రెండు రోజుల్లో పూర్తి స్పష్టత వస్తుందని తెలుస్తోంది.  ఒకవేళ ఒంగోలు లోక్‌సభ సీటు మాగుంటకే కేటాయిస్తే.. రోజాను మునుపటిలా నగరి నుంచే బరిలోకి దించే అవకాశం లేకపోలేదు. ఇక జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని రోజా స్పష్టం చేశారు.

Also Read :UN Funds Pause : హమాస్ దాడికి యూఎన్ సంస్థ సాయం ? నిధులు నిలిపేసిన మూడు దేశాలు

సీఎం జగన్ ఇప్పటికే ఎన్నికల సమరశంఖం పూరించారు. అభ్యర్దుల ఎంపికలో అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు దాదాపు 60 మంది అభ్యర్దుల స్థానాలను మార్చిన సీఎం జగన్..తుది జాబితాపైనా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎంపీల జాబితా దాదాపు సిద్దమైంది. మాజీ మంత్రి రోజా పైన నగరిలో సొంత పార్టీ నుంచే వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో నగరి నుంచి రోజాను మార్చి పార్లమెంట్ బరిలోకి నిలపాలని నిర్ణయించినట్లు సమాచారం.