YSRCP: అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన వైఎస్‌ఆర్‌సిపి

  YSRCP: అనకాపల్లి( Anakapalli)లోక్‌సభ స్థానానికి( Lok Sabha seat)అభ్యర్థి పేరు(Candidate Name)ను వైఎస్‌ఆర్‌సిపి(YSRCP) ప్రకటించింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడి(Budi Mutyala Naidu)ని బరిలో నిలుతున్నట్లు పేర్కొంది. ఇప్పటికే 175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన వైఎస్‌ఆర్‌సిపి.. అనకాపల్లి ఎంపీ సీటు ఒక్కదానినే పెండింగ్‌లో ఉంచింది. బీసీ అభ్యర్థికే ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. అభ్యర్థిని తాజాగా ప్రకటించారు. బూడి ముత్యాల నాయుడు కొప్పుల వెలమ సామాజిక వర్గం. ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా […]

Published By: HashtagU Telugu Desk
Ysrcp Announced Anakapalli

YSRCP announced Anakapalli MP candidate

 

YSRCP: అనకాపల్లి( Anakapalli)లోక్‌సభ స్థానానికి( Lok Sabha seat)అభ్యర్థి పేరు(Candidate Name)ను వైఎస్‌ఆర్‌సిపి(YSRCP) ప్రకటించింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడి(Budi Mutyala Naidu)ని బరిలో నిలుతున్నట్లు పేర్కొంది. ఇప్పటికే 175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన వైఎస్‌ఆర్‌సిపి.. అనకాపల్లి ఎంపీ సీటు ఒక్కదానినే పెండింగ్‌లో ఉంచింది. బీసీ అభ్యర్థికే ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. అభ్యర్థిని తాజాగా ప్రకటించారు. బూడి ముత్యాల నాయుడు కొప్పుల వెలమ సామాజిక వర్గం. ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు సిట్టింగ్ స్థానంలోనే ఎమ్మెల్యే టిక్కెట్ ఖరారు చేశారు. అయితే ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో మాడుగుల స్థానానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ముత్యాలనాయుడు కుమార్తె ఈర్లి అనురాధను ఎంపిక చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

అనకాపల్లి ఎంపీ స్థానికి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా గత ఎన్నికల్లో డాక్టర్‌ బీవీ సత్యవతి విజయం సాధించారు. ఇటు సామాజికంగా, అటు ఆర్థికంగా బలమైన ఎలమంచిలి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పి.రమాకుమారి పేరును మొదట హైకమాండ్ పరిశీలించింది. అయితే పొత్తులో భాగంగా అనకాపల్లి నుంచి బీజేపీ పోటీ చేస్తుందని కూటమి పార్టీలు ప్రకటించడంతో వైఎస్‌ఆర్‌సిపి అధి ష్ఠానం ఇక్కడ ఒక్కచోట మాత్రమే అభ్యర్థిని ప్రకటించలేదు. బీజేపీ అభ్యర్థిని బట్టి తమ అభ్యర్థిని నిర్ణయంచాలని అనుకున్నారు. తాజాగా బీజేపీ విడుదల చేసిన జాబితాలో సీఎం రమేశ్‌ పేరును ఖరారు చేశారు.

Read Also: AP Election Campaign : ఏపీలో అసలు సిసలైన రాజకీయం మొదలుకాబోతుంది..

దీంతో అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ఎంపీగా బరిలోకి దింపే ఆలో చనలో వైఎస్‌ఆర్‌సిపి పెద్దలు వున్నట్టు సమాచారం. వైఎస్‌ఆర్‌సిపి సీనియర్‌ నేత, ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుని ఎంపీగా పోటీ చేయించాలని చివరికి నిర్ణయించారు మంత్రి కుమార్తె, కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధను మాడుగుల ఎమ్మె ల్యే అభ్యర్థిగా పోటీకి అవకాసం ఇవ్వడంతో ఆయన అంగీకరించారు. అనకాపల్లి ఎంపీ స్థానంలో వెలమ వర్గానికి మంచి ఓటు బ్యాంక్ ఉంది. ఈ కారణంగా సీఎం రమేష్ కడపకు చెందిన నేత అయినా అనకాపల్లిలో పోటీకి ఆసక్తి చూపించారు. కొప్పుల వెలమ వర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడును రంగంలోకి దింపడంతో.. ఆసక్తికర పోరు సాగుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

 

  Last Updated: 26 Mar 2024, 04:43 PM IST