Somireddy : మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై హత్యాయత్నం..

మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మనుషులు తనపై హత్యాయత్నం చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనపై గడ్డపారతో కాకాణి మనుషులు అటాక్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు సోమిరెడ్డి. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధమే కాదు కర్రల యుద్ధం కూడా మొదలైంది. చాల ప్రాంతాలలో వైసీపీ – టిడిపి పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షలు జరుగుతున్నాయి. ఈ […]

Published By: HashtagU Telugu Desk
Ycp Atack Somireddy

Ycp Atack Somireddy

మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మనుషులు తనపై హత్యాయత్నం చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనపై గడ్డపారతో కాకాణి మనుషులు అటాక్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు సోమిరెడ్డి. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధమే కాదు కర్రల యుద్ధం కూడా మొదలైంది. చాల ప్రాంతాలలో వైసీపీ – టిడిపి పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (TDP Somireddy Chandramohan Reddy)పై హత్యాయత్నం జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

మంగళవారం నెల్లూరు జిల్లా మనుగోలు మండల పరిధిలోని కట్టుపల్లిలో ‘బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమంలో సోమిరెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సోమిరెడ్డిని అంతమొందించేందుకు అప్పటికే అక్కడ వైసీపీ చెందిన కొందరు కాపు కాశారు. అనంతరం సోమిరెడ్డి సభా వేదికపైకి వస్తుండగానే వైసీపీకి చెందిన నాయకుడు వెంకటయ్య గడ్డపారతో సొమిరెడ్డిని పొడిచేందుకు దూసుకొచ్చాడు. ఈ క్రమంలో అప్రమత్తమైన సోమిరెడ్డి, అతడి అనుచరులు దాడికి పాల్పడిన వెంకటయ్యను అడ్డుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అయితే మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మనుషులు తనపై హత్యాయత్నం చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనపై గడ్డపారతో కాకాణి మనుషులు అటాక్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read Also : Bandla Ganesh : రోజా..పులుసు పాప అంటూ మరోసారి రెచ్చిపోయిన బండ్ల గణేష్

  Last Updated: 27 Feb 2024, 01:49 PM IST