YSRCP 2nd List : ఇప్పటికే 11 చోట్ల మార్పులతో తొలి జాబితా విడుదల చేసిన వైఎస్సార్ సీపీ.. ఇప్పుడు మరిన్ని మార్పులతో రెండో జాబితాను రిలీజ్ చేసింది. 27 మంది ఇంఛార్జులతో సెకండ్ లిస్ట్‌ను విడుదల చేసింది. 27 మంది వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులకు సంబంధించిన రెండో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీకి 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఈ మార్పులు, చేర్పులు చేసినట్లు ఆయన వెల్లడించారు. జగన్ మోహన్ రెడ్డి ఆలోచన మేరకు ఇప్పటికే 11 స్థానాల్లో మార్పులు చేర్పులు చేశామన్నారు. ఇప్పుడు 27 మందితో మరో జాబితాను(YSRCP 2nd List) సిద్ధం చేశామని చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
రెండో జాబితా ఇదీ..
- అనంతపురం – మాలగుండ్ల శంకరనారాయణ
- హిందూపురం – జోలదరాశి శాంత
- అరకు (ఎస్టీ)- కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి
- రాజాం(ఎస్సీ)- తాలె రాజేశ్
- అనకాపల్లి- మలసాల భరత్ కుమార్
- పాయకరావుపేట(ఎస్సీ)- కంబాల జోగులు
- రామచంద్రాపురం- పిల్లి సూర్యప్రకాష్
- పి.గన్నవరం(ఎస్సీ)- విప్పర్తి వేణుగోపాల్
- పిఠాపురం- వంగ గీత
- జగ్గంపేట- తోట నరసింహం
- ప్రత్తిపాడు- వరుపుల సుబ్బారావు
- రాజమహేంద్రవరం సిటీ – మార్గాని భరత్
- రాజమహేంద్రవరం రూరల్- చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
- పోలవరం(ఎస్టీ)- తెల్లం రాజ్యలక్ష్మి
- కదిరి- బి.ఎస్. మక్బూల్ అహ్మద్
- ఎర్రగొండపాలెం(ఎస్సీ)- తాటిపర్తి చంద్రశేఖర్
- ఎమ్మిగనూరు – మాచాని వెంకటేష్
- తిరుపతి – భూమన అభినయ్ రెడ్డి
- గుంటూరు తూర్పు- షేక్ నూరి ఫాతిమా
- మచిలీపట్నం – పేర్ని కృష్ణమూర్తి
- చంద్రగిరి- చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
- పెనుకొండ- కె.వి. ఉషా శ్రీచరణ్
- కల్యాణదుర్గం- తలారి రంగయ్య
- అరకు(ఎస్టీ)- గొడ్డేటి మాధవి
- పాడేరు(ఎస్టీ)- మత్స్యరాస విశ్వేశ్వర రాజు
- విజయవాడ సెంట్రల్- వెల్లంపల్లి శ్రీనివాస రావు
- విజయవాడ పశ్చిమం- షేక్ ఆసిఫ్