Badvel Results : బ‌ద్వేల్లో వైసీపీ అభ్య‌ర్థికి 90వేల మెజార్టీ

బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ సుధ 90వేల మోజార్టీతో గెలుపొందారు. తొలి రౌండ్ నుంచి ఆధిక్యం సాధించిన ఆమెకు ప్ర‌త్య‌ర్థిగా బీజేపీ అభ్య‌ర్థి సురేష్ నిలిచాడు.

  • Written By:
  • Updated On - November 3, 2021 / 12:19 AM IST

బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ సుధ 90వేల మోజార్టీతో గెలుపొందారు. తొలి రౌండ్ నుంచి ఆధిక్యం సాధించిన ఆమెకు ప్ర‌త్య‌ర్థిగా బీజేపీ అభ్య‌ర్థి సురేష్ నిలిచాడు. 2019 సాధార‌ణ ఎన్నిక‌ల్లో 40వేల ఓట్లతో వైసీపీ నుంచి వెంక‌ట‌సుబ‌య్య గెలుపొందారు. ఇప్పుడు ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేసిన సుధ 90వేల ఓట్ల మోజార్టీతో గెలుపొంద‌డం ఏపీలో వైసీపీ హ‌వాను తెలియ‌చేస్తోంది.

బీజేపీ అభ్య‌ర్థి 2019 ఎన్నిక‌ల్లో బ‌ద్వేల్ నుంచి కేవ‌లం 700 కోట్ల‌ను మాత్ర‌మే సాధించ‌గ‌లిగారు. ఇప్పుడు బీజేపీ అభ్య‌ర్థి సురేష్ 21వేల ఓట్ల‌కు పైగా పొందాడు. ఈ ఎన్నిక‌ల‌కు టీడీపీ, జ‌న‌సేన దూరంగా ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే మ‌ర‌ణించ‌డంతో ఆయ‌న కుటుంబం నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా సుధ‌కు టిక్కెట్ ఇవ్వ‌డం జ‌రిగింది. అందుకే సెంటిమెంట్ సంప్ర‌దాయం ప్ర‌కారం టీడీపీ, జ‌న‌సేన పోటీకి దూరంగా ఉన్నాయి. బ‌ద్వేల్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ జిల్లాలోని నియోజ‌క‌వ‌ర్గం. అక్క‌డ నుంచి వైఎస్ కుటుంబం నిలిపిన అభ్య‌ర్థికి అక్క‌డి ఓట‌ర్లు ఎప్పుడూ ప‌ట్టం క‌డ‌తారు. ఈసారి భారీగా మోజార్టీ ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీకి రావ‌డం గ‌మ‌నార్హం. బీజేపీ అక్క‌డ పుంజుకుంద‌ని ఆ పార్టీ భావిస్తోంది.