Site icon HashtagU Telugu

వాహన మిత్ర పథకం.. దరఖాస్తు చేస్తే వచ్చే నెలలోనే రూ.10 వేలు!

Sachis 0

Sachis 0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే రైతుల కోసం,మహిళల కోసం, విద్యార్థుల కోసం, ప్రజల కోసం ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క స్కీం చెప్పు నా ప్రజలకు చాలా రకాల స్కీమ్ లను అందుబాటులోకి తెచ్చింది. అలా ఏపీ సర్దార్ అందిస్తున్న పథకాలలో వాహనమిత్ర పధకం కూడా ఒకటి. ఏమి ప్రభుత్వ వాహన డ్రైవర్లకు 10 వేల ఆర్థిక సహాయం అందిస్తోంది. వాహనం మెయింటెనెన్స్ ఖర్చులు ఇన్సూరెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్ వంటి ఇతర డాక్యుమెంట్లు పొందటానికి ప్రభుత్వం డ్రైవర్లకు ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

ఆటో టాక్సీ మ్యాక్సీ డ్రైవర్లకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఈ స్కీం ద్వారా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు. వాహన మిత్ర పథకం కింద జూలై 13 న ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో 10,000 జమ చేయనుంది. ఈ పథకానికి సంబంధించి సచివాలయం లో జూలై 3వ తేదీ వరకు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఈ పథకం లబ్ధి పొందిన వారు సచివాలయాల్లో జూలై లోగా E-KYC చేయించుకోవాలి. ఒకవేళ వాళ్లకు E-KYC ఆప్షన్ రాకపోతే కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వీటితోపాటుగా జులై 5వ తేదీన జగనన్న విద్యా కానుక జూలై 22న వైయస్సార్ కాపు నేస్తం, అదేవిధంగా జూలై 26న జగనన్న పథకాలు కూడా అమలు అవుతాయి. ఈ వాహన మిత్ర పథకం కు కావాల్సిన అర్హతలు 18 ఏళ్లు పైబడినవారు, ఆంధ్రప్రదేశ్ లో స్థిరనివాసం కలిగి ఉండాలి. అదేవిధంగా రేషన్ కార్డుల్లో కచ్చితంగా పేరు ఉండాలి. ఈ స్కీమ్ పేద కుటుంబాలకు చెందిన వారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ కింద ప్రయోజనం పొందాలి అని భావించే వారికి ఆటో, టాక్సీ కంపల్సరి గా ఉండాల్సిందే.

Exit mobile version