YSR Family Twist : కాంగ్రెస్ లోకి ష‌ర్మిల ? జ‌గ‌న్ ఛాప్ట‌ర్ క్లోజ్ !

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి చెక్ ప‌డింది. కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల విభాగాల్లో ష‌ర్మిల(YSR Family Twist) కీల‌కం కాబోతున్నారు.

  • Written By:
  • Publish Date - June 20, 2023 / 06:05 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి చెక్ ప‌డింది. కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల విభాగాల్లో ష‌ర్మిల(YSR Family Twist) కీల‌కం కాబోతున్నారు. స్టార్ క్యాంపెయిన‌ర్ గా రెండు రాష్ట్రాల్లోనూ ఆమె ప్ర‌చారానికి దిగ‌బోతున్నారు. వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేయడానికి ష‌ర్మిల అంగీక‌రించార‌ని తెలుస్తోది. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్, క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ చేసిన ఆప‌రేష‌న్ ఫ‌లించింద‌ని తెలుస్తోంది. ఒక వేళ ఏపీ పీసీసీ చీఫ్ బాధ్య‌త‌ల‌ను ష‌ర్మిల తీసుకుంటే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజ‌కీయంగా క్లోజ్ అయిన‌ట్టుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. కానీ, తెలంగాణ రాష్ట్రంలోనే ఆమె రాజ‌కీయం జీవితం ఉంటుంద‌ని ఆమె అనుచరులు చెబుతున్నారు.

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి చెక్ (YSR Family Twist) 

స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జ‌యంతి సంద‌ర్భంగా జూలై 8న ఇడుపుల‌పాయ‌కు రాహుల్‌, సోనియా(YSR Family Twist) రాబోతున్నారు. ఆ మేర‌కు షెడ్యూల్ ఫిక్స్ అయిందని ఢిల్లీ వ‌ర్గాల నుంచి అందుతోన్న స‌మాచారం. అదే జ‌రిగితే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కోట‌కు బీట‌లు ప‌డిన‌ట్టేన‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆశ‌యం రాహుల్ ను ప్ర‌ధాన మంత్రిని చేయ‌డం. ఆ విష‌యాన్ని ప‌లు సంద‌ర్భాల్లో ఆయ‌న చెప్పారు. బ‌హిరంగ స‌భ‌ల్లోనూ వినిపించారు. ఇప్పుడు ఆయ‌న ఆశ‌యాన్ని నెర‌వేర్చ‌డానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ త‌ర‌పున ప్ర‌చారానికి ష‌ర్మిల దిగ‌బోతున్నారు.

మ‌తం ప‌రంగా క్రిస్టియ‌న్ కూడా కావ‌డంతో సోనియాతో స‌న్నిహితం

కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ ఫ్యామిలీ రాజ‌కీయంగా ఎదిగింది. ఆ పార్టీ రాజ‌కీయ జీవితాన్ని ఇచ్చింది. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా కాంగ్రెస్ ఎంపీగా పోటీచేసి రికార్డ్ సృష్టించారు. మ‌తం ప‌రంగా క్రిస్టియ‌న్ కూడా కావ‌డంతో సోనియాతో స‌న్నిహితం పెరిగింది. అయితే, హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో రాజ‌శేఖ‌ర్ రెడ్డి దుర్మ‌ర‌ణం పొందిన త‌రువాత సీఎం ప‌ద‌విని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆశించారు. ఆ మేర‌కు ఎమ్మెల్యేల‌తో సంత‌కాల సేక‌ర‌ణ కూడా చేశారు. కానీ, అధిష్టానం స‌సేమిరా అంటూ అడ్డం తిరిగింది. దాంతో ఓదార్పు యాత్రంటూ ప్ర‌జ‌ల్లోకి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెళ్లారు. దాన్ని ఆపేసే ప్ర‌య‌త్నం కాంగ్రెస్ అధిష్టానం చేసింది. ఓదార్పుకు అనుమ‌తించాల‌ని వైఎస్ జ‌గ‌న్, ష‌ర్మిల‌, విజ‌య‌మ్మ ఇత‌ర కుటుంబ స‌భ్యులు సోనియాను కోరారు. ఆమె నుంచి నిరాక‌ర‌ణ ఎదురు కావ‌డంతో పార్టీ నుంచి బ‌య‌ట‌కు వైఎస్ ఫ్యామిలీ (YSR Family Twist)వ‌చ్చేసింది.

జూలై 8న ఇడుపుల‌పాయ‌కు రాహుల్‌, సోనియా

ఓదార్పు యాత్ర‌ను కొన‌సాగిస్తూ కొత్త పార్టీని పెట్టారు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఆ త‌రువాత అక్ర‌మాస్తుల కేసులో జైలుకు వెళ్లారు. ఆ స‌మ‌యంలో ష‌ర్మిల అన్నీతానై జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అండ‌గా ఉన్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పాద‌యాత్ర చేస్తోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కొన‌సాగించారు. ఆయ‌న‌కు తోడుగా ష‌ర్మిల పాద‌యాత్ర‌ను చేశారు. అన్ని ర‌కాలుగా అన్న‌కు అండ‌గా నిలిచిన ఆమెను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రోడ్డు మీద‌కు నెట్టారు. తెలంగాణ కోడ‌లిగా వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీని పెట్టారు. కానీ, తెలంగాణ స‌మాజం నుంచి పెద్ద‌గా సానుకూల‌త రాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయ‌డం ద్వారా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అరాచ‌కాల‌ను అడ్డుకోవాల‌ని యోచిస్తున్నార‌ని ఆమె అనుచ‌రుల అభిప్రాయం.

Also Read : Amanchi Swamulu : చీరాలలో YSRCPకి దెబ్బ.. మాజీ ఎమ్మెల్యే సోదరుడు జనసేనలోకి.. నెలాఖరులో ముహూర్తం..

ఏపీలోని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు దాదాపుగా కాంగ్రెస్ పార్టీది. మ‌తం ప‌రంగా క్రిస్టియ‌న్ ఓట్లు 80శాతం కాంగ్రెస్ పార్టీకి చెందిన‌వే. అయితే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడ‌దీసింద‌ని కోపంతో ఏపీ ప్ర‌జ‌లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపారు. ఫ‌లితంగా కాంగ్రెస్ పార్టీ జీరోకు ప‌డిపోయింది. కానీ, ఇప్పుడు ష‌ర్మిల ద్వారా ఏపీలో కాంగ్రెస్ పార్టీని బ‌తికించుకోవాల‌ని అధిష్టానం భావిస్తోంది. అందుకే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద ష‌ర్మిల ను ప్ర‌యోగిస్తోంది. దీంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఛాప్ట‌ర్ క్లోజ్ (YSR Faily Twist) కానుంద‌ని అప్పుడే ప్ర‌చారం మొద‌లైయింది.

Also Read : CBN-Jagan : చంద్ర‌బాబుపై జ‌గ‌న్ మాన‌సిక దాడి