Site icon HashtagU Telugu

YSR Congress Party: వైసీపీలో పెద్దిరెడ్డికి కీల‌క బాధ్య‌త‌లు.. యాంక‌ర్ శ్యామ‌ల‌కు కీల‌క ప‌ద‌వి..!

YSR Congress Party

YSR Congress Party

YSR Congress Party: ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌లో వైసీపీ (YSR Congress Party) ఘోర ప‌రాజ‌యం పాలైంది. 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీచేస్త కేవలం 11 స్థానాల్లో మాత్ర‌మే విజ‌యం సాధించింది. 25 ఎంపీల్లో కేవ‌లం 4 ఎంపీల‌ను మాత్ర‌మే వైసీపీ గెలిచింది. దీంతో ఏపీలో వైసీపీ అధికారం పోయి కూట‌మి (టీడీపీ+జ‌న‌సేన‌+బీజేపీ) ప్ర‌భుత్వంలోకి వ‌చ్చింది. అయితే ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత వైసీపీలో కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జ‌గన్‌కు స‌న్నిహితులు వైసీపీకి రాజీనామా చేసి కూట‌మి ప్ర‌భుత్వంలోకి దూకేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈక్ర‌మంలోనే ఇప్ప‌టికే చాలా మంది పార్టీకి, ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి వెళ్తున్నారు. ఈ క్ర‌మంలోనే వైసీపీ బాస్ జ‌గ‌న్ కీల‌క మార్పుల‌కు శ్రీకారం చుట్టారు.

తాజాగా సీనియర్‌ నేత, మాజీమంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైఎస్ జ‌గ‌న్ కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా పెద్దిరెడ్డిని నియ‌మిస్తూ వైసీపీ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ బాధ్యతలతో పాటు అదనంగా నాలుగు నియోజకవర్గాలను భర్తీ చేస్తూ తిరుపతి జిల్లా వైస్సార్‌సీపీ అధ్యక్ష బాధ్యతలను కూడా పెద్దిరెడ్డికి జ‌గ‌న్ అప్ప‌గించారు.

Also Read: Adani Group In TIME: ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీల జాబితాలో అదానీ గ్రూప్..!

అంతేకాకుండా వైసీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధులుగా న‌లుగురిని నియ‌మిస్తూ వైసీపీ కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అందులో యాంక‌ర్ శ్యామ‌ల‌కు కూడా చోటు ద‌క్కింది. యాంక‌ర్ శ్యామ‌ల‌ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. శ్యామలతో పాటు భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావు, ఆర్కే రోజాను అధికార ప్రతినిధులుగా ప్రకటిస్తూ తాజాగా వైసీపీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పార్టీలో మున్ముందు ఇంకా పెను మార్పులు జ‌రుగుతాయని చ‌ర్చ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే జ‌గ‌న్ త‌న‌దైన మార్క్‌తో నిర్ణ‌యాలు తీసుకుంటూ అధికార కూట‌మి ప్ర‌భుత్వాన్ని సైతం ఆశ్చ‌ర్యానికి గురిచేసిన విష‌యం తెలిసిందే. అయితే జ‌గ‌న్ లండ‌న్ ప‌ర్య‌ట‌న అనంత‌రం జిల్లాలో పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు స‌మాచారం.