YS Jagan Vs YS Saubhagyamma : వైఎస్ జగన్‌పై వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ పోటీ ?

YS Jagan Vs YS Saubhagyamma : పకడ్బందీ వ్యూహంతోనే వైఎస్ షర్మిలకు ఏపీ పగ్గాలను కాంగ్రెస్ పెద్దలు కట్టబెట్టారని తెలుస్తోంది.

  • Written By:
  • Updated On - January 19, 2024 / 02:54 PM IST

YS Jagan Vs YS Saubhagyamma : పకడ్బందీ వ్యూహంతోనే వైఎస్ షర్మిలకు ఏపీ పగ్గాలను కాంగ్రెస్ పెద్దలు కట్టబెట్టారని తెలుస్తోంది. ఈనెల 21న ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయని ఉమ్మడి కడప జిల్లా కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ప్రత్యేకించి ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న  పులివెందుల అసెంబ్లీ స్థానంలోనూ తొలిసారిగా వైఎస్ కుటుంబం నుంచే కీలకమైన అభ్యర్థి బరిలోకి దిగబోతున్నారని అంటున్నారు.  వైఎస్ జగన్‌పై వైఎస్ వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించనుందని  చెబుతున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి అనుమానాస్పద హత్య తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఏర్పడిన విభేదాలు.. వాటిపై మీడియాలో జరిగిన చర్చను మనమంతా చూశాం.  ఈనేపథ్యంలో వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ పులివెందుల నుంచి పోటీ చేస్తుండటం వైఎస్ జగన్‌కు(YS Jagan Vs YS Saubhagyamma) షాకిచ్చే విషయమేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు సౌభాగ్యమ్మను ఒప్పించే బాధ్యతను ఏపీ కాంగ్రెస్ చీఫ్ కాబోతున్న షర్మిల తీసుకున్నారని తెలుస్తోంది.  ఇక కడప ఎంపీ స్థానం నుంచి స్వయంగా షర్మిల పోటీ చేయనున్నారని సమాచారం. అదే జరిగితే ఏ ఎంపీ స్థానం కోసమైతే వైఎస్ కుటుంబంలో ఆనాడు విభేదాలు తలెత్తయో.. అదే ఎంపీ స్థానం నుంచి షర్మిల పోటీ చేయనుండటం పెను సంచలనం క్రియేట్ చేస్తుంది.  వివేకానంద రెడ్డి హత్యతో ఏర్పడిన సానుభూతి పవనాల వల్ల సౌభాగ్యమ్మకు పులివెందులలో భారీగానే ఓట్లు పడొచ్చని కాంగ్రెస్ పెద్దలు అంచనా వేస్తున్నారు. పులివెందులలోని కాపు ఓటు బ్యాంకు కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు. కడప ఎంపీ స్థానం నుంచి షర్మిల, పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి వివేకానంద రెడ్డి భార్య పోటీ చేసే అంశంపై ఇంకో వారంలోగా  అనౌన్స్‌మెంట్ వెలువడే ఛాన్స్ ఉందట.షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు 25 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు ఎంపీలు హస్తం పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లుగా ఉన్న లగడపాటి రాజగోపాల్ రెడ్డి, శైలజానాథ్, రఘువీరారెడ్డి వంటి నేతలను కూడా కాంగ్రెస్ పార్టీ మళ్లీ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. జనసేన, బీజేపీ నుంచి కూడా పలువురు కీలక నేతలు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం.

Also Read: Judges Invited : ఆ ఐదుగురు జడ్జీలకు రామమందిర ఆహ్వానం.. ఎవరు ?