Site icon HashtagU Telugu

YS Viveka Wife Sowbhagyamma : జగన్ కు వరుస ప్రశ్నలు సంధిస్తూ నిలదీసిన వివేకా భార్య సౌభాగ్యమ్మ

Ys Vivekananda Reddy Wife S

Ys Vivekananda Reddy Wife S

ఏపీలో ఎన్నికల (AP Elections) వేడి కాకరేపుతున్న సంగతి తెలిసిందే. జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా వైస్ వివేకా హత్య (YS Vivekananda Reddy Murder) గురించి పదే పదే ప్రస్తావిస్తూ..జగన్ ను టార్గెట్ చేస్తూ వస్తుంది ఏపీ కాంగ్రెస్ చీఫ్ , వైస్ షర్మిల. బాబాయ్ ని చంపిన వ్యక్తులను జగన్ రక్షిస్తూ వస్తున్నాడని షర్మిల , సునీత ఆరోపిస్తూ వస్తున్నారు. తాజాగా వివేకా భార్య సౌభాగ్యమ్మ (YS Vivekananda Reddy Wife Sowbhagyamma) తాజాగా జగన్ కు బహిరంగ లేఖ (Letter) రాసింది.

We’re now on WhatsApp. Click to Join.

2009 లో నువ్వు మీ తండ్రిని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదన అనుభవించావో, 2019 లో తన తండ్రి చనిపోతే నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన అనుభవించిందని సౌభాగ్యమ్మ లేఖలో పేర్కొంది. మన కుటుబంలోనీ వారే హత్యకు కారణం కావడం, హత్యకు కారణం ఆయిన వాళ్లకు నువ్వు రక్షణం గా ఉండటం సరికాదన్నారు. నిన్ను సీఎం గా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్నను ఈవిధంగా చేయడం, నీ పత్రిక, నీ టీవీ చానెల్, నీ సోషల్ మీడియా, నీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో మాట్లాడటం, చెప్పలేనంత విధంగా హననం చేయించడం తగునా అని సౌభాగ్యమ్మ ప్రశ్నించారు.

న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెళ్ళను హేళన చేస్తూ, నిందలు మోపుతూ,దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే, నీకు మాత్రం పట్టడం లేదా అని నిలదీశారు. సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిల ను కూడా టార్గెట్ చేస్తుంటే, నీవు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఏంటి అని ప్రశ్నించింది. కుటుంబ సభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇదేనా నీ కర్తవ్యం అని ప్రశ్నించారు. ఇంకా బాధించే అంశం..హత్యకు కారకులైన ఆయిన వారికి మరలా ఎంపీగా అవకాశాన్ని నీవు కల్పించడం…ఇది సమంజసమా అని సౌభాగ్యమ్మ ప్రశ్నించింది. ఇటువంటి దుశ్చర్యలు నీకు ఏ మాత్రం మంచిది కాదని’ హెచ్చరించింది. ప్రస్తుతం సౌభాగ్యమ్మ రాసిన లేఖ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది.

Read Also : Anupama Parameswaran: రెడ్ కలర్ శారీలో మతి పోగొడుతున్న అనుపమ పరమేశ్వరన్