YS Viveka Case : వివేక హ‌త్య‌లో జ‌గ‌మంత‌ కుటుంబం?

మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసును సీబీఐ ఛాలెంజ్ గా తీసుకుంది. లాజిక‌ల్ కంక్లూష‌న్ కు వ‌చ్చేసింది.

  • Written By:
  • Publish Date - March 3, 2022 / 03:52 PM IST

మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసును సీబీఐ ఛాలెంజ్ గా తీసుకుంది. లాజిక‌ల్ కంక్లూష‌న్ కు వ‌చ్చేసింది. మొత్తం ఏపీ సీఎం జ‌గ‌న్ కుటుంబం చుట్టూ ఆ హ‌త్య కేసు తిరుగుతోంది. చార్జిషీట్ ప్ర‌కారం ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్క‌ర రెడ్డి, మ‌నోహ‌ర్ రెడ్డి ఆధారాల‌ను చెరిపేశారు. సంఘ‌ట‌న గురించి పోలీసుల‌కు రాఘ‌వ‌రెడ్డి ఫోన్ చేశాడు. హుటాహుటిన వెళ్లిన పోలీసుల‌కు అక్క‌డ అవినాష్ రెడ్డి, మ‌నోహ‌ర్ రెడ్డి, గంగిరెడ్డి, శంక‌ర్ రెడ్డి, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, ఉమాశంక‌ర్ రెడ్డి క‌నిపించారు. వివేక శ‌వం వ‌ద్ద వాళ్లు ఉన్నారు. వివేకానంద‌రెడ్డి త‌ల‌కు, ఛాతిపై త‌గిన బ‌ల‌మైన గాయాల‌కు జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి కుట్లు వేశారు. వీళ్లు రాజారెడ్డి, గంగిరెడ్డికి సంబంధించిన ఆస్ప‌త్రుల్లో వైద్యులు.
వివేక హ‌త్య‌కు సంబంధించిన ఫిర్యాదును శంక‌రెడ్డి చెప్పిన‌ట్టుగా పీఏ కృష్ణారెడ్డి రాశాడు. ఈ కేసులో ఏ1గా గంగిరెడ్డి, ఏ3గా ఉమాశంక‌ర్ రెడ్డి, ఏ5గా శివ‌శంక‌ర్ రెడ్డి ఉన్నారు. వివేకానంద‌రెడ్డి హ‌త్య‌ను గుండెపోటుగా తొలుత ప్ర‌చారం చేసిన మీడియా వైఎస్ భార‌తిరెడ్డిది. ఆ త‌రువాత ప్రెస్ మీట్ పెట్టి గుండెపోటును ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి నిర్థారించాడు. మళ్లీ ఇప్పుడు ఎస్పీ మీద కేసు పెట్టింది ఎవరు ?? అంటే ఉద‌య కుమార్ రెడ్డి. ఇలా ప‌లు ఆధారాల‌తో సీబీఐ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసును కొలిక్కి తీసుకొస్తోన్న స‌మ‌యంలో ఇంకా టీడీపీపై ఆ హ‌త్య‌ను మోప‌డానికి వైసీపీ ప్ర‌య‌త్నించ‌డం దివాలాకోరుత‌న‌మే.మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య వెనుక టీడీపీ ఉంద‌ని చంద్ర‌బాబును టార్గెట్ చేస్తూ ఏపీ స‌ర్కార్ స‌ల‌హాదారుడుసజ్జల రామకృష్ణారెడ్డి ప్ర‌చారం చేయ‌డం గ‌మ‌నార్హం. నిందితులు అంద‌రికీ నాయ‌కునిగా జ‌గ‌న్ ఉన్నాడు. ఆయ‌న చ‌లువ‌తోనే రాజ‌కీయంగా కొంద‌రు ప్ర‌త్య‌క్షంగా మ‌రికొంద‌రు ప‌రోక్షంగా ఉన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇవ్వ‌డ‌దాన్ని కూడా చంద్ర‌బాబుకు అంట‌గ‌ట్టే ప్ర‌య‌త్నం వైసీపీ చేయ‌డం దిగ‌జారుడుత‌న‌మే.

వివేక కుమార్తె డాక్ట‌ర్ సునీతారెడ్డి ఇప్ప‌టికే సీబీఐకి స్ప‌ష్ట‌మైన వాగ్మూలం ఇచ్చింది. పైగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లిసిన‌ప్పుడు ఆయ‌న ఏమ‌న్నాడో కూడా చెప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కు 11 కేసులు ఉన్నాయ‌ని, ఇంకో కేసు కింద బాబాయ్ మ‌ర్డ‌ర్ ప‌రిగ‌ణిస్తాన‌ని జ‌గ‌న్ చెప్ప‌డ‌ని సునీత అంటోంది. రాజ‌కీయ కోణం నుంచి ఆ హ‌త్య‌ను జ‌గ‌న్ చేశాడ‌ని ఆమె చెబుతోంది. కుటుంబ‌లోని గొడ‌వ‌ల‌ను బ‌య‌ట‌కు తీసుకురావొద్ద‌ని వార్నింగ్ ఇచ్చాడ‌ని వాగ్మూలం ఉంది. ఆమె భ‌ర్త రాజ‌శేఖ‌ర్ రెడ్డి కూడా ఇంచుమించు సునీత మాదిరిగానే వాగ్మూలం ఇచ్చాడు. వివేక భార్య సౌభాగ్య‌మ్మ కూడా జ‌గ‌న్ కుట్రపై అనుమానం వ్య‌క్త. ప‌రుస్తూ వాగ్మూలం ఇవ్వ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది.
డాక్ట‌ర్ సునీత ఇచ్చిన వాగ్మూలం ప్ర‌కారం ప్ర‌స్తుతం ఎంపీ అవినాష్ ను విచారించేందుకు సీబీఐ సిద్ధం అయింది. ఆ త‌రువాత జ‌గ‌న్ ను కూడా విచారించ‌డానికి అవ‌కాశం లేక‌పోలేదు. ఇప్ప‌టికే జ‌గ‌న్ ను విచారించాల‌ని విప‌క్షాలు సీబీఐపై ఒత్తిడి తెస్తున్నాయి. సీబీఐ ఏమి చెప్పిన‌ప్ప‌టికీ వివేక హ‌త్య వెనుక జ‌గ‌న్ ఉన్నాడ‌ని ప్ర‌జ‌లు విశ్వ‌సిస్తున్నార‌ని సీపీఐ నారాయ‌ణ స‌ర్టిఫికేట్ ఇచ్చేశాడు. ఇవ‌న్నీ చూస్తుంటే, మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య ఏపీ సీఎం జ‌గ‌న్ వాల‌కాన్ని అనుమానించేలా చేస్తోంది.